పాన్‌చో
Jump to navigation
Jump to search
87 సంవత్సరాలుగా జీవిస్తూ, జీవించినంతకాలం సినిమాలలో నటిస్తూ, అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్న ఒక పంచవన్నెల చిలుక పేరు పాన్‌చో. మాకా జాతికి చెందిన ఈ చిలుక జీవితంలో ఓపిక ఉన్నంతకాలం హాలీవుడ్ చిత్రాలలో నటిస్తూనే ఉన్నది. ప్రస్తుతం యూకేలోని ష్రాప్‌షైర్, ష్రూబరీలో వృద్ధాప్యపు విశ్రాంతిలో ఉంది పాన్‌చో. 2000 వ సంవత్సరంలో నిర్మించిన "102 డాల్మేషియన్స్" చిత్రంలో నటన కోసం పాన్‌చో ను యుకేకు తీసుకొచ్చారు. అప్పటికే దీనికి 70 ఏళ్లు. వృద్ధాప్యంతో ఉన్న ఈ చిలుకను తిరిగి తీసుకుకెళ్లడం సరికాదని అక్కడే ఉంచేశారు. దాంతో అక్కడ పెట్ షాప్‌ను నిర్వహిస్తున్న రెబెకా టేలర్, సోఫీ విలియమ్స్ ఈ చిలుకను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. మామూలుగా చిలుక జీవితకాలం 80 నుంచి 96 సంవత్సరాలు. అయితే అన్ని సంవత్సరాలు బతికే చిలుకలు చాలా అరుదు.
మూలాలు
[మార్చు]- సాక్షి దినపత్రిక - 10-09-2014 - (అతి పెద్ద వయసున్న చిలుక ఏది?)