Jump to content

పర్యావరణవేత్త పూర్ణిమాదేవి

వికీపీడియా నుండి

పూర్ణిమాదేవి బర్మన్ అస్సాం కు చెందినటువంటి వన్యప్రాణి జీవశాస్త్రవేత్త[1].ఈమె అస్సాంలోని గౌహతి విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించారు.భారత వన్యప్రాణి జీవశాస్త్రవేత్త డాక్టర్ పూర్ణిమాదేవి బర్మన్ ను 2022 ఏడాది ఐక్యరాజ్యసమితి ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డుకు ఎంపిక చేశారు.పర్యావరణ వ్యవస్థ క్షీణతను నిరోధించడానికి కృషి చేస్తున్న వారికి ఇది ఐరాస ఇచ్చే అత్యున్నత గౌరవ పురస్కారం[2]. అటవీ జీవశాస్త్రవేత్త అయిన బర్మన్ రెండు దశాబ్దాలుగా చేస్తున్న కృషిని గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రాం( యూఎన్ఈపి ) తెలిపింది.పూర్ణిమాదేవి అవిపౌనా రీసెర్చ్ అండ్ కన్జర్వేషన్ డివిజన్ సీనియర్ ప్రాజెక్టు మేనేజర్ గా పనిచేస్తున్నారు .అంతరించిపోతున్న హర్గిలా అనే పక్షి జాతిని కాపాడేందుకు హర్గిలా ఆర్మీ అనే పేరుతో మహిళా గ్రూపును తయారు చేశారు.గ్రీన్ ఆస్కార్ గా పిలుచుకునే అవార్డును ఆమె పొందడం జరిగింది[3].

  1. Environment, U. N. (2022-11-10). "Dr Purnima Devi Barman". Champions of the Earth (in ఇంగ్లీష్). Retrieved 2023-08-25.
  2. Environment (2022-11-23). "Indian Biologist Purnima Devi Barman receives UN's highest environmental award - The Environment" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-08-25.
  3. PTI (2022-11-22). "India's Purnima Devi Barman honoured with U.N.'s highest environmental award". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2023-08-25.