పరమార్ది

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Paramardi
Parama-bhattaraka Maharajadhiraja Parameshvara, Kalanjaradhipati
King of Jejakabhukti
Reignc. 1165-1203 CE
PredecessorMadanavarman or Yashovarman II
SuccessorTrailokyavarman
రాజవంశంChandela
తండ్రిYashovarman II

పరమార్ది (సా.శ. 1165-1203 పాలన) మధ్య భారతదేశంలోని చందేలా రాజవంశం రాజు. ఆయన చివరి శక్తివంతమైన చందేలా రాజు, జెజకభుక్తి ప్రాంతాన్ని (ప్రస్తుత మధ్యప్రదేశు, ఉత్తర ప్రదేశులో బుందేల్ఖండు) పరిపాలించాడు. సా.శ. 1182-1183లో చందేలా రాజధాని మహోబా మీద దాడి చేసిన పృథ్వీరాజు చౌహానును ఆయనను ఓడించాడు. పారమార్ది తరువాత కొన్నిసంవత్సరాలలో చందేలా అధికారాన్ని తిరిగి పొందగలిగినప్పటికీ సా.శ. 1202-1203లో గురిదు జనరలు కుతుబు అల్-దిన్ ఐబాకు చేతిలో ఓడిపోయాడు.

ఆరంభ జీవితం[మార్చు]

పరమార్ది బాతేశ్వరు శాసనం ఆయన తన తండ్రి యశోవర్మ తరువాత వచ్చాడని సూచిస్తుంది. అయినప్పటికీ ఇతర చందేలా శాసనాలు (ఆయన స్వంత వాటితో సహా) ఆయన తన తాత మదనవర్మ తరువాత అధికారపీఠం స్వీకరించాడాని సూచిస్తున్నాయి. అయినప్పటికీ మదనవర్మ జీవించి ఉన్నప్పుడు యశోవర్మ చాలా తక్కువ కాలం పాలించాడు. లేదా అస్సలు పాలించలేదు భావిస్తున్నారు. [1]

పర్మలు రాసో అభిప్రాయం ఆధారంగా పరమార్ది 5 సంవత్సరాల వయస్సులో సింహాసనాన్ని అధిష్టించాడు. ఈ వాదనను అజయగడ్ శాసనం ధ్రువీకరించినట్లు కనిపిస్తుంది: చిన్నతనంలో కూడా పరమార్ది నాయకుడని పేర్కొంది (బాల్-ఓపి నెట్).[2]

ఆయన శాసనాలలో ఆయనను పరమార్ది-దేవా అని పేర్కొన్నారు. మధ్యయుగ బార్డికు ఇతిహాసాలు ఆయనను పరమల లేదా పరిమల అని పిలుస్తాయి. ఆధునిక మాతృభాషలలో ఆయనను పారామార్దిదేవు, పర్మారు, పరమలు దేవ్ లేదా పరిమలు చందేలు అని కూడా పిలుస్తారు (ఎందుకంటే ష్వా తొలగింపు కారణంగా). ఆయన జారీ చేసిన బంగారు నాణెం, కూర్చుని ఉన్న దేవతను రూపం కలిగి ఉంది. అందులో ఆయన పేరు శ్రీమతు పరమార్ది.[3]

మతం[మార్చు]

పటం
Find spots of the inscriptions from Paramardi's reign[4]

పరమార్ది శక్తివంతమైన చందేలా పాలకులలో చివరివాడు. పరమల రాసో (పర్మల్ రాసో లేదా మహోబా ఖండ్), పృథ్వీరాజ్ రాసో, అల్హా-ఖండు (అల్హా రాసో లేదా అల్హా, బల్లాడు) వంటి అనేక పురాణ గ్రంథాలలో ఆయన పేరు ప్రస్తావించబడింది. ఈ గ్రంథాలు చారిత్రక సంఘటనల మీద ఆధారపడి ఉన్నప్పటికీ వాటిలోని ఎక్కువ భాగం పృథ్వీరాజు చౌహాను లేదా పరమార్దిని కీర్తింపజేయడానికి కల్పించబడింది. అందువలన ఈ గ్రంథాలు సందేహాస్పదమైన చారిత్రకత విలువలు కలిగివుంటాయి. అందువలన పరమార్ది పాలనలో ఎక్కువ భాగం అస్పష్టతతో కప్పబడి ఉంది.[5][6]

