నైలాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నైలాన్ నైలాన్నైలాన్ 6,6 యూనిట్
సాంద్రత 1.15 g/cm3
విద్యుద్వాహకత (σ) 10−12 S/m
ఉష్ణవాహకత 0.25 W/ (m·K)
ద్రవీభవన స్థానం 463–624 K
190–350 °C
374–663 °F

నైలాన్ అనేది సింథటిక్ పాలిమర్యొక్క జాతిసంబంధ నామము, వీటిని జాతి సంబంధంగా పాలిమైడ్స్ అంటారు, మొట్టమొదటగా 1935 ఫిబ్రవరి 28న వాలిస్ కారోతర్స్ డ్యుపోంట్లో ఉత్పత్తి చేసాడు. నైలాన్ అత్యధికంగా ఉపయోగించే పాలిమర్స్ లో ఒకటి.

పర్యావలోకనం[మార్చు]

నైలాన్ థెర్మోప్లాస్టిక్ సిల్కీ మెటీరియల్, ఇది మొదటగా వ్యాపారాత్మకంగా నైలాన్ పళ్ళుగల టూత్ బ్రష్ లో (1938) ఉపయోగించారు, ఇవి తరువాత స్త్రీల స్టాకింగ్స్ లో ("నైలాన్స్"; 1940) ఉపయోగించడం బాగా ప్రాచుర్యం పొందింది. ఇది పునరావృతమైన పెప్టయిడ్ బంధాలు లేదా అమయిడ్ బంధాలతో ఉండి తరచుగా పాలిమైడ్ (PA) గా పిలువబడుతుంది. నైలాన్ మొట్టమొదటి వ్యాపారాత్మకంగా విజయవంతమైన సింథటిక్ పాలిమర్. ఫైబర్ అన్వయాలకోసం నైలాన్ తయారుచేయడంకోసం రెండు సామాన్య పద్ధతులున్నాయి. ఒక పద్ధతిలో ఆమ్ల (COOH) జట్టులోని కణాలతో అమయిన్ (NH2) తో ఉన్న జట్టు కణాలు ప్రతి చివర చర్య నొందుతాయి. రెండు ఆమ్ల విభాగాలని మరియు రెండు అమయిన్ లని విడదీసే కార్బన్ అణువుల సంఖ్యని బట్టి ఫలిత నైలాన్ కు పేరునిస్తారు. ఇవి కణబరువుయొక్క మధ్యస్థ మోనోమర్స్గా అవుతాయి, అవి తరువాత పొడవైన పాలిమర్ గొలుసుగా మారడానికి చర్యనొందుతాయి.

నైలాన్ సిల్క్కి సింథటిక్ ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది, IIవ ప్రపంచయుద్ధ సమయంలో సిల్క్ కొరత ఏర్పడినపుడు అనేక ఉత్పత్తులులలో దీనిని బదులుగా వాడారు. మిలటరీ అనువర్తనాలైన పారాచ్యూట్లు మరియు ఫ్లాక్ వేస్ట్స్ మొదలైనవాటిలో సిల్క్ కి బదులు దీనినే వాడుతున్నారు, దీనిని అనేక రకాల వాహన చక్రాలలో వాడతారు.

నైలాన్ ఫైబర్స్ బట్టలు, పెళ్ళికూతురి ముసుగులు, తివాచీలు, సంగీతపు తీగలు మరియు తాడు మొదలైన అనేక రకాల అనువర్తనాలలో వాడతారు.

ఘన నైలాన్ ను మెషీన్ నట్లు, గేర్లు మరియు ఇదివరకు లోహంతో తయారుచేయబడిన తక్కువ నుంచి మధ్యరకం ఒత్తిడి తట్టుకొనే భాగాల వంటి యాంత్రిక భాగాల తయారికి ఉపయోగిస్తారు. . ఇంజనీరింగ్ స్థాయి నైలాన్ ఎక్సట్రషన్, కేస్టింగ్ మరియు ఇంజక్షన్ మోల్డింగ్ పద్ధతుల ద్వారా తయారుచేయబడుతుంది. ఘన నైలాన్ దువ్వెనలలో ఉపయోగిస్తారు. టైప్ 6/6 నైలాన్ 101 అతి సాధారణ వ్యాపార స్థాయి నైలాన్, నైలాన్ 6 అతి సాధారణ వ్యాపార స్థాయి మలచబడిన నైలాన్. నైలాన్ నిర్మాణ మరియు శక్తి, కాటిన్యాలని పెంచే గ్లాస్ నింపిన రకాలలో, నునుపుదనం పెంచే మాలిబ్డినం సల్ఫైడ్ నింపిన రకాలలో లభ్యమవుతుంది.

