Jump to content

నైఫియూ రియో

వికీపీడియా నుండి

నాగాలాండ్ భారత దేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం.నాగాలాండ్ ముఖ్యమంత్రి నాగాలాండ్ రాష్ట్రానికి ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్[1].భారత రాజ్యాంగం ప్రకారం గవర్నర్ ఒక రాష్ట్ర న్యాయాధికారి.కానీ వాస్తవ కార్యనిర్వహణ అధికారం ముఖ్యమంత్రి కి మాత్రమే ఉంటుంది. నాగాలాండ్ శాసనసభకు ఎన్నికలు జరిగిన తర్వాత సాధారణంగా మెజార్టీ సీట్లు ఉన్నటువంటి పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానిస్తారు.గవర్నర్ ముఖ్యమంత్రిని నియమిస్తాడు.అతని మంత్రిమండలి సమిష్టి బాధ్యత వహిస్తుంది.ముఖ్యమంత్రి పదవి కాలం ఐదు సంవత్సరాలు.2023 వ సంవత్సరం మార్చి రెండో తేదీన వెలువడిన శాసనసభ ఎన్నికల ఫలితాలలో ముఖ్యమంత్రిగా నైఫియూ రియో గెలవడం జరిగింది[2].ఆయన 2023 వ సంవత్సరం మార్చి 7న ప్రమాణ స్వీకారం చేశారు .రాజధాని కోహిమాలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ లా గణేషన్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు .నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్డిపిపి ) అధినేత అయినా 72 ఏళ్ల నైఫియూ రియో నాగాలాండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఇది అయిదో సారి[3].

  1. Bureau, The Hindu (2023-03-07). "Neiphiu Rio takes oath as Nagaland CM for fifth term". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2023-08-31.
  2. "Neiphiu Rio takes oath as Nagaland CM for fifth term in presence of PM Modi". Hindustan Times (in ఇంగ్లీష్). 2023-03-07. Retrieved 2023-08-31.
  3. "NDPP leader Neiphiu Rio takes oath as chief minister of Nagaland for fifth time". The Times of India. 2023-03-07. ISSN 0971-8257. Retrieved 2023-08-31.