అనేక చందేలా శాసనాలు కూడా పరమార్ది గురించి ప్రస్తావించినప్పటికీ వీటిలో చారిత్రక సమాచారం చాలా తక్కువ. ఉదా;సమేరా రాగిఫలక శాసనం అందంలో ఆయన మకరధ్వజుడిని (మన్మధుడు) అణిచివేసిన రాజు అని, సముద్రంవటి లోతైన వ్యక్తి అని, గొప్పతనంలో స్వర్గాధిపతి ఇంద్రుడితో సమానుడని, విశ్వసించతగిన వ్యక్తులలో ఆయన యుధిష్టరుడికి సమానుడని శాసనాలు ఆయనను స్తుతించాయి. బాఘరి (బటేశ్వరు) రాతి శాసనం అతనికి సైనిక విజయాలు దక్కాయని, ఇతర రాజులు ఆయనకు నమస్కరించారని, కానీ ఈ రాజులలో ఎవరికీ పేరు పెట్టలేదని పేర్కొంది.[5] ఆయన మనవడు భార్య కల్యాణదేవి అజయగడ్ శాసనం కూడా ఆయనను సార్వత్రిక సార్వభౌమాధికారిగా వర్ణిస్తుంది. ఆయన శత్రువులు దయనీయ స్థితిలో మిగిలిపోయారు.[5] విస్తృతమైన విజయాల గురించిన ఇటువంటి వ్రాతలు చారిత్రక ఆధారాల ద్వారా ధ్రువీకరించబడవు.[7]

ఆరంభకాల జీవితం[మార్చు]

పరమార్ది పాలన మొదటి కొన్ని సంవత్సరాల శాసనాలలో సెమ్రా (సా.శ.1165-1166), మహోబా (సా.శ.1166-1167), ఇచావారు (సా.శ.1171), మహోబా (సా.శ.1173), పచారు (సా.శ.1176), చార్ఖారీ (సా.శ. 1178).[8] ఈ శాసనాలు అన్నీ ఆయనకు సామ్రాజ్య బిరుదులను ఉపయోగిస్తాయి: పరమభట్టారక-మహారాజాధిరాజ-పరమేశ్వర పరమ-మహేశ్వర శ్రీ-కలంజరాధిపతి శ్రీమంత పరమార్దిదేవ. ఇది తన పాలన ప్రారంభంలో పరమార్ది తన తాత మదనవర్మ నుండి వారసత్వంగా పొందిన భూభాగాలను నిలుపుకున్నట్లు సూచిస్తుంది.[6]

సా.శ. 1183 మహోబా శాసనం ఆధారంగా త్రిపుర ప్రభువు పరమార్డి ధైర్యం గురించి పాటలు విన్నప్పుడల్లా మూర్ఛపోయాడు. పరమార్ది త్రిపురి, కలచురి రాజును, బహుశా జయసింహను ఓడించాడని ఇది సూచిస్తుంది.[7]

చహ్మనా దాడి[మార్చు]

సా.శ. 1182-1183 సమయంలో చాహమన పాలకుడు పృథ్వీరాజు చౌహాను జెంజకాభక్తి చందేల రాజ్యం మీద దాడి చేశాడు. చందేలా వ్రాతపూర్వక ఆధారాలు ఈ దండయాత్ర గురించి ప్రస్తావించలేదు. బహుశా వారి రాజు అవమానకరమైన ఓటమిని వివరించకుండా ఉండటానికి అవి నమోదుచేయబడలేదని భావిస్తున్నారు.[6]