అరామిడ్స్ ముఖ్య గొలుసులో సువాసన భాగాలుగల విభిన్నమైన గొలుసు నిర్మాణంగల మరో రకమైన పాలిమైడ్. ఇటువంటి పాలిమర్స్ అద్భుతమైన బాలిస్టిక్ ఫైబర్స్ ను చేస్తాయి.

రసాయన శాస్త్రం[మార్చు]

నైలాన్లు డైఎమైన్ మరియు డైకార్భోక్సాలిక్ ఆమ్లముల సమభాగాలు చర్యనొందటంవలన ఏర్పడిన కండన్సేషన్ కోపాలీమర్స్, కనుక ఆ పెప్టైడ్ బంధాలు పాలీ పెప్టైడ్ బయోపాలీమర్స్ యొక్క ప్రతి మోనోమర్ చివర ఏర్పడతాయి. దీనిలోఉండే రసాయనిక పదార్థాలు కార్భన్, హైడ్రోజన్, నైట్రోజన్, ఆక్సిజన్. సంఖ్యా ప్రత్యయం మోనోమర్స్ దానం చేసిన కార్భన్ల సంఖ్యని స్పష్టం చేస్తాయి; డైఎమైన్ మొదట డైయాసిడ్ తరువాత.

అతి సాధారణ రకం నైలాన్ 6-6, ఈ డైఎమైన్ (హెక్సామిథైలీన్ డైఎమైన్, IUPAC పేరు: 1,6-డైఎమినోహెక్సేన్) మరియు డైయాసిడ్ అడిపిక్ యాసిడ్, IUPAC పేరు: హెక్సేన్-1,6-డైకార్భోక్సిలిక్ యాసిడ్) రెండూ 6 కార్భన్లని పాలిమర్ గొలుసుకి అందిస్తాయి. మిగతా సామాన్య పాలిమర్లలాగా పాలిస్టర్స్ మరియు పాలీయూరేథేన్స్ "పునరావృత భాగాలు" ఒక మోనోమర్ ని గొలుసు మార్పుచెందటానికి వీలుగా కలిగిఉంటాయి. ఈ కోపాలిమర్లో ప్రతి మోనోమర్ ప్రతి చివర ఒకే చర్యా జట్టుని కలిగిఉండడంవల్ల ప్రతి మోనోమర్ మధ్య అమైడ్ బంధంయొక్క దిశ వ్యతిరేకమవుతుంది, ఇవి సహజ పాలిమైడ్ప్రోటీన్లలాగా అన్ని దిశలని కలిగిఉండవు : C కొన-> N కొన.

ప్రయోగశాలలో నైలాన్ 6-6 ను కూడా అడిపిక్ కి బదులుగా అడిపోయల్ క్లోరైడ్ను ఉపయోగించి తయారుచేస్తారు.

కోణాలని సరిగ్గా అంచనా వేయటం కష్టం, 10,000 డాల్టన్స్ (uకణ బరువు వద్ద నాశనాన్ని కలిగించే ఆవాంతరాలుంటాయి. ఈ సమస్యని నివారించడానికి క్రిస్టలైన్, ఘన నైలాన్ ఉప్పు సరిగ్గా ఆమ్లం మరియుమధ్యస్థకారి 1:1 నిష్పత్తిని ఉపయోగించి గది ఉష్ణోగ్రత వద్ద ఏర్పడతాయి. 285 °C కు వేడి చేసినప్పుడు ఉప్పు నైలాన్ పాలిమర్ ను ఏర్పరచడానికి చర్యనొందుతుంది. 20,000 డాల్టన్స్ పైన గొలుసులని యార్నులుగా మార్చడానికి మెలి తిప్పడం అసాధ్యం, కనుకు దీనిని తప్పించుకోవడానికి దాని కణ బరువుని నియంత్రించుకోవడానికి పాలిమర్ చర్య మధ్యలో కొంత ఎసిటిక్ ఆమ్లం స్వేచ్ఛా ఎమైన్ చివరి జట్టుతో చర్యనొందుతుంది.

అభ్యాసంలో ముఖ్యంగా 6,6 కోసం మోనోమర్స్ తరచుగా నీటిద్రావణంతో కలుస్తాయి. ద్రావణం తయారుచేయడానికి ఉపయోగించిన నీరు నియంత్రిత పరిస్థితుల మధ్య ఆవిరవుతుంది, పెరిగిన "ఉప్పు" గాఢత ఆఖరి కణ బరువుకోసం పాలిమరైజ్ అవుతుంది.


