పందళ రాజులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కేరళలో రాజవంశం .ఇది తమిళనాడు పాండ్య రాజవంశం చెందినవారు.శబరిమల ఆలయంతో అనుబంధం కలిగిన రాజ వంశం అయ్యప్ప పండలం ప్యాలెస్‌లో నివసించినట్లు చారిత్రకమైన ఆధారాలు ఉన్నాయి.

ప్రారంభ చరిత్ర

[మార్చు]

తమిళ రాజుకు చెందిన పాండ్య రాజ్యాన్ని ,ఖల్జీ వంశస్థుడు అల్లావుద్దీన్ ఖల్జీ కమాండర్-మాలిక్ కఫూర్ పాండ్య రాజ్యంపై దాడి చేశాడు.పాండ్య రాజు వైఫల్యంతో ఈ రాజవంశం రెండు శాఖలు విడిపోయింది.తమను తాము రక్షించుకోవడానికి కేరళ వైపు వెళ్ళిపోయారు.కొట్టాయం జిల్లాలో ఒక శాఖ, పూంజర్ మరొక శాఖ స్థిరపడ్డారు.చివరకు అనేక ప్రదేశాలు తిరుగుతూ పండలం లో స్థిరపడ్డారు.

అయ్యప్ప చరిత్ర

[మార్చు]

పండల రాజ వంశస్థులు భార్గవ గోత్రానికి చెందినవారు.ఈ రాజవంశం యొక్క రాజు రాజశేఖర తన వేట దండయాత్ర సమయంలో పంబ తీరానికి వచ్చాడు.దగ్గరలో శిశువు ఏడుపు విలపించింది. సంతానం లేని ఆ రాజు ఈశ్వరుడే ఆ శిశువును ప్రసాదించాడని రాజశేఖరుడు ఆనందంతో ఆ బిడ్డను అంతఃపురమునకు తీసుకువెళ్తాడు. ఆ శిశువును చూసి అతని రాణి కూడా ఎంతగానో ఆనందిస్తుంది. ఆయ్యప్ప అంతఃపురంలో అడుగుపెట్టిన ఏడాది తిరిగే సరికి రాజశేఖరుని భార్య మగబిడ్డను ప్రసవిస్తుంది. మణికంఠుని సాత్విక గుణాలవల్ల కొందరు 'అయ్యా అని మరికొందరు 'అప్పా అని మరికొందరు రెండు పేర్లూ కలిపి 'అయ్యప్ప' అని పిలిచేవారు. తగిన వయసురాగానే మహారాజు కొడుకులిద్దర్నీ గురుకులానికి పంపిస్తాడు. రాజ గురువు అయ్యప్పను అవతారపురుషునిగా గుర్తిస్తాడు. గురుకులంలో విద్యనభ్యసించి వెనుకకు వచ్చిన అయ్యప్పకు రాజ్యపట్టాభిషేకం జరపాలని అనుకుంటాడు తండ్రి. తల్లికి అది ఇష్టం లేక తలనొప్పి అని నాటకమాడి వైద్యులతో వ్యాధి తగ్గుటకు పులిపాలు కావాలని చెప్పిస్తుంది. నేవెళ్ళీ తీసుకు వస్తానని చెప్పి బయలుదేరుతాడు.అయ్యప్పను పట్టాభిషిక్తుడిని చేయాలనుకొంటాడు. కాని తన తండ్రి ఇచ్చిన రాజ్యాన్ని వదిలి మణికంఠుడు తనకు ఒక ఆలయం నిర్మించి ఇవ్వమని కోరాడు. అందుకు నియమం ఏమంటే తానొక బాణం వదులుతానని, ఆ బాణం ఎక్కడ పడితే అక్కడ తనకు ఆలయం నిర్మించాలని. అలా కట్టిన ఆలయం శబరిమలలో ఉంది. అక్కడ అయ్యప్ప స్థిరనివాసం ఏర్పరచుకొని తన భక్తుల పూజలందుకొంటున్నాడని భక్తుల నమ్మకము.

పండలం రాజభవనం నిర్మాణం

[మార్చు]

ఈ పండలం రాజభవనం రాజకుటుంబీకులు నివసించే వారు.ఈ ప్యాలెస్ యొక్క నిర్మాణం మట్టి , వెదురు,రాయి వంటి కలపతో నిర్మించారు ఈ భవంతిలో అయ్యప్ప తన బాల్యాన్ని గడిపారు. ఈ ప్యాలెస్ లో అయ్యప్ప (పవిత్ర ఆభరణాలు) ఇక్కడ ఉంచబడ్డాయి. యాత్రికులు ఆభరణాలు పూజించే అవకాశం ఉంది.

మూలాలు 

[మార్చు]