నేహా జోషి
Appearance
నేహా జోషి | |
---|---|
జననం | |
వృత్తి | నటి, నిర్మాత |
క్రియాశీల సంవత్సరాలు | 2000–ప్రస్తుతం |
నేహా జోషి, మహారాష్ట్రకు చెందిన సినిమా నటి, నిర్మాత.[1] 2010లో జెండా, 2014లో పోస్టర్ బాయ్జ్ సినిమాలలో నటించింది. ఏక్ మహానాయక్ - డా.బిఆర్ అంబేద్కర్ సిరీస్‌లో బిఆర్ అంబేద్కర్ తల్లి భీమాబాయిగా కూడా నటించింది.[2]
జననం
[మార్చు]నేహా 1986, డిసెంబరు 7న మహారాష్ట్రలోని పూణే నగరంలో జన్మించింది.
నటనారంగం
[మార్చు]కాలేజీ రోజుల్లో ఇంటర్ కాలేజియేట్ డ్రామా పోటీల్లో చురుగ్గా పాల్గొనేది. 2000లో క్షన్ ఏక్ ప్యూర్ అనే మరాఠీ కమర్షియల్ నాటకంలోనూ, ఊన్ పాస్ అనే టెలివిజన్ మరాఠీ సీరియల్ లోనూ నటించి తన నటనాజీవితాన్ని ప్రారంభించింది. మరాఠీ సినిమాలు, నాటకాలు, టెలివిజన్ సీరియల్స్‌లో నటించింది. కొన్ని హిందీ సినిమాల్లో కూడా నటించింది. సమీర్ పాటిల్ దర్శకత్వం వహించిన పోస్టర్ బాయ్జ్ అనే మరాఠీ సినిమాలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 2016లో ఉకాలి అనే మరాఠీ షార్ట్ ఫిలింని కూడా నిర్మించింది.
నటించినవి
[మార్చు]సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా | పాత్ర | భాష |
---|---|---|---|
2009 | జెండా | మరాఠీ | |
2009 | సుందర్ మఝా ఘర్ | మరాఠీ | |
2012 | స్వప్న తుఝే ని మాఝే | మరాఠీ | |
2013 | జబ్ లవ్ హువా | హిందీ | |
2013 | ప్రేమ్ మ్హంజే ప్రేమ్ మ్హంజే ప్రేమ్ ఆస్తా | మరాఠీ | |
2013 | బచ్ కే జరా భూత్ బంగ్లే మే | హిందీ | |
2014 | నాటి | మంజుల | మరాఠీ |
2014 | హవా హవాయి | తారామతి | హిందీ |
2014 | పోస్టర్ బాయ్జ్ | సదానంద్ భార్య | మరాఠీ |
2014 | స్టాటర్ డే సండే | మరాఠీ | |
2015 | డ్రీమ్ మాల్ | సాయి | మరాఠీ |
2015 | సచాయి ని జీత్ | గుజరాతీ | |
2016 | పోస్టర్ గర్ల్ | ప్రియాంక | మరాఠీ |
2016 | లాల్‌బాగ్చి రాణి | స్వీటీ | మరాఠీ |
2017 | బాగ్తోస్ కే ముజ్రా కర్ | మరాఠీ | |
2017 | ఉక్లీ | అనురాధ | మరాఠీ |
2018 | వన్ నైట్ అవుట్ | హిందీ | |
2018 | న్యూడ్ | మానిక్ | మరాఠీ |
2018 | ఆరోన్ | కాకు | మరాఠీ |
2018 | ఫర్జాంద్ | కమలి | మరాఠీ |
2019 | నశిబ్వాన్ | రేష్మా | మరాఠీ |
2020 | ఆథ్షే ఖిడ్క్యా నవ్షే దార్ | జై | మరాఠీ |
2020 | మీడియం స్పైసి[3][4] | మరాఠీ |
టెలివిజన్
[మార్చు]సంవత్సరం | టివి సిరీస్ | పాత్ర | భాష | మూలాలు |
---|---|---|---|---|
2005 | ఊన్ పాస్ | మరాఠీ | ||
2009-2010 | అవఘాచి సంసార్ | సంయోగిత భోసలే | మరాఠీ | |
2014-2016 | క రే దురవ | రజనీ దేశ్‌ముఖ్ | మరాఠీ | [5] |
2017 | జ్యోతిబా ఆని సావిత్రీబాయి ఫూలే | సావిత్రీబాయి ఫూలే | మరాఠీ | [6] |
2019-2020 | ఏక్ మహానాయక్ - డా. బిఆర్ అంబేద్కర్ | భీమాబాయి రాంజీ సక్పాల్-అంబేద్కర్ | హిందీ | [7] |
మూలాలు
[మార్చు]- ↑ "Neha Joshi". marathi.tv. Retrieved 2022-09-20.
- ↑ "'Ek Mahanayak - Dr. B.R. Ambedkar' actor Neha Joshi says, 'I've always been experimental at heart' - The Times of India". The Times of India.
- ↑ Medium Spicy Movie: Showtimes, Review, Trailer, Posters, News & Videos | eTimes, retrieved 2022-09-20
- ↑ "Neha Joshi and Pushkaraj Chirputkar join 'Medium Spicy'". sakaltimes.com (in ఇంగ్లీష్). 9 September 2019. Retrieved 2022-09-20.[permanent dead link]
- ↑ "Ka Re Durava Zee Marathi Tv Serial Cast Photos Actress Wiki Actor". Marathi Stars. 10 August 2014. Retrieved 2022-09-20.
- ↑ "Is Neha Joshi heading Tollywood? - Times of India". The Times of India. Retrieved 2022-09-20.
- ↑ "Marathi actress Neha Joshi to debut as a mother with upcoming show Ek Mahanayak- Dr. B.R Ambedkar - Times of India". The Times of India. Retrieved 2022-09-20.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో నేహా జోషి పేజీ