డ్యూపోంట్ కు హక్కు గల[1] నైలాన్ 6,6 తో పోటీ పడడానికి ఇతర కంపెనీలు (ముఖ్యంగా జర్మన్ BASF) హోమోపాలిమర్ నైలాన్ 6 లేదా పాలీకాప్రోలాక్టమ్ను తయారుచేసాయి — ఇది సంక్లిష్ట పాలిమర్ కాదు, కానీ రింగ్ తెరుచుకొనే పాలిమరైజేషన్ ద్వారా ఏర్పడుతుంది (ఎమినోకార్పిక్ ఆమ్ల పాలిమరైజింగ్ కి ప్రత్యామ్నాయంగా చేయబడింది). కాప్రోలాక్టమ్ లోని పెప్టైడ్ బంధాలు ప్రతి చివర ఉత్తేజ జట్లకు గురయ్యి విడిపోయి రెండు క్రొత్త బంధాలుగా కలుస్తాయి, మోనోమర్ పాలిమర్ వెన్నుముఖలో భాగంగా మారుతుంది. ఇటువంటి సందర్భంలో అన్ని ఎమైడ్ బంధాలు ఒకే దిశ వైపుకి మరలుతాయి, కానీ నైలాన్ 6 యొక్క లక్షణాలు కొన్నిసార్లు నైలాన్ 6,6 నుండి విడదీయలేము, ఒక్క ద్రవీభవన ఉష్ణోగ్రతలలో తప్ప (N6 తక్కువది), తివాచీలు, వస్త్రాలు వంటి కొన్ని ఉత్పత్తుల ఫైబర్ లక్షణాలలో కూడా తేడాలుంటాయి. నైలాన్ 9 కూడా ఉంది.


నైలాన్ 5,10 పెంటా మిథైలీన్ డైఎమైన్ మరియు సెబాసిక్ ఆమ్లంనుంచి తయారవుతాయి, నైలాన్ 6,6 కంటే ముందు కేరోథర్స్ పరిశీలించారు దీనికి ఉన్నత లక్షణాలున్నాయి, కానీ తయారు చెయ్యడానికి కొంచెం ఖరీదైనది. ఇదే పేర్లతో కొనసాగించినపుడు, "నైలాన్ 6,12" (N-6,12) లేదా "PA-6,12" అనేది 6C డైఎమైన్ మరియు 12C డైయాసిడ్ యొక్క కోపాలిమర్ . అలాగే N-5,10 N-6,11; N-10,12, మొదలైనవి, మోనోమర్స్ మీద ఆధారంగా డైకార్భోక్సిలిక్ ఆమ్లం/డైఎమైన్ కోపాలిమరైజ్డ్ ఉత్పాదక నైలాన్లను పైన తెలుపలేదు .

ఉదాహరణకి, కొన్ని సువాసనభరిత నైలాన్లు టెరిఫ్తలిక్ ఆమ్లాల (→ కేవ్లార్ ట్వారోన్) లేదా ఐసోఫ్తలిక్ ఆమ్లం (→ నోమెక్స్, వంటి డైయాసిడ్లతో పాలిమరైజ్ చెందుతాయి, ఇవి ఎక్కువగా పాలిస్టర్స్ తో కలుస్తాయి N-6,6/N6 యొక్క కోపాలిమర్స్; N-6,6/N-6/N-12 యొక్క కోపాలిమర్స్ కొన్ని వేరేవి ఉన్నాయి. ఎందుకంటే పాలిమైడ్స్ ఏర్పడే విధానాన్ని బట్టి నైలాన్ శాఖలు, నిఠారు గొలుసులు పరిమితంగా ఉంటాయి. కానీ "నక్షత్ర" శాఖ గల నైలాన్ మూడు లేదా ఎక్కువ ఎమినో జట్లుగల పాలిఎమైన్స్ మరియు డైకార్భోక్సిలిక్ ఆమ్లాల సమ్మేళనాలతో ఏర్పడుతుంది.