మధ్యయుగ జనపదగీతాల ఆధారంగా పదాంసేను కుమార్తెను వివాహం చేసుకుని పృథ్వీరాజు ఢిల్లీకి తిరిగి వస్తున్నట్లు పేర్కొనబడింది. ఈ ప్రయాణంలో ఆయన మీద టర్కీ దళాలు (ఘురిడ్లు) దాడి చేసాయి. చౌహాను సైన్యం దాడులను తిప్పికొట్టగలిగింది. కాని ఈ ప్రక్రియలో తీవ్రమైన ప్రాణనష్టం జరిగింది. వారు దారి తప్పి చందేలా రాజధాని మహోబా చేరుకున్నారు. వారిలో అనేక మంది గాయపడిన సైనికులు ఉన్నందున చౌహాను దళం తెలియకుండానే చందేలా రాజోద్యానవనంలో ఒక శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వారి ఉనికిని అభ్యంతరం వ్యక్తం చేసినందుకు వారు తోటమాలిని చంపారు. పరమార్ది ఈ విషయం తెలుసుకుని చౌహాను దళాన్ని ఎదుర్కోవడానికి కొంతమంది సైనికులను పంపాడు. ఈ సంఘర్షణలో చందేలాలు భారీ నష్టాలను చవిచూశారు. పరమార్ది పృథ్వీరాజుకు వ్యతిరేకంగా తన సేనాపతి ఉడాలు నేతృత్వంలో మరో దళాన్ని పంపాలని నిర్ణయించుకున్నాడు. ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఉడాలు సలహా ఇచ్చాడు గాయపడిన సైనికుల మీద దాడి చేయడం కానీ పృథ్వీరాజు వంటి శక్తివంతమైన రాజును వ్యతిరేకించడం సముచితం కాదని వాదించాడు. అయినప్పటికీ పరమార్ది తన బావమరిది మహీలు పరిహారు (ప్రతిహారా) ప్రభావంతో ఉండి ఆయన చందేలాకు వ్యతిరేకంగా రహస్యంగా కుట్రదారులను ఆశ్రయించాడు. దాడి ప్రణాళికతో ముందుకు సాగాలని మహీలు పరమార్దిని ప్రేరేపించాడు. ఉడాలు నేతృత్వంలోని చందేలా దళం చౌహాను సైన్యానికి వ్యతిరేకంగా రెండవ దాడిని ప్రారంభించి ఓడిపోయింది. పృథ్వీరాజు ఢిల్లీకి వెళ్ళినప్పుడు పరిస్థితి సద్దుమణిగింది. [9]

మహీలు పరిహారు రాజకీయ వ్యూహాన్ని భరించలేక ఉడాలు, ఆయన సోదరుడు అల్హా చందేలా రాజసభ నుండి నిష్క్రమించారు. వారు కన్నౌజు గహదవాలా పాలకుడు జైచందు ఆశ్రయం పొందారు.[9] మహీలు పృథ్వీరాజు చౌహానుకు రహస్య సందేశం పంపాడు. పరమార్ది ప్రథమ సేనాధిపతి మహోబాను విడిచిపెట్టినట్లు సమాచారం. ఆయనచేత ప్రేరేపించబడిన పృథ్వీరాజు సా.శ. 1182 లో ఢిల్లీ నుండి బయలుదేరి గ్వాలియరు, బటేశ్వరు మీదుగా చందేలా భూభాగానికి వెళ్ళాడు. మొదట ఆయన అల్హా ఉడాలు బంధువు మల్ఖాను నేతృత్వంలో సిర్సాగరును ముట్టడించాడు. పృథ్వీరాజు మల్ఖాను మీద గెలిచేందుకు ప్రయత్నించాడు. కాని మల్ఖాను పరమార్దికి విధేయుడిగా ఉండి ఆక్రమణదారుల మీద పోరాడాడు. మల్ఖాను ఆక్రమణలోని సైన్యం 8 మంది సేనాపతులను చంపిన తరువాత పృథ్వీరాజు స్వయంగా యుద్ధానికి బాధ్యత వహించాడు. చందేలాలు చివరికి యుద్ధంలో ఓడిపోయి, మల్ఖాను చంపబడ్డాడు.[10]

