Jump to content

పద్మనాభుడు

వికీపీడియా నుండి
పుట్టలంలోని మున్నేశ్వరం ఆలయంలో పద్మనాభుడుగా విష్ణువు

అనంతపద్మనాభుడు అనగా నాభి (బొడ్డు) యందు పద్మమును కలిగి అంతము లేనివాడు అని అర్థం. పద్మనాభుడు అనంతశయన ముద్రలో (యోగనిద్ర ఆకృతిలో అనంతుడనే సర్పం మీద శయనించి) దర్శనమిస్తాడు. విష్ణువు సహస్రనామాలలో పద్మనాభ ఒకటి.

జైనులు పద్మనాభుని బింబిసారుని అవతారముగా భావిస్తారు.

దేవాలయాలు

[మార్చు]

పద్మనాభున్ని పూజించే దేవాలయాలలో అత్యంత ప్రాచీనమైనది కేరళలోని శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం (కేరళ). ఇది తిరువనంతపురం మహారాజావారి ఆధీనంలో నిర్వహించబడుచున్నది. తెలంగాణలోని అనంతగిరి అటవీప్రాంతంలో శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం (అనంతగిరి) దేవాదాయ, ధర్మాదాయ శాఖవారిచే నిర్వహించబడుచున్నది.

సంస్కృతి

[మార్చు]

భారతీయ సంస్కృతిలో పద్మనాభునిపై గల భక్తితో కొందరు వ్యక్తులకు పద్మనాభన్, పద్మనాభం (నటుడు) అని తమ మగ సంతానానికి పేర్లు పెట్టుకుంటారు.

ఇదేవిధంగా కొన్ని నివాస ప్రాంతాలు కూడా ఈ పేరులో ప్రసిద్ధిచెందినవి: ఉదా: పద్మనాభపురం, పద్మనాభం