Jump to content

పంచ బిందు పచ్చబొట్టు

వికీపీడియా నుండి
పంచ బిందు పచ్చబొట్టుకు ఉదాహరణ

పంచ బిందు పచ్చబొట్టు అనేది ఐదు బిందువులు కలిగిన జ్యామితీయ అమరిక కలిగిన పచ్చబొట్టు. దీనిని చేతియొక్క వెలుపలి తలంపై బొటనవ్రేలు, చూపుడువ్రేలు మధ్య వేస్తారు. ఈ పచ్చబొట్టు వివిధ సంస్కృతులలో వివిధ అర్థాన్నిచ్చేదిగా ఉంటుంది. ఇది వివిధ ప్రాంతాలలో సంతానోత్పత్తి చిహ్నంగా వాడబడింది.[1] కొన్నిప్రాంఆలలో మహిళలు, పోలీసులతో ఎలా వ్యవహరించాలో తెలియజేయుటకు సూచికగా వాడేవారు[2]. రొమానీ ప్రజలను గుర్తించేందుకు చిహ్నంగా కూడా ఈ పచ్చబొట్టును వాడుతారు[2]. ఈ పచ్చబొట్టును అతి సన్నిహిత స్నేహితుల సమూహానికి గుర్తుగా కూడా వాడుతారు[3].ప్రపంచంలో ఒంటరిగా ఉండేవారికి గుర్తుగా వాడుతారు[4] లేదా కారాగార వాసంలో గడుపేవారికి గుర్తుగా కూడా వాడుతారు (బయటి నాలుగు బిందువులు కారాగారంయొక్క బయటి గోడలను సూచిస్తే మధ్యలో గల బిందువు ఖైదీని సూచిస్తుంది).[5]

థామస్ అల్వా ఎడిసన్ అనే ప్రసిద్ధ శాస్త్రవేత్త ఈ పచ్చబొట్లు వేసే యంత్రాన్ని కనుగొన్నాడు.ఆయన తన మోచేతిపై కూడా ఈ పచ్చబొట్టును వేసుకున్నాడు[6]


ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Gilbert, Steve (2000), Tattoo history: a source book : an anthology of historical records of tattooing throughout the world, Juno Books, p. 153, ISBN 978-1-890451-06-6.
  2. 2.0 2.1 Turner, Robert (2005), Kishkindha, Osiris Press Ltd, p. 53, ISBN 978-1-905315-05-5.
  3. Daye, Douglas D. (1997), A law enforcement sourcebook of Asian crime and cultures: tactics and mindsets, CRC Press, p. 113, ISBN 978-0-8493-8116-4.
  4. Vigil, James Diego (2002), A rainbow of gangs: street cultures in the mega-city, University of Texas Press, p. 115, ISBN 978-0-292-78749-0.
  5. Baldayev, Danzig (2006), Russian criminal tattoo encyclopedia, Volume 3, FUEL Publishing, p. 214.
  6. Sherwood, Dane; Wood, Sandy; Kovalchik, Kara (2006), The Pocket Idiot's Guide to Not So Useless Facts, Penguin, p. 48, ISBN 978-1-59257-567-1.