పృథ్వీరాజు మహోబా వైపు సైనికయాత్ర ప్రారంభించాడు. ఆసన్నమైన ఓటమిని ఎదుర్కొంటున్న పరమార్ది, ఆయన ప్రభువులు ఆయన పట్టమహిషి మల్హను దేవి సలహా మేరకు సంధిని కోరాడు. పృథ్వీరాజు ఈ ఒప్పందానికి అంగీకరించినప్పటికీ చందేలా భూభాగంలోని బెట్వా నది ఒడ్డున శిబిరంలో ఉన్నాడు. ఇంతలో చందేలాలు కన్నౌజు నుండి తిరిగి రావాలని అల్హా, ఉడాలులను అభ్యర్థించారు. [10] ఇద్దరు సోదరులు మొదట్లో సంశయించినప్పటికీ వారి తల్లి చందేల పట్ల విధేయతను గౌరవించాలని విజ్ఞప్తి చేసిన తరువాత తిరిగి రావడానికి అంగీకరించారు. జైచందు తన ఇద్దరు ఉత్తమ కుమారులతో తన ప్రధాన సేనాపతుల నేతృత్వంలో సైన్యాన్ని చందేలాకు మద్దతుగా పంపించాడు. పరమార్ది స్వీయనేతృత్వంలో తన సైనికులను నడిపించి కలంజర కోటకు తిరిగి వెళ్ళాడు. తరువాత ఆయన కుమారుడు బ్రహ్మజితు, అల్హా, ఉడాలుతో కలిసి పృథ్వీరాజు చౌహనుకు వ్యతిరేకంగా చందేలా సైన్యాన్ని నడిపించాడు. తరువాతి యుద్ధంలో చందేలాలు ఓడిపోయారు. ఈ ఘర్షణలో బ్రహ్మజితు, ఉడాలు, జైచందు ఇద్దరు కుమారులు మరణించారు. విజయం తరువాత పృథ్వీరాజు చందేలా రాజధాని మహోబాను తొలగించాడు.[11]

తరువాత పృథ్వీరాజు తన సేనాపతి చావందు రాయ్‌ని కలన్జారాకు పంపించాడు. చౌహాను సైన్యం కోటను స్వాధీనం చేసుకుని పరమార్డిని ఖైదీగా తీసుకుని ఢిల్లీ వైపు తిరిగి వెళ్ళింది.[12] పర్మలు రాసో అభిప్రాయం ఆధారంగా తిరిగి వచ్చిన చౌహాను సైన్యం మీద అల్హా కుమారుడు ఇందాలు కుమారు ఆశ్చర్యకరమైన దాడి చేసి పరమార్దిని విడిపించాడు. తరువాత పరమార్ది సిగ్గుతో గజరాజ ఆలయంలో ఆత్మహత్య చేసుకున్నాడు.[12]ఆయన మరణించిన తరువాత పరమార్ధి 50 మంది భార్యలు సతీసహగమనానికి పాల్పడినట్లు పరమలు రాసో పేర్కొన్నాడు.[13]చాందు బర్దాయి అభిప్రాయం ఆధారంగా ఆయన రాజ్యాన్ని విసర్జించి గయలో నివసించి అక్కడ మరణించాడు కొంత మంది భావిస్తున్నారు. [12] పృధ్వీరాజు పజ్జును రాయ్‌ను మహోబా రాజప్రతినిధిగా నియమించినట్లు పృథ్వీరాజు రాసో పేర్కొన్నాడు. తరువాత పరమార్ది కుమారుడు సమర్జితు జైచందు అధికారి నరసింహ సహాయంతో మహోబాను తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. అప్పుడు సమర్జితు కలంజర, గయా మధ్య భూభాగాన్ని పరిపాలించాడు. అయినప్పటికీ అటువంటి యువరాజును చందేలా వ్రాతపూర్వక ఆధారాలు పేర్కొనలేదు.[14]