సాధారణ సమీకరణం: సెంటర్


ఒక నీటి కణాన్ని ఇచ్చివేసి నైలాన్ ఏర్పడుతుంది. దీని లక్షణాలు మోనోమర్లలోని R మరియు R' జట్లద్వారా తెలుపబడతాయి. నైలాన్ లో 6,6, R = 4C మరియు R' = 6C ఆల్కేన్లుంటాయి, కానీ ఇది గొలుసుకి దానం చేసిన సంఖ్య తెలియటానికి డైయాసిడ్ గొలుసులోని రెండు కార్భోక్సైల్ కార్భన్లని కూడా కలపాలి. కేవ్లార్ లో, రెండూ R మరియు R' బెంజేన్లుంటాయి.

వృత్తాలు.

నైలాన్ ఫైబర్[మార్చు]

ది ఫెడరల్ ట్రేడ్ కమీషన్స్ నైలాన్ ఫైబర్ కిచ్చిన అర్ధ వివరణ: తయారుచేయబడిన ఫైబర్, ఇందులో ఫైబర్ ని ఏర్పరచే పదార్థం పొడవు-గొలుసు సింథటిక్ పాలిమైడ్, ఇవి 85% అమయిడ్ గొలుసులు నేరుగా (-CO-NH-) రెండు ఆలీఫాటిక్ జట్లతో కలుపబడిఉంటాయి.

 • సింథటిక్ థెర్మోప్లాస్టిక్ ఫైబర్ (నైలాన్ తక్కువ ఉష్ణోగ్రతల వద్ద సులభంగా కరుగుతుంది)
 • గుండ్రని, నునుపైన మరియు మెరిసే ఫిలమెంట్ ఫైబర్స్
 • ఖండించే కోణాలు (i) త్రితమ్మె-సిల్క్ ని అనుసరించేవి (ii) బహుతమ్మె-పిన్ను వంటి ఆకారాన్ని మరియు చెయ్యి వంటి ఆకారాన్ని పెంచడానికి.
 • మల్టీఫిలమెంట్, మోనోఫిలమెంట్, పిన్ను లేదా బొటనవ్రేలు మొదలైనవి దీని విస్తృతంగా ఉపయోగించే ఆకారాలు, ఇది పాక్షిక నిర్మిత లేదా పూర్తి ఫిలమెంట్స్ రూపంలో లభ్యమవుతాయి.
 • సాధారణ నైలాన్ కి గుండ్రని అడ్డ విభాగాలుంటాయి, ఇవి కచ్చితమైన ఏకరూపం కలిగి ఉంటాయి. అవి డిలస్టర్డ్ లేదా ద్రావకంలో ముంచబడినప్పుడు తప్ప ఫిలమెంట్స్ సాధారణంగా పూర్తి పారదర్శకంగా ఉంటాయి అప్పుడు ఇవి సూక్ష్మదర్శిని ద్వారా గ్లాస్ రాడ్స్ గా గుర్తించబడతాయి.
 • నైలాన్ యొక్క కణ గొలుసులు పొడవుగా, నేరు మార్పులతో ఉంటాయి కానీ పక్క గొలుసులు లేదా బంధాలు ఉండవు. కోల్డ్ డ్రాయింగ్ (మోడల్ లో స్టెప్ 18) గొలుసులని కలుపుతుంది అందువలన ఇవి పొడవువారీ దిశగా కలిసిఉంటాయి, ఇవి ఎక్కువ క్రిస్టల్ నిర్మితాలు.
 • నైలాన్ రసాయనికంగా సిల్క్ మరియు ఉన్ని ప్రోటీన్ ఫైబర్స్ సంబధితము. ఈ రెండిటికీ కూడా ఒకే రంజక స్థలం కానీ నైలాన్ ఉన్ని కంటే తక్కువ రంజక స్థలాలను కలిగి ఉంటుంది.

నైలాన్ ఉత్పత్తి భావనలు[మార్చు]

మొదటి పద్ధతి: కణాలను ప్రతి చివర ఆమ్ల (COOH) జట్టుతో కలపడం మరియు ప్రతి జట్టు చివర అమయిన్ ని (NH2) కలిగిఉన్న రెండు రసాయనాలతో చర్యనొందించడం. ఈ పద్ధతి నైలాన్ 6,6 సృష్టిస్తుంది, ఇది ఆరు కార్భన్ అణువుల మరియు అడిపిక్ ఆమ్ల నిర్మిత హెక్సా మిథయిల్ డి అమయిన్.

