Jump to content

హైటెక్ సిటీ మెట్రో స్టేషను

అక్షాంశ రేఖాంశాలు: 17°22′41″N 78°28′48″E / 17.378055°N 78.480005°E / 17.378055; 78.480005
వికీపీడియా నుండి
హైటెక్ సిటీ మెట్రో స్టేషను
హైదరాబాదు మెట్రో స్టేషను
General information
ప్రదేశం7/ఎ/2, హైటెక్ సిటీ రోడ్డు, జైహిద్ ఎన్‌క్లేవ్, సైబర్ టవర్స్ సమీపంలో, హైటెక్ సిటీ, హైదరాబాదు, తెలంగాణ - 500081[1]
అక్షాంశరేఖాంశాలు17°22′41″N 78°28′48″E / 17.378055°N 78.480005°E / 17.378055; 78.480005
ట్రాకులు2
Construction
Structure typeపైకి
Depth7.07 మీటర్లు
Platform levels2
History
ప్రారంభంమార్చి 20, 2019; 6 సంవత్సరాల క్రితం (2019-03-20)
Services
Lua error in మాడ్యూల్:Adjacent_stations at line 237: Unknown line "Blue".

హైటెక్ సిటీ మెట్రో స్టేషను, హైదరాబాదులోని హైటెక్ సిటీ ప్రాంతంలో ఉన్న మెట్రో స్టేషను. హైదరాబాద్ మెట్రో నీలిరంగు లైనులో ఉన్న ఈ మెట్రో స్టేషను 2019లో ప్రారంభించబడింది.[2][3] దీని ఎత్తు 60 అడుగులు (18 మీటర్లు) గా ఉంది.[4] హిటెక్ సిటీ మెట్రో స్టేషన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, హైదరాబాదు నెక్స్ట్ గల్లెరియా మాల్ (పివిఆర్ ఐకాన్ మల్టీప్లెక్స్) సమీపంలో ఈ మెట్రో స్టేషను ఉంది.[5] ఎల్ అండ్ టి మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన హైదరాబాదు నెక్స్ట్ గల్లెరియా మాల్[6] రెండు ఎకరాలలో విస్తరించి (సుమారు 2,00,000 చదరపు అడుగులు లేదా 19,000 చదరపు మీటర్లు) ఉంది.[7][8]

హైదరాబాదులో అత్యంత రద్దీగా ఉండే మెట్రో స్టేషన్లలో హైటెక్ సిటీ మెట్రో స్టేషను ఒకటి.[9] ఈ స్టేషను నుండి ప్రతిరోజూ సుమారు 42,000మంది ప్రయాణం చేస్తున్నారు.[10][11] నాగోల్ మెట్రో స్టేషను నుండి ప్రారంభమైన ఈ కారిడార్ రహేజా మైండ్స్పేస్ జంక్షన్ (రాయదుర్గం మెట్రో స్టేషను) లోని టెర్మినల్ పాయింట్ వద్ద ముగుస్తుంది.[12][13]

హైదరాబాదు మెట్రో (హైటెక్ సిటీ సైబర్ టవర్స్ వైపు)

చరిత్ర

[మార్చు]

2019, మార్చి 20న ఈ మెట్రో స్టేషను ప్రారంభించబడింది.

స్టేషను వివరాలు

[మార్చు]

నిర్మాణం

[మార్చు]

హైటెక్ సిటీ ఎలివేటెడ్ మెట్రో స్టేషను హైదరాబాద్ మెట్రో నీలిరంగు లైనులో ఉంది.

సౌకర్యాలు

[మార్చు]

స్టేషన్లలో కింది నుండి పై ప్లాట్‌ఫాం వరకు మెట్లు, ఎలివేటర్లు, ఎస్కలేటర్లు ఉన్నాయి.[1]

స్టేషన్ లేఔట్

[మార్చు]
కింది స్థాయి
ప్రయాణీకులు తమ వాహనాలను పార్కింగ్ చేసేది.[1]
మొదటి స్థాయి
టికెట్ కార్యాలయం లేదా టికెట్ వెండింగ్ యంత్రాలు (టీవీఎంలు) ఇక్కడ ఉంటాయి. దుకాణాలు, శౌచాలయాలు, ఏటిఎంలు, ప్రథమ చికిత్స మొదలైన ఇతర సౌకర్యాలు ఈ ప్రాంతంలో ఉంటాయి.[1]
రెండవ స్థాయి
ఇది రెండు ప్లాట్‌ఫాంలను కలిగి ఉంటుంది. ఇక్కడి నుండి రైళ్ళు ప్రయాణికులను తీసుకువెళతాయి.[1]
జి స్థాయి నిష్క్రమణ/ప్రవేశం
ఎల్ 1 మెజ్జనైన్ ఛార్జీల నియంత్రణ, స్టేషన్ ఏజెంట్, మెట్రో కార్డ్ విక్రయ యంత్రాలు, క్రాస్ఓవర్
ఎల్ 2 సైడ్ ప్లాట్‌ఫాం నెం -1, ఎడమవైపు తలుపులు తెరుచుకుంటాయి Handicapped/disabled access
దక్షిణ దిశ నాగోల్ వైపు →
ఉత్తర దిశ ← హైటెక్ సిటీ వరకు ← ←
సైడ్ ప్లాట్‌ఫాం నెం -2, ఎడమవైపు తలుపులు తెరుచుకుంటాయి Handicapped/disabled access
ఎల్ 2

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-01-25. Retrieved 2020-12-11.
  2. "Hyderabad metro to commission line up to Hitec City by year end".
  3. "Hyderabad metro stations we keenly await".
  4. "Punjagutta, Hitec Metro stations to stand tall".
  5. "'Reverse' metro construction under way at Hi-Tec City".
  6. "L&TMRH to open two more malls".
  7. "Hyderabad Next Galleria mall in Hitec City operational".
  8. "Get ready for a shopping spree: 3 million sft mall space in the offing at Hi-Tec City".
  9. "HiTec City metro travellers can expect better frequency".
  10. "Techies take to metro and how! Hitec city line registers record footfall".
  11. "Another feather in Metro Rail's cap".
  12. "Which way will airport metro go?".
  13. "Metro rail line to Raidurg another two years away".

ఇతర లంకెలు

[మార్చు]