ఈ పురాణ కథనం కచ్చితమైన చారిత్రకత చర్చనీయాంశమైంది. కాని పృథ్వీరాజు చౌహాను మహోబాను తొలగించిన విషయం తెలిసిందే. ఇది అతని మదన్పూరు రాతి శాసనాలు ధ్రువీకరించాయి.[11] ఏది ఏమయినప్పటికీ చౌహానులు మహోబా లేదా కలంజరాను సుదీర్ఘంగా ఆక్రమించడం చారిత్రక ఆధారాలకు మద్దతు ఇవ్వదు.[14] అంతేకాకుండా చౌహాను విజయం సాధించిన వెంటనే పరమార్ది చనిపోలేదు లేదా పదవీ విరమణ చేయలేదని తెలిసింది. ఈ సంఘటన తరువాత ఆయన అనేక శాసనాలు జారీ చేసినట్లు తెలుస్తుంది: కలంజర శిలాశాసనం సా.శ. 1184 మహోబా రాతి శాసనం, సా.శ. 1187 అజయగడు రాతి శాసనం, సా.శ. 1195 బఘారీ (బటేశ్వరు) రాతి శాసనం, సా.శ. 1201 కలంజర రాతి శాసనం. [12] ఈ రికార్డులు పరమార్దికి సామ్రాజ్య బిరుదులను ఇస్తాయి. అందువలన ఆయన సార్వభౌమ పాలకుడిగా కొనసాగాడని సూచిస్తుంది.[15] ఢిల్లీ సుల్తానేటు చందేలా రాజ్యం మీద దండెత్తిన తరువాతి శతాబ్దం ప్రారంభం వరకు పరమార్ది పరిపాలించినట్లు ముస్లిం చరిత్రలు ఆధారాలు ఇస్తున్నాయి.[14]

సా.శ. 1195 బతేశ్వరు శాసనం ఇతర భూస్వామ్య రాజులు ఆయన ముందు నమస్కరించారని సా.శ. 1201 కలంజర శాసనం ఆయనను దశర్నా దేశానికి ప్రభువుగా అభివర్ణించింది. పృథ్వీరాజు చౌహాను ఢిలీకి తిరిగి వచ్చిన తరువాత పరమార్ది తిరిగి చందేలాను శక్తివంతం చేసాడని ఈ ఆధారాలు సూచిస్తున్నాయి.[15]

ఘురిదు దాడి, మరణం[మార్చు]

కలంజర శాసనం ఆధారంగా పరమార్ది పూర్వీకులలో ఒకరు పాలకుల భూలోక భార్యలను ఖైదు చేయగా పరమార్ది దేవలోక యోధులు దైవీక పాలకులు కూడా వారి భార్యల భద్రత గురించి ఆందోళనచెందారు. తత్ఫలితంగా దేవతలు ఆయనకు మ్లేచ్చ (విదేశీయుల) సైన్యాన్ని ఎదుర్కొనడానికి తగిన శక్తిని ఇచ్చారు.[7]

సా.శ. 1192 లో ఘురిదుల మీద జరిగిన రెండవ తారైను యుద్ధంలో పృథ్వీరాజు చౌహాను చంపబడ్డాడు. చాహమానాలు (చౌహాన్లు), గహదవాలను ఓడించిన తరువాత, ఢిల్లీ ఘురిదుల రాజప్రతినిధి చందేలా రాజ్యం మీద దండయాత్రకు ప్రణాళిక వేశారు.[16] కుతుబు అల్-దిన్ ఐబాకు నేతృత్వంలోని ఒక శక్తి, ఇల్టుట్మిషు వంటి బలమైన సేపతులతో కలిసి సా.శ. 1202 లో కలంజారా చందేలా కోటను ముట్టడించారు.[15]

