పరకాయప్రవేశం

వికీపీడియా నుండి
(పరకాయ ప్రవేశం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

పరకాయప్రవేశం ఒక ప్రాచీనమైన కళ. ఈ కళ తెలిసిన వ్యక్తి మరణించిన జంతువుల లేదా మనుషుల శరీరం (కాయం) లోనికి ప్రవేశించి ఆ జీవి శరీరంతో కొన్ని పనులు చేసి అవసరం తీరిన తరువాత తిరిగి ఆ శరీరాన్ని వదలి తన శరీరంలోని ప్రవేశించవచ్చును. అయితే అంతవరకు వదలిన తన శరీరం జాగ్రత్తగా భద్రపరచవలసిన అవసరం ఉన్నది. లేనియెడల పరకాయప్రవేశం చేసిన శరీరంతోనే సంచరించాల్సి ఉంటుంది. పరుల శరీరంలో ప్రవేశించే విద్య కాబట్టి పర కాయ ప్రవేశం అని పేరువచ్చినది. అజపాన మహా మంత్రం యొక్క సంకల్ప మాత్రం చేతనే పరకాయప్రవేశం చేయ వీలుపడును.[1]

శంకరాచార్యుని పరకాయ ప్రవేశం[మార్చు]

పరకాయ ప్రవేశ విద్యా పారంగతుడు ఆది శంకరాచార్య

శంకరాచార్యుడు మండన మిశ్రునితో వాదనకు దిగుతాడు. సమస్త విషయాల పట్ల పూర్తి అవగాహనతో అద్వైతంపై చేసిన వాదనలో మండన మిశ్రుడు అందులోలేక పోతాడు. మండన మిశ్రుడు ఓడిపోయే సమయంలో అతని భార్య ఉభయ భారతీదేవి శాస్త్ర చర్చలో వాదనకు దిగుతుంది. ఆమె శంకరునికి తెలియని కామశాస్త్రంపై ప్రశ్నలు అడుగుతుంది. అతనికి ఈ విషయాల పట్ల అవగాహన లేక పోవడంతో తనకు ఈ ప్రశ్నలకు సమాధానము చెప్పడానికి కొంత సమయం కావాలని అడుగుతాడు. అందుకు వాళ్ళు అంగీకరిస్తారు. శంకరుడు శిష్యబృందంతో కలసి అడవి మార్గం గుండా వెళ్తున్నప్పుడు దారిలో అమరుక మహారాజు మరణించడం గమనిస్తాడు. శంకరుడు తన శరీరాన్ని ఒక గుహలో ఉంచి శిష్యులను కాపలాగా ఉంచి పరకాయ ప్రవేశం ద్వారా అమరుక మహారాజు శరీరంలోకి చేరి రాజ్యపాలన చేస్తాడు. రాణుల ద్వారా కామశాస్త్ర విషయాలను తెలుసుకుంటాడు. సుభిక్షంగా రాజ్యపాలన చేస్తున్న శంకరుని అభిరుచుల ద్వారా అంతఃపుర వాసులకు సందేహం కలుగుతుంది. రాజు శరీరంలోకి ఒక యోగి పుంగవుడు ప్రవేశించాడని భావించి రాజ్యంలో ఉన్న అనాథ శవాలను అన్వేషించి దహన సంస్కారాలు జరపవలసినదిగా భటులను ఆజ్ఞాపిస్తుంది రాణి. ఆ విషయం తెలుసుకున్న శంకరుడు అమరుక మహారాజు శరీరాన్ని వదలి తిరిగి తన శరీరంలోకి ప్రవేశిస్తాడు. తరువాత మండన మిశ్రుని వద్దకు వెళ్ళి ఉభయ భారతీ దేవిని ఓడిస్తాడు. [2]

ఇలాంటి భారతీయ ప్రాచీన విలువైన విద్యల్ని, పురాతన పుస్తకాల్ని విదేశీయుల దండయాత్రలు,కులమత బేధాలతో కోపతాపాల ప్రదర్శనల్లో అందరూ కలిసి ఎప్పుడో తగులబెట్టి ఈ కాలం వరకు రాకుండా చేసారు.

మూలాలు[మార్చు]

  1. "కాశీ ఖండం.. 107 | Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi". andhrabhoomi.net. Retrieved 2021-05-06.
  2. "పరకాయప్రవేశం చేసిన శంకరుడు". ap7am.com (in ఇంగ్లీష్). Retrieved 2021-05-06.

బాహ్య లంకెలు[మార్చు]