పశువుల మేతగా అజొల్ల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

[1]

అజొల్ల[మార్చు]

 • అజొల్ల నాచుమొక్కల్లా కనిపించే, నీటిపై తేలియాడే ఒక కలుపు మొక్క
 • సాధారణంగా అజొల్ల వరి పొలాల్లోనూ, లోతులేని జలావాసాల్లోనూ పెరుగుతుంది
 • అత్యంతవేగంగా వృద్ధి చెందుతుంది.

పశుగ్రాసం/మేతగా అజొల్ల[మార్చు]

 • మాంసకృత్తులు, ఎమైనో అమ్లాలు, విటమిన్లు (ఎ విటమిన్,బి12 విటమిన్, బెటా-కెరొటెన్) ఎదుగుదలకు దోహదకారకాలు, ధాతువులు అయిన కాల్షియం, ఫాస్పరస్, పోటాషియం, ఫెర్రస్, కాపర్, మాంగనీస్ వంటి వాటితో సమృద్ధమైనది.
 • మాంసకృత్తులు 25 - 35 శాతం, ఖనిజాలు 10 - 15శాతం, ఎమైనో అమ్లాలు, ఖనిజద్రవ్యాలు, బయో పాలిమర్స్ 7 - 10 శాతం కలిగిఉండి పొడిభారమాధారమైనది.
 • అధికమాంసకృత్తులుండి, కాండభాగం తక్కువగా ఉండటంతో పశువులు త్వరగా జీర్ణం చేసుకోగలవు.
 • అజొల్లను ఇతరదాణాలతో కలిపికానీ, నేరుగా కానీ పశువులకు ఇవ్వవచ్చు. కుందేళ్ళకు, పందులకు, గొర్రెలకు, మేకలకు, కోళ్ళకు కూడా దాణాగా వాడవచ్చు.

తయారీ[మార్చు]

 • నేలను సమతలం చేసి, కలుపుమొక్కలను తీసివెయ్యాలి
 • క్షితిజ సమాంతరంగా ఇటుకలను దీర్ఘచతురస్రాకారంలో అమర్చాలి
 • ఒక అతినీలలోహితాన్ని స్థిరీకరించిన పోలిధిన్ షీటును దీర్ఘచతురస్రాకారంలో అమర్చిన ఇటుకల చివరలు కూడా కప్పెట్టబడేలా వాటిమీద సమాంతరంగా పరచాలి. (మీ X2 మీ కొలతలో )
 • జల్లించిన 10-15 కిలో గ్రాముల మట్టిని ఈ షీటు పై చల్లాలి
 • ఆవుపేడ 2 కిలోగ్రాములు, 30 గ్రాముల సూపర్ ఫాస్పేట్ కలిపిన ముద్దను 10 లీటర్ల నీటితో కలిపి పోలిధిన్ షీటు మీద పోయాలి. నీటిమట్టం 10 సెంటి మీటర్లకు చేరేందుకు మరిన్ని నీళ్ళను పోయాలి.
 • శుద్ధమైన కణసంవర్ధనం చేసిన అజొల్లవిత్తన ముడి సరుకును, కిందపరచుకుని ఉన్న అజొల్ల పాదు పైనున్న మట్టిని, నీటిని సున్నితంగా కదిలించిన తర్వాత చల్లాలి. అజొల్ల మొక్కలు నిటారుగా ఎదిగేందుకు అవి భూమిని చీల్చుకుని బయటకు వచ్చిన వెంటనే తాజానీటిని చిలకరించాలి.
 • ఒక వారంలో అజొల్ల పాదుమొత్తం పరచుకుని ఒక చిక్కని చాపలా కనిపిస్తుంది.
 • శీఘ్ర గతిన అజొల్ల హెచ్చయ్యేందుకు, రోజువారీ దిగుబడి 500 గ్రాములగా ఉండేందుకు గాను, సూపర్ సల్ఫేట్ 20 గ్రాములు, ఒక కిలోగ్రాము అవుపేడ కలిపిన మిశ్రమాన్ని అయిదురోజుల కొకసారి కలుపుతుండాలి.
 • అజొల్ల యొక్క ఖనిజ ద్రవ్యాలను పెంపొందించేందుకు వారానికోతడవ మెగ్నీషియం, ఇనుము, రాగి, సల్ఫ్రర్ వంటివి కలిపినసూక్ష్మపోషకమిశ్రమాన్ని కలపవచ్చు
 • ప్రతి 30 రోజులకొకసారి నత్రజని పెరిగిపోకుండా ఉండేందుకు గాను అయిదు కిలోల పాదు మట్టిని మారుస్తూ ఉండాలి, తద్వారా సూక్ష్మపోషక లోపాన్ని కూడా అరికట్టవచ్చు.
 • పాదులో నత్రజని పెరిగిపోకుండా ఉండేందుకు గాను మొత్తం నీటిలో 25 నుంచి 30 శాతం వరకూ నీటిని, తాజానీటితో మారుస్తూ ఉండాలి.
 • ప్రతి ఆరునెలల కొకసారి పాదును శుభ్రం చేసి, నీటిని, మట్టిని మార్చి, కొత్తగా అజొల్లను పాదుకొలపాలి
 • తెగుళ్ళు, కీటకాలతో కలుషితమయినప్పుడు పాదును మరలా సిద్ధంచేసి శుద్ధమైన కణసంవర్ధనం చేసిన అజొల్లను పాదుకొలపాలి.