రెండవ పద్ధతి:ఒక సంయోగం ఒక చివర ఆమ్లం రెండవ చివర అమయిన్ ఉండి పాలిమరైజ్ చెంది పునరావృత విభాగాలతో (-NH-[CH2]n-CO-) x గొలుసును ఏర్పరుస్తుంది . వేరే మాటల్లో చెప్పాలంటే నైలాన్ 6 కాప్రోలాక్టం అనబడే ఒక ఆరు కార్భన్ పదార్ధాలతో తయారవుతుంది. ఈ సమీకరణంలో n=5 అయితే అప్పుడు నైలాన్ 6 సూచించిన పేరు. (ఇది పాలిమర్ అని కూడా అనబడుతుంది)

నైలాన్ 6,6 లక్షణ సముదాయాలు:

 • మడతలు మరియు ముడతలు అధిక ఉష్ణోగ్రతలని తట్టుకొనేవిధంగా ఉంటాయి.
 • అతి సూక్ష్మ కణ నిర్మాణం
 • మంచి వాతావరణ గుణాలు; మంచి సూర్య కాంతి నిరోధకత
 • నునుపైన "చెయ్యి"
 • అధిక ద్రవీభవన స్థానం (256 °C)
 • ఉన్నత రంగు తీసుకొనే గుణం
 • అద్భుతమైన రాపిడి నిరోధకత

ఇంకోవైపు నైలాన్ 6కి తొందరగా వివిధ రకాల రంగు వేయవచ్చు ; దీనికి అత్యధిక ప్రభావ నిరోధకత ఉంటుంది, ఎక్కువగా తేమని గ్రహిస్తుంది, గొప్ప సాగే గుణం మరియు దాన్ని పొందే గుణం ఉంటుంది.

లక్షణాలు[మార్చు]

 • మెరుపులో తేడా: నైలాన్ కి చాలా నునుపుగా, మధ్య నునుపుగా లేదా మందకొడిగా ఉండే సామర్ధ్యం ఉంది.
 • మన్నిక: దీని ఎక్కువ జిగి ఫైబర్స్ సీట్ బెల్ట్స్, టైర్ తీగ, బెలాస్టిక్ బట్ట మొదలైనవాటి తయారీలో ఉపయోగిస్తారు, దీనికి ఇంకా ఇతర ఉపయోగాలున్నాయి.
 • అతి దీర్ఘత
 • అద్భుతమైన రాపిడి నిరోధకత
 • ఎక్కువ వేడిని తట్టుకొనేవి (నైలాన్ బట్టలు వేడిని తట్టుకుంటాయి)
 • సులభంగా శ్రద్ధ తీసుకోగలిగే బట్టల కోసం దారి చేయడం
 • క్రిములకి, ఫన్గి, జంతువులు, అలాగే మోల్డ్స్, మిల్ డ్యు మరి ఇతర రసాయనాలకి ఎక్కువ నిరోధకత.
 • తివాచీలు మరియు నైలాన్ స్టాకింగ్స్ లో ఉపయోగిస్తారు.
 • కాలడానికి బదులుగా కరుగుతుంది
 • అనేక మిలటరీ అనువర్తనాలలో ఉపయోగిస్తారు
 • మంచి ప్రత్యేక శక్తి
 • ఇన్ఫ్రారెడ్ కాంతి క్రింద పారదర్శకత (-12 dB) [2]

మొత్తం లక్షణాలు[మార్చు]

పైన వాటి ద్రవీభవన ఉష్ణోగ్రతలు, T m, నైలాన్ వంటి థెర్మోప్లాస్టిక్లు నిరాకర ఘనాలు లేదా మెత్తని ద్రావాలు, వీటిలో గొలుసులు నిర్దిష్ట క్రమ రహిత చుట్టలు. క్రింద T m నిరాకర ప్రాంతాలు లామేల్లర్ క్రిస్టల్ లతో ప్రత్యామ్నాయం చెందబడతాయి.[1] నిరాకర ప్రాంతాలు ఎలాస్టిసిటీకి దోహదపడితే క్రిస్టలిన్ ప్రాంతాలు బలానికి మరియు మొండితనానికి దోహదపడతాయి. ప్లానార్ అమయిడ్ (-CO-NH-) జట్లు ద్రువాత్మకంగా ఉంటాయి, కనుక నైలాన్ ప్రక్క ప్రక్క తంతువులలో బహుళ హైడ్రోజన్ బంధాలని ఏర్పరుస్తుంది. ఎందుకంటే నైలాన్ వెన్నుముఖ క్రమబద్ధమైనది మరియు సౌష్టవమైనది, ప్రత్యేకంగా అన్ని అమయిడ్ బంధాలు అనురూప నిష్పత్తిలో ఉన్నప్పుడు నైలాన్లు అత్యధిక క్రిస్టలినిటిని కలిగిఉండి అద్భుతమైన ఫైబర్స్ ను తయారుచేస్తాయి. క్రిస్టలినిటి శాతం తయారీ వివరాల మీద ఆధారపడి ఉంటుంది అలాగే నైలాన్ రకం మీద కూడా. ఇది ఎప్పుడూ కూడా పూర్తి నిరాకర ఘనంగా కరిగిన చోట మలచబడదు.

