Jump to content

పాండవోద్యోగం

వికీపీడియా నుండి

తిరుపతి వేంకట కవులుగా ప్రసిద్ధి చెందిన దివాకర్ల తిరుపతి శాస్త్రి, చెళ్లపిళ్ళ వేంకట శాస్త్రి మహా భారత కథను పాండవ జననము, పాండవ ప్రవాసాము, పాండవరాజసూయము, పాండవోద్యోగము, పాండవ విజయము, పాండవ అశ్వమేధము అనే నాటకాలుగా రచించారు. అందులో అత్యంత ప్రజాదారణ పొందిన నాటకాలు పాండవోద్యోగం, పాండవ విజయం. ఆ రెండు నాటకాలను రెండు రోజులు ప్రదర్శించే వారు. కాలక్రమంలో ఆ రెండు నాటకాలను సంకలనం చేసి 'కురుక్షేత్రము' అనే నాటకం గా ప్రదర్శించేవారు. పాండవ ఉద్యోగ విజయాలు, కురుక్షేత్రం నాటకాలు బాగా ప్రఖ్యాతి పొందాయి. ఈ నాటకాలు ప్రదర్శించని ఊరు లేదంటే అతిశయోక్తి కాదు. బావా ఎప్పుడు వచ్చితీవు అని జెండాపై కపిరాజు అనే రాగం తీయని ఆంధ్రుడు ఉండడేమో..పూర్తిగా కాకున్నా, ఈ పద్యాల పూర్వోత్తరాలు తెలియకున్నా, ఈ పద్యాల ప్రారంభమైనా ఈ తరం వారికీ కూడా తెలుసు. అంత ప్రాచుర్యం పొందాయి ఈ పద్యాలు.. శ్రీకృష్ణరాయబారం సన్నివేశం ఎన్ని చిత్రాలలో ఉందో, ఈ పద్యాలు ఎన్ని సినిమాలలో ఉన్నాయో గణిచ లేము. అంత ప్రాచుర్యం పొందినవీ నాటకాలు, పద్యాలు..

పాత్రలు

[మార్చు]
  • సూత్రధారుడు
  • నారదుడు
  • మారీషుడు
  • వృద్ధ పురోహితుడు
  • శ్రీకృష్ణుడు
  • ద్వివేది
  • ధర్మరాజు
  • దుర్యోధనుడు
  • భీముడు
  • దుశ్శాసనుడు
  • అర్జునుడు
  • దృతరాష్ట్రుడు
  • నకులుడు
  • సహదేవుడు
  • భీష్ముడు
  • ద్రోణుడు
  • ద్రౌపది
  • కర్ణుడు
  • గాంధారి
  • అశ్వత్థామ
  • కుంతి
  • వికర్ణుడు
  • జమదగ్ని
  • ఉలూకుడు
  • జాబాలి
  • రుక్మి
  • విదురుడు
  • పురుషుడు
  • కృపాచార్యుడు
  • ఫణిహారి
  • సాత్యకి
  • యుయుత్సుడు
  • సూతుడు
  • వందిమాగధులు

నాటకం

[మార్చు]
  1. ప్రథమాంకము
  2. ద్వితీయాంకము
  3. తృతీయాంకము

కృష్ణుడు దుర్యోధనునితో పల్కిన మాటలు.

చెల్లియొ చెల్లకో తమకు జేసిన యెగ్గులు సైచిరందరుం
తొల్లి గతించె, నేడు నను దూతగ బంపిరి సంధిసేయ నీ
పిల్లలు పాపలుం బ్రజలు పెంపు వహింపగ బొందు సేసెదో
యెల్లి రణంబు గూర్చెదవొ యేర్పడ జెప్పుము కౌరవేశ్వరా!

అలుగుటయే యెరుంగని మహామహితాత్ము డజాతశర్రుడే
యలిగిననాడు సాగరము లన్నియు నేకము గాకపోవు క
ర్ణులు పదివేవురైన నని నొత్తురు చత్తురు రాజ రాజ నా
పలుకులు విశ్వసింపుము విపన్నుల లోకులగావు మెల్లరన్.

జెండాపై కపిరాజు ముందు సితవాణిశ్రేణియుం గూర్చి నే
దండంబుంగొని తోలు స్యందనముమీద న్నారి సారించుచున్
గాండీవమ్ము ధరించి ఫల్గుణుడు మూకన్ జెండుచున్నప్పుడొ
క్కండు న్నీమొరనాలకింపడు కురుక్ష్మానాధ సంధింపగన్.

సంతోషంబుల సంధిచేయుదురె వస్త్రంబూడ్చుచో ద్రౌపదీ
కాంతం జూచిననాడు చేసిన ప్రతిజ్ఞాల్ దీర్ప భీముండు నీ
పొంత న్నీ సహజన్ము రొమ్ము రుధిరమ్ము న్త్రావునాడైన ని
శ్చింతం దద్గదయుం ద్వదూరుయుగమున్ ఛేదించునా డేనియున్.

  1. చతుర్థాంకము
  2. పంచమాంకము
  3. షష్ఠాంకము
  4. భరతవాక్యము

కలుగుంగావుత నీకు దక్క నృపభక్త శ్రేణియం దాయతుల్
గెలుచుంగావుత ధర్మ మెన్నటికి, వాగ్దేవీమహత్మ్యంబు లి
క్కలికాలమ్మున భారతాశ్రయములై కావ్యంబులై నాటకం
బులునై యాటలు బాతలై వెలయుతన్ భూలోకమందెల్లెడన్.