పంటకోత[మార్చు]

శీఘ్రంగా ఎదుగుతుంది, గుంత ప్రతి 10 - 15 రోజులకొకసారి నిండుతుంది. అక్కడి నుండి ప్రతిరోజూ 500 - 600 గ్రాముల అజొల్లను కోయవచ్చు.

 • పదిహేనవ రోజునుంచి, ప్రతిరోజు ప్లాస్టిక్ జల్లెడతో గాని, అడుగున చిల్లులున్నతట్టతో కానీ ఈ పని చెయ్యవచ్చు.
 • కోసిన అజొల్లనుంచి ఆవుమూత్రపు వాసనను పోగొట్టేందుకు శుభ్రమైన నీటితో కడగాలి ప్రత్యామ్నాయ ఉత్పాదకాలు
 • తాజాబయోగ్యాస్ మడ్డినీ కూడావాడొచ్చు
 • గుంతను నింపేందుకు స్నానపునీటిని, పశువులపాక నుంచివచ్చే వ్యర్ధపు నీటినీ కూడా ఉపయోగించవచ్చు.

మంచినీటికి కొరత ఉన్నప్రాంతాలలోబట్టలు ఉతికేటప్పుడు వాడిన నీటిని (రెండవసారి ఝాడించినవి) కూడా వాడుకోవచ్చు.

ఎదుగుదలకు కావాల్సిన పర్యావరణ కారకాలు[మార్చు]

 • ఉష్ణోగ్రత 20°సి - 28°సి
 • వెలుతురు 50% పూర్తి సూర్యకాంతి
 • సాపేక్ష తేమ 65 - 80%
 • నీరు (గుంతలో నిలవ) 5 - 12 సెంటీమీటర్లు
 • పిహెచ్ 4 - 7.5

అజొల్ల సాగులో గుర్తుంచుకోవాల్సిన సంగతులు

 • వల లోపల శుభ్రం చెయ్యటంవల్ల చిన్నచిన్న పిలకలు బయటపడటానికి వీలుంటుంది. మరలా వాటిని నీటిగుంటలోకి జారవిడవవచ్చు.
 • ఉష్ణోగ్రత 25° సి లోపు ఉండేలా జాగ్రత్త వహించాలి.
 • వెలుతురు తీవ్రతను తగ్గించేందుకు అడ్డుగా నీడనిచ్చే వలలు వాడవచ్చు.
 • గుంపుగా మారకుండా ఉండేందుకు అజొల్ల జీవద్రవ్యాన్ని ప్రతిరోజూ తొలగించాలి.

వనరులు[మార్చు]

 1. ప్రగతిపీడియా జాలగూడు[permanent dead link]