నైలాన్ 6,6 కి బహుళ సమాంతర తంతువులు తమ ప్రక్క పెప్టైడ్ బంధాలతో చుట్టబడిఉంటాయి, ఇవి నియమిత పొడవు గల సరిగ్గా 6 మరియు 4 కార్భన్లతో కలిసిఉంటుంది, కనుక కార్బోనైల్ అమ్లజనులు మరియు అమయిడ్ హైడ్రోజన్లు మధ్య గొలుసు హైడ్రోజన్ బంధాలను పునరావృతంగా ఎటువంటి అడ్డంకులు లేకుండా ఏర్పరచటానికి వరుసలో ఉంటాయి. నైలాన్ 5,10 5 మరియు 8 కార్భన్లతో సంయోజక బంధాలను కలిగిఉంటాయి. అప్పుడు సమాంతర (అసమాంతర కాదు) తంతువులు కొనసాగించిన, విరగని, బహుళ గొలుసు β-మడతల షీట్లలో పాల్గొంటాయి, ఇదేవిధమైన బలమైన, క్లిష్టమైన అద్భుత కణ నిర్మాణం సహజ సిల్క్ ఫిబ్రోయిన్ లోనూ మరియు ఈకలలో ఉండే β-కేరోటిన్స్ లోనూ పొందవచ్చు. (ప్రోటీన్లు వరుస -CO-NH- జట్లను విడదీసే ఎమినో ఆమ్లం మరియు α-కార్భన్ ను కలిగిఉంటాయి.) నైలాన్ 6 అవిరామ H-బంధాల షీట్లను మిశ్రమ దిశలతో ఏర్పరుస్తుంది కానీ β-షీట్ ముడత దీనికి భిన్నమైనది. మూడు-కోణాల స్థానభ్రంశం చెందని ఆల్కేన్హైడ్రోకార్భన్గొలుసు ఏకబంధిత కార్భన్ అణువుల టెట్రాహెడ్రల్ 109.47° భ్రమణాల మీద ఆధారపడి ఉంటుంది.

పారిశ్రామిక స్పిన్నరేట్లో ఫైబర్స్ గా మారిన తరువాత విడి పాలిమర్ గొలుసులు నిరాటంక ప్రవాహం వలన కలుస్తున్నాయి. కోల్డ్ డ్రాయింగ్కి గురయిన తరువాత ఫైబర్స్ కలుస్తాయి, వాటి క్రిస్టలినిటిని పెంచుకుంటూ ఈ పదార్థం అదనపు ధృడ శక్తిని పొందుతాయి.[2] వాడుకలో నైలాన్ ఫైబర్స్ వేడి చుట్టాలతో ఎక్కువ వేగంతో చుట్టబడతాయి.

తయారుచేసేటప్పుడు కత్తిరించడం ఒత్తిడులలో అంచుల వద్ద తప్ప నల్ల నైలాన్ తక్కువ క్రిస్టలైన్ తో ఉంటుంది. నైలాన్ శుద్ధమైనది వర్ణరహితం లేదా పాలవర్ణం కానీ సులభంగా రంగు వేయగలిగినది. బహుళ తంతుల నైలాన్ చుట్ట మరియు తాడు జారుడు స్వభావం కలిగి చుట్టబడిఉండదు. దీనిని నివారించడానికి చివరలు కరిగి లేదా సెగ లేదా ఎలక్త్రోడ్ వంటి వేడి మూలంతో చుట్టబడిఉంటుంది.

పొడిగా ఉన్నప్పుడు పాలిమైడ్ మంచి విద్యుద్వాహకి. అయితే పాలిమైడ్ హైడ్రోస్కోపిక్. కొన్ని పదార్ధాల నీటి సంగ్రహణ విద్యుత్ నిరోధకత వంటి లక్షణాలని మారుస్తుంది. నైలాన్ ప్రత్తి ఉన్ని కంటే తక్కువ గ్రాహకి.

