పాటిమీది జగన్ మోహన్ రావు
పాటిమీది జగన్‌మోహన్‌రావు | |||
| |||
తెలంగాణ స్టేట్ టెక్నలాజికల్ సర్వీసెస్ చైర్మన్
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 29 డిసెంబర్ 2021 - 03 డిసెంబర్ 2023 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
---|---|---|---|
జననం | అక్టోబర్ 16 కూకట్‌పల్లి, హైదరాబాద్, భారతదేశం | ||
జాతీయత | భారతదేశం | ||
రాజకీయ పార్టీ | భారత్ రాష్ట్ర సమితి | ||
నివాసం | హైదరాబాద్ |
పాటిమీది జగన్‌మోహన్‌రావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన తెలంగాణ స్టేట్ టెక్నలాజికల్ సర్వీసెస్ చైర్మన్‌గా 17 డిసెంబరు 2021న నియమితుడై,[1] 29 డిసెంబరు 2021న చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టాడు.[2][3]
రాజకీయ జీవితం
[మార్చు]పాటిమీది జగన్‌మోహన్‌రావు టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుండి తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ కార్యకర్తగా, విద్యార్థి నాయకుడిగా చురుకైన పాత్ర పోషించాడు. ఆయన తెలంగాణ వెనుకబాటుతనంపై శ్రీకృష్ణ కమిటీకి ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాడు. జగన్‌మోహన్‌రావు గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ కమిటీకి యువజన విభాగం ఇన్‌చార్జిగా పని చేశాడు.
పాటిమీది జగన్‌మోహన్‌రావును తరువాత టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్‌గా నియమించింది. ఆయన కన్వీనర్‌గా పార్టీ సభ్యులు, కమిటీల డేటా బేస్, పార్టీ వెబ్‌సైట్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ తదితరాల నిర్వహణతోపాటు ప్రతిపక్షాలు చేసే ప్రచారాన్ని తిప్పికొట్టడం, ప్రభుత్వ పథకాలను సామాజిక మాధ్యమ వేదికలైన ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వ్యాప్తి ప్రజలకు చేరవేయడంలో విశేషంగా కృషి చేశాడు.
పాటిమీది జగన్ మోహన్ రావు తెలంగాణ స్టేట్ టెక్నలాజికల్ సర్వీసెస్ చైర్మన్‌గా 17 డిసెంబరు 2021న నియమితుడై,[4][5] 29 డిసెంబరు 2021న చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టాడు.[6][7]
చిత్రమాలిక
[మార్చు]-
తెలంగాణ స్టేట్ టెక్నలాజికల్ సర్వీసెస్ చైర్మన్‌గా నియమితుడైన తరువాత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ టి.పద్మారావు గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన పాటిమీది జగన్ మోహన్ రావు
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (18 December 2021). "అయిదు కార్పొరేషన్లకు కొత్త ఛైర్మన్లు". Archived from the original on 18 December 2021. Retrieved 18 December 2021.
- ↑ Namasthe Telangana (29 December 2021). "స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన జగన్మోహన్". Archived from the original on 30 December 2021. Retrieved 30 December 2021.
- ↑ Sakshi (30 December 2021). "కార్పొరేషన్ చైర్మన్ల బాధ్యతల స్వీకరణ". Archived from the original on 30 December 2021. Retrieved 30 December 2021.
- ↑ Namasthe Telangana (17 December 2021). "ఉద్యమకారులకు ఉన్నత స్థానం". Archived from the original on 18 December 2021. Retrieved 18 December 2021.
- ↑ Sakshi (17 December 2021). "పలు కార్పొరేషన్‌లకు కొత్త చైర్మన్‌లను నియమించిన కేసీఆర్". Archived from the original on 30 December 2021. Retrieved 30 December 2021.
- ↑ ETV Bharat News (29 December 2021). "పదవీబాధ్యతలు స్వీకరించిన కొత్త ఛైర్మన్లు." Archived from the original on 29 December 2021. Retrieved 29 December 2021.
- ↑ Eenadu (30 December 2021). "మూడు కార్పొరేషన్ల కొత్త ఛైర్మన్ల బాధ్యతల స్వీకరణ". Archived from the original on 30 December 2021. Retrieved 30 December 2021.