Jump to content

పాపమోచని ఏకాదశి

వికీపీడియా నుండి

హిందూ మతంలో ఏకాదశి వ్రతానికి ముఖ్యమైన స్థానం ఉంది. ఏకాదశి మహావిష్ణువుకు అంకితం చేసిన రోజు. ప్రతి సంవత్సరం 24 ఏకాదశులు వస్తాయి. అధికమాసం వచ్చినప్పుడు, వాటి సంఖ్య 26కి పెరుగుతుంది. తెలిసో తెలియకో పాపం చేయని మానవుడు ఈ లోకంలో పుట్టడని హిందూ మతంలో చెప్పబడింది. పాపం అనేది ఒక రకమైన తప్పు, దానికి మనం శిక్ష అనుభవించవలసి ఉంటుంది. దైవ శాసనం ప్రకారం పాపమోచినీ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే పాపం నుండి తప్పించుకోవచ్చు.

విశిష్టత

[మార్చు]

పరమపవిత్రమైన ఈరోజున విష్ణు ఆరాధన చేస్తే బ్రహ్మహత్యదోషం కూడా తొలగిపోతుందని ప్రాశస్తి. అందుకే ఈ ఏకాదశి అత్యంత విశేషమైనది. ఈరోజు స్నానదానానికి అత్యంత విశేషమైన రోజు. ఈరోజు చేసే పరిహారాల వల్ల స్వర్గలోక ప్రాప్తి కూడా కలుగుతుంది.[1]

మూలాలు

[మార్చు]
  1. "do this one thing on papamochani ekadashi 2024 to get vishnu blessings| Papamochani Ekadashi 2024: పాపమోచని ఏకాదశి రోజు ఈ చిన్న పనిచేస్తే లక్ష్మీనారాయణుల కటాక్షం.. News in Telugu". web.archive.org. 2024-04-05. Archived from the original on 2024-04-05. Retrieved 2024-04-05.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)