చారిత్రక ఉపయోగాలు[మార్చు]

బిల్ పిట్టేన్ డ్రిగ్, డ్యుపోంట్ మిగతావారు కొన్ని సంస్థలు IIవ ప్రపంచ యుద్ధ సమయంలో మొదటి కొన్ని నెలలు ఆసియన్ సిల్క్ మరియు హెమ్ప్ బదులుగా నైలాన్ ను పారాచ్యుట్స్లో వాడడానికి ప్రయోగాలూ చేసారు. దీనిని టైర్లు, టెంట్లు, తాళ్ళు, పొంచోలు ఇతర మిలటరీ పంపిణీల తయారీలో కూడా ఉపయోగిస్తారు. దీనిని యూ.ఎస్ డబ్బు తయారీలో మంచి కాగితం కోసం కూడా ఉపయోగిస్తున్నారు. యుద్ధం ఫలితంగా కాటన్ ఫైబర్స్ 80% ఫైబర్స్ తయారీలో ఉపయోగిస్తే మిగతా 20% ఉన్ని ఫైబర్స్ ఉపయోగిస్తున్నారు. 1945 ఆగస్టుకి తయారుచేయబడిన ఫైబర్స్ 25% మార్కెట్ వాటాని సొంతం చేసుకుంటే కాటన్ పడిపోయింది.

కొన్ని నైలాన్ ఆధారిత టెర్ పాలిమర్స్ రోజువారీ పాకేజింగ్ లో ఉపయోగిస్తారు. నైలాన్ ను మాంసం చుట్టడానికి మరియు సాసేజ్ షీట్లుగా ఉపయోగిస్తారు.

సమ్మేళనాలలో ఉపయోగం[మార్చు]

నైలాన్ ను సమ్మేళన పదార్ధాలలో మాట్రిక్స్ పదార్థంగా ఉపయోగించవచ్చు, గ్లాస్ లేదా కార్భన్ ఫైబర్స్ తో కలిపినపుడు శుద్ధ ఫైబర్ కంటే ఎక్కువ సాంద్రతని కలిగి ఉంటుంది. అటువంటి థెర్మో ప్లాస్టిక్ సమ్మేళనాలను (25% గ్లాస్ ఫైబర్) ఇంజన్ కి పక్కన ఉండే మానిఫోల్డ్స్ వంటి కారు భాగాలలో తరచుగా వాడతారు, ఇవి మంచి వేడి నిరోధకతని కలిగిఉండి లోహభాగాలకి మంచి పోటీనిస్తాయి.

హైడ్రాలిసిస్ మరియు డిగ్రేడేషన్[మార్చు]

అన్ని నైలాన్లు హైడ్రాలిసిస్ కి అనువుగా ఉంటాయి, ముఖ్యంగా బలమైన ఆమ్లాలవలన, ఈచర్య పైన చూపించిన సింథటిక్ చర్యకి వ్యతిరేకంగా ఉంటుంది. నైలాన్ ఉత్పత్తుల కణ బరువు దాడి జరిగినప్పుడు చాలా తొందరగా పడిపోతుంది, ప్రభావానికి గురైన ప్రాంతాలలో పగుళ్ళు తొందరగా ఏర్పడతాయి. నైలాన్ల తక్కువ స్థాయి సభ్యులు (నైలాన్ 6 వంటివి) ఎక్కువ స్థాయి సభ్యులైన నైలాన్ 12 వంటి వాటికంటే తొందరగా ప్రభావానికి గురవుతాయి. దీని అర్ధం ఏమిటంటే నైలాన్ భాగాలను సల్ఫ్యూరిక్ ఆమ్లంతో కలిపి ఉపయోగించరాదని, ఉదాహరణకి లెడ్-ఆమ్ల బ్యాటరీలలో ఎలక్ట్రోలైట్ ని ఉపయోగించడం. వంచినపుడు నైలాన్ హైడ్రాలిసిస్కు గురికాకుండా ఉండడానికి దీనిని ఆరనివ్వాలి, వంచే మెషీన్ బారెల్ లో ఉండే నీరు అత్యధిక ఉష్ణోగ్రతలో ఉండడంకూడా పాలిమర్లను క్షీణింప జేస్తుంది. ఈరకపు చర్య: సెంటర్

ఇన్సినేరేషన్ మరియు పునర్వినిమయం[మార్చు]

