పంజాబీ జానపద మతం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంజాబీ ప్రాంతం
భగత్ బాబా కాలూజీ పంఛత్ యొక్క సన్నిధి
బుల్లేషాహ్ సమాధి, కసూర్, పాకిస్తాన్
ఘురియానా లోని గురుద్వారా సాహిబ్, బాబా బాలాజీ సమాధి

పంజాబీ జానపద మతం అనేది పంజాబీ ప్రజల విశ్వాసాలు, నమ్మకాలు, వారు పాటించే వివిధ ఆచారాలు. ఇందులో పూర్వీకులను పూజించటం, గ్రామదేవతలను పూజించటం, ప్రాంతీయ పండగలను ఆచరించడం వంటివి ఉన్నాయి. పంజాబీ జనపద మతానికి అంబంధించి పలు తీర్థస్థలాలున్నాయి. ఇవి హిందూ, ఇస్లాం మతాలలాంటి పెద్ద మతాల సారాల కలయికగా కనిపిస్తాయి.[1] ఈ తీర్థస్థలాలలో మతసామరస్యం, ఔన్నత్యంతో జీవించిన మహానుభావులను దైవంతో సమానంగా భావించడం లాంటివి కనిపిస్తాయి. [2]

పంజాబీ జానపద మత విశ్వాసాలు[మార్చు]

తాపా సింగ్ షహీద్

పంజాబీలు, వాళ్ళు పాటిస్తున్న సంఘటిత మతానికి అతీతంగా పంజాబీ జానపద మతాన్ని పాటిస్తారు.

పంజాబీ జానపద మతవిశ్వాసాల్లో సృష్టి మూడుగా విభజించబడి ఉంది:[3]

తెలుగు పంజాబీ నివాసం ఉండే వారు
ఆకాశం ఆకాష్ దేవదూతలు
భూమి ధరతీ మనుషులు
పాతాళం నాగస్ నాగలోకం (పాములు)

దేవలోక్ అనేది దేవుళ్ళు, దేవదూతలు, పుణ్య పురుషులు/స్త్రీలు, పూర్వీకులు నివసించే క్షేత్రం, ఇది ఆకాశంలో ఉంది. పూర్వీకులు దేవుళ్ళు లేదా పుణ్యాత్ములు అవ్వవచ్చు.[3]

పూర్వీకుల పూజ[మార్చు]

అహ్మద్ సర్హిందీ సమాధి, రౌజా షరీఫ్ ప్రాంతం, సర్హింద్
నకోడర్ పంజాబ్ లో ఉస్తాద్ సమాధి
నకోడర్ లో ఉస్తాద్ల సమాధులు
హిందూ మతస్థలంలో జెండాలు, ఎర్ర జెండా

జథేరా— పూర్వీకుల సన్నిధులు[మార్చు]

జథేరా అనేది ఒక కులం లేదా ఇంటిపేరుకు మూలవ్యక్తిని గౌరవిస్తూ నిర్మించిన సన్నిధి. ఇక్కడ ఇంటిపేరులో పుట్టిన పుణ్యాత్ములందిరికీ పూజలు జరుగుతాయి.[3]

ఒక గ్రామపెద్ద చనిపోయిన వెంటనే ఆ గ్రామ శివార్లలో ఆ గ్రామపెద్దకు ఒక సన్నిధి వెలుస్తుంది. అక్కడ ఒక జెండా చెట్టు స్థిరపడుతుంది. ఒక గ్రామానికి ఇలాంటి జెండా చెట్లు ఎన్నో ఉంటాయి.

ఈ జథేరా పేరు ఆ కులపెద్ద లేదా గ్రామపెద్ద ఇంటిపేరు మీద గానీ, గ్రామం పేరు మీద గానీ ఉండవచ్చు. కొన్ని కుటుంబాలలో ఈ జథేరాను తొలిసారి కనిపెట్టిన వ్యక్తి పుణ్యాత్ముడుగా పరిగణించబడవచ్చు. అలాంటి సందర్భాలలో ఒకే వ్యక్తి మూలపురుషుడిగానూ, పుణ్యాత్ముడిగానూ పరిగణించబడతాడు. [3]

పంజాబీ ఇంటిపేర్ల వంశవృక్షం[మార్చు]

పంజాబీ ప్రజల నమ్మకం ప్రకారం ఒకే ఇంటిపేరు కలవారంతా ఒకే వ్యక్తిని మూలపురుషుడిగా కలిగి ఉంటారు. ఇంటిపేరును పంజాబీలో గౌత్ లేదా గోత్ర అని అంటారు.[3]

ఒకే ఇంటిపేరు కలవారు వివిధ సమూహాలుగా విహజించబడి ఉంటారు. ఇందులో ఏడు తరాలవరకు వంశవృక్షాన్ని పోల్చుకోగల సభ్యులుంటారు.[4]

పూర్వకాలంలో ఒక గ్రామంలో అందరి ఇంటిపేరు ఒకటే ఉండేది. కాలానుగుణంగా జనాలు వలసలు వచ్చి పోవడం వలన వేరే ఇంటిపేరుగల వారు మరో గ్రామంకి వెళ్ళటం పరిపాటి అయింది. అలా కొత్తగా ఒక ఊరిలోకి వచ్చిన వారు ఆ ఊరి జథేరాని గౌరవించడం అప్పట్లో ఒక ఆనవాయితీ. ఈనాటికీ కొందరు బ్రాహ్మణులు పాటిస్తున్నారు. కాలానుగుణంగా ఇవాళ పంజాబీ గ్రామాలలో వివిధ ఇంటిపేర్ల వారు ఒకే గ్రామంలో ఉండటం సహజమైంది. అలా ఇవిధ జథేరాలు, వివిధ ఇంటిపేర్లు ఒకే గ్రామంలో వెలిసాయి.[5]

వేరే గ్రామానికి వచ్చిన ఒక గ్రామ ప్రజలు, తమ గ్రామ జథేరాకు వెళ్ళటం ఉంటుంది. అది సాధ్యం కాని పక్షంలో కొత్త గ్రామంలో పాత జథేరాకు లంకెతో కొత్త జథేరా ఏర్పాటు జరుగుతుంది.[3]

జథేరా రాకపోకలు[మార్చు]

ప్రజలు జథేరాకు పెళ్ళి లాంటి వేడుకలలో వస్తారు. ప్రతి పౌర్ణమికి, నెలలో మొదటి ఆదివారం నాడు వస్తారు.

మూలాలు[మార్చు]

  1. Replicating Memory, Creating Images: Pirs and Dargahs in Popular Art and Media of Contemporary East Punjab Yogesh Snehi [1]
  2. Historicity, Orality and ‘Lesser Shrines’: Popular Culture and Change at the Dargah of Panj Pirs at Abohar,” in Sufism in Punjab: Mystics, Literature and Shrines, ed. Surinder Singh and Ishwar Dayal Gaur (New Delhi: Aakar, 2009), 402-429
  3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 Centre for Sikh Studies, University of California. Journal of Punjab Studies Fall 2004 Vol 11, No.2 H.S.Bhatti and D.M. Michon: Folk Practice in Punjab
  4. This is not definitive
  5. A Glossary of the tribes & castes of Punjab by H. A Rose