పాండు (నటుడు)
పాండు | |
---|---|
జననం | కుమారపాళెయం, తమిళనాడు | 1947 ఫిబ్రవరి 19
మరణం | 2021 మే 6[1] చెన్నై, తమిళనాడు | (వయసు 74)
వృత్తి | తమిళ సినీ నటుడు, చిత్రకారుడు, గ్రాఫిక్ డిజైనర్ |
క్రియాశీల సంవత్సరాలు | 1970, 1981 1988–2021 |
జీవిత భాగస్వామి | కుముద |
పిల్లలు | ముగ్గురు కుమారులు |
పాండు (నటుడు) తమిళ సినిమా నటుడు, చిత్రకారుడు, [2] గ్రాఫిక్ డిజైనరు. ఆయన హాస్య నటుడు. పాండు 1970లో ‘మనావన్’ అనే చిత్రం ద్వారా సినీరంగానికి పరిచయమయ్యాడు.[3] అతడు 500 కు పైగా చిత్రాల్లో నటించాడు.[4]
పాండు ‘క్యాపిటల్ లెటర్స్’ అనే డిజైన్ కంపెనీని నడుపుతున్నాడు. అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట కజగం (ఎడిఎంకె) పార్టీ గుర్తు అయిన రెండాకులను, తమిళనాడు పర్యాటక చిహ్నం ఐకానిక్ జెండాను అతనే రూపొందించాడు.[5] అతని సోదరుడు ఇదిచాపులి సెల్వరాజ్ కూడా తమిళ సినిమాలో హాస్య నటుడిగా నటించాడు.
ఏఐడీఎంకే చిహ్నం రూపకర్త
[మార్చు]ఏఐడీఎంకే పార్టీ చిహ్నాన్ని పాండునే రూపొందించాడు. ఎంజీ రామచంద్రన్ పార్టీని స్థాపించినప్పుడు పాండును పిలిచి పార్టీకి ఒక సింబల్‌ను రూపొందించాల్సిందిగా సూచించాడు. 1977 ఎన్నికలకు ముందు మరోసారి ఎంజీఆర్ పిలవగా, రెండు ఆకుల గుర్తును పాండు డిజైన్ చేసి ఇచ్చాడు. ఆ తర్వాత ఎంజీఆర్‌తో ఆయన ప్రయాణం కొనసాగింది. ‘క్యాపిటల్ లెటర్స్’ పేరుతో ఒక డిజైన్ కంపెనీని కూడా పాండు నడిపాడు. దీని ద్వారా చిత్ర పరిశ్రమలోని సినీ ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాలకు పేర్లు డిజైన్ చేసి ఇచ్చేవాడు.
పాండు 2021 మే 6 న కోవిడ్-19 వ్యాధితో మరణించాడు. [5]
మూలాలు
[మార్చు]- ↑ https://www.deccanherald.com/entertainment/entertainment-news/tamil-actor-pandu-passes-away-due-to-covid-19-complications-982862.html
- ↑ The New Indian Express (7 ఏప్రిల్ 2014). "Art With Alphabets". Archived from the original on 7 మే 2021. Retrieved 7 మే 2021.
- ↑ News18 Telugu (6 మే 2021). "Pandu passes away due to Covid : కరోనాతో కన్నుమూసిన మరో ప్రముఖ హాస్యనటుడు." News18 Telugu. Archived from the original on 7 మే 2021. Retrieved 7 మే 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Andhrajyothy (7 మే 2021). "కబళిస్తోన్న కరోనా.. ఒకే రోజు ముగ్గురు సినీ ప్రముఖుల మృతి". Archived from the original on 7 మే 2021. Retrieved 7 మే 2021.
- ↑ 5.0 5.1 10TV (6 మే 2021). "కరోనాతో తమిళ హాస్యనటుడు పాండు కన్నుమూత | pandu" (in telugu). Retrieved 7 మే 2021.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help)CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)