వివిధ నైలాన్లు మంటలో విడిపోతాయి వీటినుండి ప్రమాదకరమైన పొగ, హైడ్రోజన్ సైనైడ్ని కలిగిఉన్న విష రేణువులు లేదా బూడిద విడుదలవుతాయి. నైలాన్లను తిరిగి పొందటానికి చేసే ఇన్సినరేటింగ్ లో వాటిని సృష్టించడానికి ఉపయోగించిన శక్తి కంటే ఎక్కువ శక్తి అవసరమవుతుంది, ఇది సాధారణంగా ఖరీదయినది అందువలన ఎక్కువ శాతం నైలాన్లు చెత్తకుప్పని చేరతాయి అక్కడ అవి నెమ్మదిగా క్షీణిస్తాయి[3]. నైలాన్ మీద కొంత పునర్వినిమయచర్య జరుగుతుంది, సాధారణంగా గుళికలను పరిశ్రమలో తిరిగి వాడతారు కానీ ఇది చాలా క్రింది స్థాయిలో జరుగుతుంది[4].

పద చరిత్ర[మార్చు]

1940లో డ్యుపోంట్ కు చెందిన జాన్ డబ్ల్యూ. ఎకెల్ బెర్రీ తన లేఖలలో క్రింది విధంగా పేర్కొన్నాడు "నైల్" ఆర్బిటరీ మరియు "ఆన్" అనేది కాటన్ మరియు రేయాన్ వంటి మిగతా ఫైబర్స్ ప్రత్యయాలనుంచి తీసుకోబడినదని. డ్యుపోంట్ తరువాతి ప్రచురణలో ఈ పేరు అసలు "నో-రన్" ("రన్" అంటే "విచ్చుకోనిది") నుంచి వచ్చిందని వివరణ ఇవ్వబడినది, కానీ సమర్ధించలేని వాదనలను కొట్టిపారేసి పద అర్ధాన్ని మంచిగా చేయడంకోసం తరువాత సవరణలు చేయబడ్డాయి.[5] ఒక కట్టుకథ ఏమిటంటే నైలాన్ "న్యూ యార్క్" మరియు "లండన్"లనుంచి వచ్చిందని. అలాగే స్పూరియస్ "ఇప్పుడు నువ్వు ఓడిపోయావ్, పాత నిప్ఫోన్" అన్న దానినుంచి వచ్చిన బాక్రోనిమ్, ఇది జపనీస్ సిల్క్ కి తగ్గిన గిరాకీని సూచిస్తుంది.

ఇవి కూడా చూడండి[మార్చు]

సూచనలు[మార్చు]

 1. నైలాన్ చరిత్ర US హక్కు కల 2,130,523 'లీనియర్ పాలి అమయిడ్స్ బాల మైన ప్లియబల్ ఫైబర్స్ ను చేయడానికి అనువైనవి', U.S. Patent 2,130,947 'డయి అమినే డయి కార్బక్సిలిక్ ఆమ్ల లవణం' and U.S. Patent 2,130,948 'సింథటిక్ ఫైబర్స్', అన్ని ప్రచురితమైన సెప్టెంబర్ 20, 1938
 2. మిల్లిమీటర్ -వేవ్, టెరహెర్ట్జ్, అండ్ మిడ్-ఇన్ఫ్రా రెడ్ ట్రాన్స్మిషన్ త్రో కామన్ క్లోతింగ్ ఆపిల్ ఫిస్. Lett. 85, 519 (2004); doi:10.1063/1.1771814
 3. Typically 80 to 100% is sent to landfill or garbage dumps, while less than 18% are incinerated while recovering the energy. See Handbook of Plastics Recycling at Google Books.
 4. Typically one percent or less of nylons are recycled this way.
 5. Context , vol. 7, no. 2, 1978

మరింత చదవడానికి[మార్చు]

 • టెక్స్ టైల్స్ బై సారా జే. కడోల్ఫ్, ISBN 0131187694

బాహ్య వలయాలు[మార్చు]

నైలాన్ చారిత్రక ఆధారాలకోసం, ఈక్రింది డాక్యుమెంట్స్ ను చుడండి "ది స్టాకింగ్ స్టోరీ:యూ బి ది హిస్టోరియన్" ఎట్ ది స్మిత్ సోనియన్ వెబ్ సైట్, బై ది లేమేల్సన్ సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ ఇన్నోవేషన్, నేషనల్ మ్యూజియం ఆఫ్ అమెరికన్ హిస్టరీ, స్మిత్ సోనియన్ ఇన్స్టిట్యూషన్.

మూస:Fibers మూస:Clothing

"https://te.wikipedia.org/w/index.php?title=నైలాన్&oldid=2823780" నుండి వెలికితీశారు