Jump to content

నేషనల్ సెంటర్ ఫర్ ది పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ (చైనా)

వికీపీడియా నుండి
నేషనన్ సెంటర్ ఫర్ ది పర్ఫార్మింగ్ ఆర్ట్స్
సాధారణ సమాచారం
రకంకళాశాల
ప్రదేశంబీజింగ్, చైనా
చిరునామానెం.2 పశ్చిమ చంగన్ అవెన్యూ, క్సైచెంగ్ జిల్లా, బీజింగ్
నిర్మాణ ప్రారంభండిసెంబరు 2001
పూర్తి చేయబడినదిజులై 2007
ప్రారంభండిసెంబరు 2007
వ్యయం€300 మిలియన్లు
ఎత్తు46.28 మీ[1]
సాంకేతిక విషయములు
నిర్మాణ వ్యవస్థకృత్రిమ సరస్సు మధ్యలో ఉన్న టైటానియం, గాజు కవచం కలిగిన ఎలిప్సిడ్ గోపురం
నేల వైశాల్యం219,400 మీ2[2]
రూపకల్పన, నిర్మాణం
వాస్తు శిల్పిపాల్ ఆర్డ్రీవ్

నేషనల్ సెంటర్ ఫర్ ది పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ (నేషనల్ గ్రాండ్ థియేటర్), అనేది బీజింగ్ లో ఒపేరా హౌస్ కలిగి ఉన్న ఒక ఆర్ట్స్ సెంటర్. ఈ కేంద్రం, ఒక కృత్రిమ సరస్సు మధ్యలో ఉన్నది. దీనిని టైటానియం, గాజుతో ఒక ఎలిప్సిడ్ గోపురంగా నిర్మించారు. ఇక్కడ మూడు గదులు ఉన్నవి, వాటి వైశాల్యం మొత్తం 12,000 చ.కి., వాటిలో 5,452 ప్రేక్షకులు సులభతరంగా సరిపోతారు. ఈ భవనాన్ని ఫ్రెంచ్ ఆర్కిటెక్ట్ పాల్ ఆండ్రూ చే రూపొందించారు. భవన నిర్మాణం డిసెంబరు 2001 లో మొదలై, డిసెంబర్ 2007 లో ప్రారంభ కచేరీకి ప్రారంభమైంది.

ఆర్కిటెక్చర్

[మార్చు]
ది నేషనల్ సెంటర్ ఫర్ ది పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అండ్ ది గ్రేట్ హాల్ ఆఫ్ ది పీపుల్ భవనాలు

థియేటర్ యొక్క వెలుపలి భాగం టైటానియంతో నిర్మించిన ఒక గాజు గోపురం, ఈ భవనం చుట్టూ మానవ నిర్మిత సరస్సు ఉంది. ఇది నీటి మీద తేలే గుడ్డులాగా, లేదా ఒక నీటి బొట్టు లాగా కనిపిస్తుంది. ఇది చూసిన వెంటనే గుర్తించదగినదిగా, ఎంతో చాకచక్యంగా రూపొందించబడింది.

తూర్పు నుంచి పడమరకు 212 మీటర్లు, ఉత్తర-దక్షిణ దిశలో 144 మీటర్లలో 46 మీటర్ల ఎత్తున గోపురం ఉంటుంది. భవన ప్రధాన ద్వారం ఉత్తర భాగంలో ఉంది. సరస్సు కిందకు వెళ్తున్న మార్గంద్వారా అతిథులు భవనంలోకి ప్రవేశిస్తారు.

ప్రదేశం

[మార్చు]
ప్రధాన ప్రవేశద్వారంగా పనిచేసే ఎన్.సి.పి.యే యొక్క ఉత్తర ద్వారం

థియేమెన్ స్క్వేర్, పీపుల్ గ్రేట్ హల్ ఆఫ్ ది పీపుల్ భవనాలకు, ఫర్బిడెన్ సిటీ దగ్గర ఈ థియేటరు భవిష్యత్తు రూపకల్పనతో ఉండడంతో దీని నిర్మాణం వివాదం సృష్టించింది.[3] పురాతన సాంప్రదాయిక చైనీస్ నిర్మాణ శైలి ఎంతో విలువైనది అయినప్పటికీ, బీజింగ్ లో ఆధునిక నిర్మాణ శైలిని కలిగి ఉండాలని, దేశం యొక్క రాజధాని ఒక అంతర్జాతీయ నగరంగా గొప్ప ప్రాముఖ్యతను కలిగిన ఉండాలని ఫ్రెంచ్ ఆర్కిటెక్ట్ పాల్ ఆండ్రూ అన్నారు. అతను ఈ భవనాన్ని ఎంతో చాకచక్యంగా నిర్మించారు.

ప్రదర్శనలు, ఇతర వేదికలు

[మార్చు]
రాత్రి సమయంలో 

ఈ భవనంలో మూడు ప్రధాన ప్రదర్శనశాలలు ఉన్నాయి:

  • ఒపేరాలు, బ్యాలెట్, నృత్యాలకు గాను 2,416 సీట్ల సామర్ధ్యం కలిగిన ఒపేరా హాలును ఉపయోగిస్తారు.
  • కచేరీలు, రికార్డులకు గాను 2,017 సీట్ల సామర్ధ్యం కలిగిన సంగీతశాలను  ఉపయోగిస్తారు.
  • నాటకాలు, బీజింగ్ ఒపేరా కోసం 1,040 సీట్ల సామర్ధ్యం కలిగిన థియేటర్ హాలును ఉపయోగిస్తారు.[4]

మూలాలు

[మార్చు]

బాహ్య లింకులు

[మార్చు]