Jump to content

పల్లెల్లో మూడ నమ్మకాలు

వికీపీడియా నుండి

మూడ నమ్మకాలకు పల్లెలని, పట్నాలని తేడాలేదు. కాక పోతే పల్లెల్లో కొంచెం ఎక్కువ. ఆ విధంగా పరిశీలిస్తే మూడ నమ్మకాలలో ముఖ్యంగా చెప్పు తగినవి: అందులో మనిషికి దెయ్యం పట్టడం, వంటి మీదకు దేవుడు రావడం, దెయ్యాలు, భూతాలు, మిత్తవలు, గాలి శోకడం వంటివవి ఎక్కువగా వుండేవి. స్త్రీలాకు మాత్రమే దెయ్యం పట్టేది. దానికి మంత్రగాన్ని పిలిపించి ముగ్గులు వేసి, నిమ్మకాయలు కోసి వేప మండలతో చావ బాదేవారు. ఈ తతంగం అంతా చాల కౄరంగా వుండేది. మాంత్రికుడు వేప మండలతో కొడుతూ..... దిగతావా దిగవా .... అని అరుస్తూండగా ఆస్త్రీ దిగుతా.... దిగుతా..... అని కొంత సేపటికి స్వాదీనంలోకి వచ్చేది. ఆతర్వాత ఆమెకు తగిలిన దెబ్బలకు కాపడం పెట్టే వారు. అందుకే అన్నారు దెబ్బకు దెయ్యం కూడా వదులుతుంది అని. ఒంటి మీదకు దేవుడు పూనడం... లేకా పూనకం రావడం అంటారు. కొందరికి పూనకం దానంతట అదే వస్తుంది. కొందరికి పూనకాన్ని ప్రేరేపించి తెప్పిస్తారు. పూనకం వచ్చాక ఆ వ్యక్తి మారు గొంతుతో ..... వూగుతూ ఎదేదో అంటుంటాడు. అప్పుడు పక్కనున్న వారు వారికి కావలసిన ప్రశ్నలు సందించి జవాబులు రాబట్టు కుంటారు. ఆంతా అయ్యాక దేవుడు కొండెక్కీ పోతాడు . అప్పుడా వ్వక్తి మామూలు స్థితికి వచ్చి 'దేవుడు ఏమి చెప్పాడ' ని ఎదుటి వారినే అడిగి తెలుసుకుంటాడు. ఇక దెయ్యాలు, భూతాలు, మిత్తవలు, కొరివి కట్టి దెయ్యం వంటివి ఎక్కువగానె వుండేవి. పలాన వాగు లో, పలాన చెట్టుపైన దయ్యాలున్నాయని చెప్పుకునేవారు. ఆ ప్రాంతానికి వెళ్లిన కొందరి దెయ్యం పట్టుకునేది. దాన్ని గాలి శోకడం అనేవారు. దాన్ని తొలిగించ దానికి మూడు వీధులు కలిసే చోట ఎవ్వరు చూడ కుండా మిరప కాయలు, నిమ్మకాయలు, రక్తంతో (ఎర్రటి కుంకుం) కలిపిన అన్నం వంటివి వేసే వారు. దానిని ఎవ్వరైనా తొక్కితే వారికి కూడా గాలి సోకుతుందని నమ్మేవారు. ఇటువంటివి ప్రక్రియలు అంత విరివిగా కాకున్నా ఈనాటికీ జరుగు తున్నాయి. కడుపు నెప్పికి, దగ్గుకు ఉల్లిపాయలను మంత్రించి ఇచ్చే వారు.

అంజనం

[మార్చు]

పశువులు తప్పిపోతె అంజనం వేసె వాడిని తీసుకొచ్చి అంజనం వేసి తమ పశువులు ఎక్కడున్నాయో కనుక్కునె వారు. అంజనం అంటే ఒక తమలపాకు మధ్యలో నల్లటి చుక్కను పెట్టి ఒక చిన్న పిల్లవాణ్ని పిలిచి ఆ చుక్కపై తదేకంగా చూడమని ఆదేసిస్తాడు నిర్వహుకుడు. నల్లచుక్కల తెల్లావు కనిపించిందా అని మాటి మాటికి అడుగు తుంటాడు నిర్వాహకుడు. ఆ బాలుడు కనిపించిందని చెప్పగానె అది ఏ దిక్కున వున్నది అని అడుగు తాడు. పలాన దిక్కులో వున్నది అని ఆ బాలుడు చేయి చూపగానె అదెంత దూరంలో వున్నది అని అడగ్గా బాలుడు చెప్పిన దిక్కున యజమాని వెళ్లి తన ఆవును తోలుకొస్తాడు. పంటలు బాగా పండాలని పొలాల్లో, చెరువు కట్టమీద ఏటను బలిచ్చి పొలి చల్లేవారు. వర్షాలు పడకుంటే సీతమ్మోరుకు తలా ఒక కుండ నీళ్లు పోయడం వంటి కార్యక్రమాలు, కప్పలకు పెళ్ళి చేసె కార్యక్రమాలు చాలనే వుండేవి. ఇటు వంటి మూడ నమ్మకాలు చాల వరకు తగ్గినా ఆరుదుగా ఇంకా కొన సాగుతున్నాయి,

మూలాలు

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]