Jump to content

నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (NCTE)

వికీపీడియా నుండి
నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్
సంకేతాక్షరంNCTE
అవతరణ1995; 30 సంవత్సరాల క్రితం (1995)
కేంద్రస్థానంన్యూ ఢిల్లీ
ప్రాంతం
  • G-7, సెక్టార్-10, ద్వారక, ల్యాండ్‌మార్క్ - మెట్రో స్టేషన్ దగ్గర, న్యూఢిల్లీ - 110075 భారతదేశం
చైర్ పర్సన్సంతోష్ సారంగి, IAS
ప్రధాన విభాగంకౌన్సిల్
అనుబంధ సంస్థలుఉన్నత విద్యా శాఖ, విద్యా మంత్రిత్వశాఖ

నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (NCTE) అనేది 1995లో నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ యాక్ట్ 1993 ప్రకారం భారతీయ విద్యా వ్యవస్థలో ప్రమాణాలు, విధానాలు, ప్రక్రియలను అధికారికంగా పర్యవేక్షించడానికి భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన చట్టబద్ధమైన సంస్థ. ఉపాధ్యాయ విద్యకు సంబంధించి అన్ని విషయాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ఈ మండలి పని చేస్తుంది. విద్యా రంగం పరంగా విజయవంతంగా పనిచేసినప్పటికీ, ఉపాధ్యాయ విద్య ప్రమాణాల నిర్వహణలో, దేశంలో నాసిరకం ఉపాధ్యాయ విద్యా సంస్థల సంఖ్య పెరుగుదలను నిరోధించడంలో ఇది ప్రముఖపాత్ర పోషిస్తుంది.[1][2]

చరిత్ర

[మార్చు]

1995కి ముందు, NCTE 1973 నుండి "ఉపాధ్యాయ విద్య" అభివృద్ధి, పురోగతిని చూసేందుకు ప్రభుత్వ సలహా సంస్థగా ఉండేది. ప్రారంభంలో ఇది జాతీయ విద్యా పరిశోధనా శిక్షణా సంస్థ (NCERT) కు అనుబంధ సంస్థగా ఉండేది. తర్వాత భారత ప్రభుత్వం ప్రత్యేక చట్టం ద్వారా వేరు పరచి స్వతంత్ర ప్రతిపత్తి కలిపించారు.[3]

లక్ష్యాలు

[మార్చు]
  • దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ విద్యా వ్యవస్థ ప్రణాళికాబద్ధమైన, సమన్వయ అభివృద్ధిని సాధించడం.
  • ఉపాధ్యాయ విద్యా వ్యవస్థలో నియమాలు, ప్రమాణాలను నియంత్రించడం.
  • ఇది పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ, ప్రైమరీ, సెకండరీ, సీనియర్ సెకండరీ దశలు, పార్ట్-టైమ్ విద్య, వయోజన విద్య (కరస్పాండెన్స్), దూరవిద్యా కోర్సులలో బోధించే వ్యక్తులకు శిక్షణ ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుంది.[4]

ప్రస్తుత లక్ష్యాలు

[మార్చు]
  • బహుళ-క్రమశిక్షణా లేదా బహుళ ఉపాధ్యాయ విద్యా కార్యక్రమాలతో కూడిన మిశ్రమ సంస్థలలో ఉపాధ్యాయ విద్యను ఏర్పాటు చేయడం.
  • ప్రతి పాఠ్యప్రణాళిక యోగా విద్య, ICT, సమగ్ర విద్య మొదలైన వాటికి ప్రాముఖ్యతనివ్వడం.
  • ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ (ODL) అంతర్నిర్మిత నాణ్యత హామీ విధానాలతో అభివృద్ధి చెందించి పనితీరులో మెరుగుపర్చడం

మూలాలు

[మార్చు]
  1. "National Portal of India".
  2. "NCTE,National Council for Teacher Education, Scholarships In India". Scholarships In India and International. Retrieved 8 April 2018.
  3. "NCTE at a Glance - NCTE : National Council For Teacher Education". ncte-india.org. Archived from the original on 12 ఆగస్టు 2016. Retrieved 8 April 2018.
  4. "NCTE : National Council For Teacher Education". www.ncte-india.org. Archived from the original on 8 May 2015. Retrieved 8 April 2018.