పప్పు చంద్రశేఖర్
పప్పు చంద్రశేఖర్ సుప్రసిద్ధ వైణికుడు.
జీవిత విశేషాలు
[మార్చు]పప్పు చంద్రశేఖర్ విజయనగరం సంప్రదాయానికి చెందిన సంగీత కారుల కుటుంబంలో జన్మించాడు. అతని తండ్రి "వీణానాద సుధార్ణవ", "వైణిక సార్వ భౌమ" బిరుదాంకితుడు పప్పు సోమేశ్వరరావు. తన 7వ యేట నుండి వీణవాద్యంపై సాధనను ప్రారంభించాడు. 1972 నుండి సంగీత కచేరీలు చేస్తున్నాడు. అతను 1981, 1986, 1990 లలో ఆల్ ఇండియా రేడియో దక్షిణ భారత కచేరీలలో పాల్గొన్నాడు. అతను ఆల్ ఇండియా రేడియో సంగీత సమ్మేళనం, దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో నేషనల్ ప్రోగ్రాం లలో పాల్గొని ప్రముఖ విద్వాంసునిగా గుర్తింపు పొందాడు.
పురస్కారాలు
[మార్చు]అతను అనేక సంగీత పురస్కారాలను పొందాడు. దేశ వ్యాప్తంగా అనేక సంగీత ఉత్సవాల్లో, ప్రముఖ సంగీత సభలలో అనేక పురస్కారాలను, గౌరవాలను పొందాడు. మద్రాసులోని "శ్రీ కృష్ణ గానసభ" వారిచే "ఉత్తమ వీణా విద్వాంసుని" గా గుర్తింపబడ్డాడు. ఆ సభ అతనికి " శ్రీ ఈమని శంకరశాస్త్రి మెమోరియల్ అవార్డు" ను అందించింది. అతనికి వివిధ సభలలో "వీణా నాద సుధార్నవ", "వైణిక సార్వభౌమ" బిరుదులు ఇచ్చాయి. అతను వీణానాదాని ఆడియో కాసెట్లు, సి.డి ల రూపంలో చేసి సంగీత ప్రేమికులకు అందిచాడు.
అతను 2 దశబ్దాలుగా ఆల్ ఇండియా రేడియో, హైదరాబాదులో "ఎ" గ్రేడు వీణా విద్వాంసునిగా ఉన్నాడు. అతను 2000 డిసెంబరు 22 న మద్రాసు మ్యూజిక్ అకాడమీ లో జరిగిన సంగీత ఉత్సవంలో సంగీత కచేరీలో పాల్గొన్నాడు.[1]
మూలాలు
[మార్చు]- ↑ "PAPPU CHANDRA SEKHAR VEENA HOME PAGE". pappuveena.tripod.com. Retrieved 2019-01-15.