నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, హైదరాబాద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, హైదరాబాద్
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, హైదరాబాద్
ఇతర పేర్లు
NIFT, నిఫ్ట్
స్థాపితం1995
వ్యవస్థాపకుడుభారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ
చిరునామహైటెక్ సిటీ ఎదురుగా, సైబరాబాద్ పోస్ట్, మాదాపూర్, హైదరాబాద్, తెలంగాణ, 500081, భారతదేశం
17°26′58″N 78°22′59″E / 17.4494727°N 78.3830128°E / 17.4494727; 78.3830128
కాంపస్Urban, 8 acres (3.2 ha)
జాలగూడుhttps://nift.ac.in/hyderabad/
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, హైదరాబాద్ is located in Telangana
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, హైదరాబాద్
Location in Telangana
హైదరాబాదులోని నిఫ్ట్ క్యాంపస్


నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) హైదరాబాద్ అనేది ఫ్యాషన్, డిజైనింగ్, టెక్నాలజీ, మేనేజ్‌మెంట్‌ లలో కోర్సులను అందించే సంస్థ. దీని ప్రధాన కార్యాలయం న్యూ ఢిల్లీలో ఉంది.[1] దీని 18 క్యాంపస్‌లలో నిఫ్ట్ హైదరాబాద్ ఒకటి. ఈ సంస్థ మాదాపూర్‌ లో హైటెక్ సిటీ మెట్రో స్టేషను సమీపంలో ఉంది.[2][3]

దేశవ్యాప్తంగా ఉన్న ఈ సంస్థల్లో నాలుగేళ్ల వ్యవధితో యూజీ, రెండేళ్ల వ్యవధితో పీజీ కోర్సులు అందిస్తున్నారు. యూజీ స్థాయిలో యూక్సెసరీ డిజైన్, నిట్‌వేర్‌ డిజైన్, ఫ్యాషన్‌ కమ్యూనికేషన్, లెదర్‌ డిజైన్, ఫ్యాషన్‌ డిజైన్, టెక్స్‌టైల్‌ డిజైన్‌ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఫ్యాషన్‌ టెక్నాలజీ కోర్సు కూడా ఉంది. కాగా పీజీలో డిజైన్, ఫ్యాషన్‌ మేనేజ్‌మెంట్, ఫ్యాషన్‌ టెక్నాలజీ కోర్సులు ఉన్నాయి. [4]

నిఫ్ట్ హైదరాబాద్ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న 18 క్యాంపస్‌లలో ప్రతీయేటా యూజీ, పీజీ కోర్సులలో ప్రవేశాలకు జాతీయ స్థాయిలోఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తారు.[5]

టెక్స్‌టైల్‌, ఫ్యాషన్‌, అప్పారెల్‌, క్రాఫ్ట్‌, డిజైన్‌, మేనేజ్‌మెంట్‌ అండ్‌ టెక్నాలజీ విభాగాల్లో పీహెచ్‌డీ[6] చేసే అవకాశం కూడా ఉంది. ఫుల్‌ టైం, పార్ట్‌ టైం కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఫుల్‌ టైం ప్రోగ్రామ్‌ వ్యవధి నాలుగేళ్లు. పార్ట్‌ టైం ప్రోగ్రామ్‌ వ్యవధి ఆరేళ్లు.

కంటిన్యూయింగ్‌ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రామ్‌లు[7]

[మార్చు]
  • ఏడాది వ్యవధి గల ఫ్యాషన్‌ క్లాతింగ్‌ టెక్నాలజీ (ఎఫ్‌సీటీ)
  • మూడు నెలల వ్యవధి గల అప్పారెల్‌ రిటైలింగ్‌ అండ్‌ విజువల్‌ మర్చండైజింగ్‌ (ఏఆర్‌వీఎం)
  • మూడు నెలల వ్యవధి గల ఫ్యాషన్‌ బ్రాండింగ్‌ అండ్‌ సప్లయ్‌ చెయిన్‌ (ఎఫ్‌బీఎస్‌సీ)

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Crossette, Barbara (21 జూన్ 1989). "New Fashion School in India Draws From a Rich Heritage". The New York Times.
  2. NIFT needs a bit of ‘localisation' - HYDB - The Hindu
  3. The Hindu : The business of fashion
  4. "పిలుస్తోంది.. ఫ్యాషన్‌ ప్రపంచం". web.archive.org. 9 డిసెంబరు 2022. Archived from the original on 9 డిసెంబరు 2022. Retrieved 9 డిసెంబరు 2022.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  5. "పిలుస్తోంది.. ఫ్యాషన్‌ ప్రపంచం". web.archive.org. 9 డిసెంబరు 2022. Archived from the original on 9 డిసెంబరు 2022. Retrieved 9 డిసెంబరు 2022.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  6. "Fashion technology: అడ్మిషన్లకు వేళాయె! | Admissions in National Institute of Fashion Technology ms spl". web.archive.org. 9 డిసెంబరు 2022. Archived from the original on 9 డిసెంబరు 2022. Retrieved 9 డిసెంబరు 2022.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  7. "Hyderabad NIFTలో కంటిన్యూయింగ్‌ ఎడ్యుకేషన్‌ | National Institute of Fashion Technology-MRGS-Education". web.archive.org. 9 డిసెంబరు 2022. Archived from the original on 9 డిసెంబరు 2022. Retrieved 9 డిసెంబరు 2022.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)