ఢిల్లీ చరిత్రకారుడు హసను నిజామి వ్రాసిన తాజ్-ఉల్-మాసిరు, పర్మారు (పరమార్ది) ఆరంభంలో కొంత ప్రతిఘటనను ఇచ్చినప్పటికీ తరువాత భద్రత కొరకు పారిపోయాడని పేర్కొన్నది. తదనంతరం ఆయన ఢిల్లీ పాలకుడి ముందు లొంగిపోయి ఆయన స్వాధీనంలో ఆయన సామంతుడిగా ఉండటానికి అంగీకరించాడు.[16] ఆయన సుల్తానుకు నివాళి అర్పిస్తానని వాగ్దానం చేసినప్పటికీ ఆయన ఈ ఒప్పందాన్ని అమలు చేయడానికి ముందే మరణించాడు. ఆయన మరణం తరువాత ఆయన దివాను అజు దేవ్ (అజయ-దేవా) ఢిల్లీల్లీ పాలకుడిని ప్రతిఘటించడం కొనసాగించాడు. కరువు సమయంలో కోటలోని నీటి నిల్వలు ఎండిపోవడంతో చివరికి దివాను లొంగిపోవలసి వచ్చింది. సుల్తానేటు విజయం తరువాత దేవాలయాలను మసీదులుగా మార్చారని, 50,000 మంది పురుషులను బానిసలుగా తీసుకున్నామని తాజ్-ఉల్-మాసిర్ పేర్కొన్నాడు. కుతుబ్ అల్-దిన్ ఐబాక్ కలంజారా రాజప్రతినిధిగా హజబ్బరు-ఉద్-దిన్ హసన్ అర్నాలును నియమించి మహోబాను కూడా స్వాధీనం చేసుకున్నాడు.[17]

16 వ శతాబ్ధానికి చెందిన ముస్లిం చరిత్రకారుడు ఫిరిష్టా దళాలకు లొంగిపోవాలని రాజు తీసుకున్న నిర్ణయంతో విభేదించిన పరమార్ధి సొంత మంత్రి ఆయనను హత్య చేసాడని సూచించాడు.[17]

599 (సా.శ. 1202-1203) లో హిజ్రీ సంవత్సరంలో కలంజర పతనం జరిగిందని ఫిరిష్టా, ఫక్రుద్దీను ముబారక్ష పేర్కొన్నాడు. తాజ్-ఉల్-మసీర్ అభిప్రాయం ఆధారంగా హిజ్రి సంవత్సరంలో 599 లో 20 వ తేదీన శుక్రవారంలో కలంజరాను పడిపోయింది. ఏదేమైనా ఈ తేదీ సా.శ. 1203 ఏప్రెలు 12 కు అనుగుణంగా ఉంది. చారిత్రక మూలాల విభిన్న వ్యాఖ్యానాల ఆధారంగా, వివిధ పండితులు కలంజర పతనం సా.శ. 1202 లేదా సా.శ. 1203 న అయి ఉండవచ్చు.[13].

చండేలా శిలాశాసనాలు పరమార్ధి తరువాత త్రైలోక్యవర్మ అధికారం వారసత్వంగా స్వీకరించాడని పేర్కొన్నాయి.[15]

నిర్వహణ[మార్చు]

బాఘారీ శాసనం ఆధారంగా వశీస్థ గోత్రానికి చెందిన బ్రాహ్మణుడైన తన ప్రధానమంత్రి సల్లక్షన మీద పరమార్ది ప్రభుత్వ భారాన్ని ఉంచాడు. సల్లక్షణ శివ, విష్ణువులకు అంకితం చేసిన దేవాలయాలను నిర్మించాడు. ఆయన మరణం తరువాత, ఆయన కుమారుడు పురుషోత్తమ తన వారసత్వంగా పదవిని పొందాడు.[13]

