పరిశోధన సహాయకుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రీసెర్చ్ అసిస్టెంట్ (RA)/ పరిశోధన సహాయకుడు అనేది ఒక తాత్కాలిక పరిశోధక పదవి.[1] యూనివర్శిటీ, రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ లేదా ప్రైవేట్ రిసెర్చ్‌లో పరిశొధనకు సహాయపడేందుకు ఈ పదవి బాధ్యత. రీసెర్చ్ అసిస్టెంట్లు స్వతంత్రంగా పనిచేయరు. వారు సూపర్‌వైజర్ లేదా ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్‌కు సహాయం చేస్తూ పరిశొధనకు సంబంధించిన బాధ్యత వహిస్తారు. వారు పరిశోధన ఫలితాలకు నేరుగా బాధ్యలు కారు. అయితే, కొన్ని దేశాలలో, పరిశోధన ఫలితాలకు పరిశోధన సహాయకులు ప్రధాన సహకారులుగా (main contributor) ఉంటారు. రీసెర్చ్ అసిస్టెంట్లు తరచుగా డిగ్రీ వరకు చదివి[2] పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ప్రోగ్రామ్‌లో నమోదు చేయబడి ఉండవచ్చు, ఆయా యూనివర్శిటీలలో బోధించవచ్చు కూడా. పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో చేరితే వారిని డాక్టోరల్ రీసెర్చ్ అసిస్టెంట్లు అంటారు. [1] [3] [4] సాధారణంగా గ్రాడ్యుయేట్ స్థాయిలో వారినే ఈ స్థానంలో నియమించబడినప్పటికీ, ఒక్కొక్కసారి అండర్ గ్రాడ్యుయేట్లు కూడా పరిశోధనకు మద్దతుగా నియమించబడతారు.

ప్రస్తావనలు

[మార్చు]
  1. 1.0 1.1 "European University Institute - Belgium Flanders, Academic Career Structure". www.eui.eu. Retrieved 2010-05-11.
  2. University of Cambridge (March 2003). "Generic Role Profile Research Assistant". Archived from the original (PDF) on 18 May 2010. Retrieved 18 May 2010.
  3. European Business School (11 May 2010). "Research Assistant - Supply Chain Management Institute". Archived from the original on May 18, 2010. Retrieved 18 May 2010.
  4. Universiti Teknikal Malaysia Melaka (9 March 2008). "Research Assistant Position at Universiti Teknikal Malaysia Melaka". Archived from the original on May 18, 2010. Retrieved 18 May 2010.