పాటిబండ మాధవశర్మ
స్వరూపం
This article needs more links to other articles to help integrate it into the encyclopedia. (ఏప్రిల్ 2017) |

పాటిబండ మాధవశర్మ సంస్కృతాంధ్ర పండితుడు, రచయిత. అనేక ప్రాచీన సంస్కృత, తెలుగు గ్రంథాలను పరిష్కరించాడు. ఉదయ భారతి అనే త్రైమాస పత్రికకు, వీణ అనే మాసపత్రికకు సంపాదకుడిగా ఉన్నాడు.
విశేషాలు
[మార్చు]పాటిబండ మాధవశర్మ వెంకటరామయ్య, మహాలక్ష్మి దంపతులకు జన్మించాడు. ఎం.ఎ. ఆనర్స్ చదివాడు. విజయవాడలోని ఎస్.ఆర్.ఆర్. ఆండ్ సి.వి.ఆర్. కళాశాలలోను హైదరాబాదులోని న్యూ సైన్స్ కాలేజీలోను ఆంధ్రోపన్యాసకుడిగా పనిచేశాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ రీడర్‌గా పదవీ విరమణ చేశాడు.
రచనలు
[మార్చు]- ఆంధ్ర మహాభారతము - ఛందఃశిల్పము (పి.హెచ్.డి. సిద్ధాంత వ్యాసం)
- అభిమన్యు వివాహము: విరాటపర్వము పంచమాశ్వాసము
- శబ్దమఞ్జరీ (పరిష్కర్త)
- రాజశిల్పి
- తిక్కన కవితావైభవం
- తెలుగులో సాహిత్య విమర్శ
- విక్రమోర్వశీయమ్ (వ్యాఖ్యానము)
- గిరిక పెళ్ళి [1] (వసుచరిత్ర వచనంలో అనువాదం)
- మహాకవి భారవి ప్రణీతము కిరాతార్జునీయము (ఆంధ్ర 'బాలసుధా' వ్యాఖ్య సహితము) - ప్రథమ సర్గము[2]
- శ్రీతపతీ సంవరణము - అద్దంకి గంగాధరకవి ప్రణీతము
- రఘువంశము - దశమ సర్గము
- చారుణి [3]
- దశకుమారచరితం (పరిష్కరణ) [4]
- ఇంద్రాణి (ఐతిహాసిక నవల) [5]
కలంపేరు
[మార్చు]విష్ణుప్రియ
మూలాలు
[మార్చు]- ↑ పాటిబండ, మాధవశర్మ (1951). గిరిక పెండ్లి (3 ed.). విశాఖపట్టణం: ఎం.ఎస్.ఆర్.మూర్తి అండ్ కో. Retrieved 17 February 2025.
- ↑ పాటిబండ, మాధవశర్మ (1972). కిరాతార్జునీయము (1 ed.). హైదరాబాదు: శ్రీ పరమేశ్వర పబ్లికేషన్స్. Retrieved 15 December 2014.
- ↑ భారత డిజిటల్ లైబ్రరీలో చారుణి పుస్తక ప్రతి.
- ↑ పాటిబండ, మాధవశర్మ (1972). దశకుమార చరితం (1 ed.). హైదరాబాదు: శ్రీపరమేశ్వర పబ్లికేషన్స్. Retrieved 14 December 2014.
- ↑ పాటిబండ, మాధవశర్మ (1958). ఇంద్రాభి. సికిందరాబాద్: నాగేంద్ర బుక్ డిపో. Retrieved 14 December 2014.