బాగరి శాసనం పరమార్ధికి గదాధరుడు యుద్ధ, శాంతి మంత్రి (సంధన-విగ్రహ-సచివా) గా పనిచేసాడని పేర్కొంది. భోజవర్మ అజయగడు శాసనం అభిప్రాయం ఆధారంగా గంగాధర అనే కాయస్థుడు పారామార్దికి కాన్కుకిన్ (చాంబర్లైను) గా ఉన్నాడు. గంగాధర, ఆయన సోదరుడు జౌనాధర కలంజరాలో బహుశా ఢిల్లీ దళాలకు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో పోరాడారని భావిస్తున్నారు.[18]

మాజీ సేనాపతి కిల్హానా కుమారులు అజయపాలుడు, మదనాపాలుడు పరమార్దికి చెందిన ఇద్దరు బ్రాహ్మణ సేనపతులుగా పనిచేసారు.[19]అజయపాలుడు పరమార్ది తాత మదనవర్మ సెనాపతి అని కూడా పేర్కొన్నారు.[20] పరమార్ది మరణం తరువాత ఢిల్లీ దళాలను ప్రతిఘటించిన దివానుగా అజు దేవ్ (అజయ-దేవా) ను ముస్లిం కథనాలు పేర్కొన్నాయి. మధ్యయుగ బార్డికు సంప్రదాయం అల్హా, ఉడాలా (లేదా ఉడాలు) లను తన సేనాధిపతులుగా పేర్కొంది. చారిత్రక రికార్డులలో పేర్కొన్న ఇతర అధికారులలో మహిపాలుడు, వత్సరాజ అనే అమాత్యుడు ఉన్నారు.[19]

పరమార్ధి కలంజర వద్ద ఒక రాయి మీద శివుడిని చెక్కిన శిల్పిగా పేర్కొనబడింది.[19] ఆయన అనేకమంది పండితులను పోషించాడు. వీటిలో: [21]

  • వత్సరాజా, రూపకశతకం రచయిత (ఆరు నాటకాల సమాహారం)
  • గదాధర, కవి-చక్రవర్తిగా ప్రశంశించబడిన ఉన్న కవి
  • జగానికా, అల్హా-ఖండా రచయిత
  • గుణభద్ర మునిపా సాయిధంతి, ధన్యా-కుమార-చరిత జైన రచయిత

తాను శైవుడు అయినప్పటికీ పరమార్ది బౌద్ధులు, జైనులు, వైష్ణవుల పట్ల సహనంతో ఉన్నాడు. ఆయన ఒక గ్రామాన్ని బ్రాహ్మణుడికి మంజూరు చేసినప్పుడు ఆ గ్రామంలో ఉన్న బౌద్ధ మందిరం హక్కులను గౌరవించాడని రాగి పలక శాసనం చూపిస్తుంది. ఆయన పాలనలో జైన తీర్థంకరుల అనేక చిత్రాలు వివిధ ప్రదేశాలలో ఏర్పాటు చేయబడ్డాయి. ఆయన మంత్రి సల్లక్షన విష్ణు ఆలయాన్ని నియమించారు.[21]

మూలాలు[మార్చు]

గ్రంధసూచిక[మార్చు]

  • P. C. Roy (1980). The Coinage of Northern India. Abhinav. ISBN 9788170171225.
  • R. K. Dikshit (1976). The Candellas of Jejākabhukti. Abhinav. ISBN 9788170170464.
  • Sisirkumar Mitra (1977). The Early Rulers of Khajurāho. Motilal Banarsidass. ISBN 9788120819979.
"https://te.wikipedia.org/w/index.php?title=పరమార్ది&oldid=4068295" నుండి వెలికితీశారు