పాపవిమోచన ఏకాదశి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పాపవిమోచన ఏకాదశి ని హిందువులు పాల్గుణ బహుళ / కృష్ణ ఏకాదశి] సూర్యోదయం కి ద్వాదశి తో ఉన్న రోజుని ఆరోగ్యం కోసం పాప విమోచన ఏకాదశి జరుపుకుంటారు. దీనినే సౌమ్య ఏకాదశి, కామద ఏకాదశి, దమన ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని విష్ణుపూజ, ఉపవాసం, జాగరణ మొదలైన వాటితో చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయని ధర్మ సింధులో చెప్పబడింది.మేధావి అనే ఋషి ఇంద్రుని ఆజ్ఞ తో తపో భంగం చేసి, ఋషి ప్రసన్న నివారణ ఉపాయం గా ఈ రోజు ఏకాదశి వ్రతం చేసి విమోచన పొందిన మంజు ఘోష అనే అప్సరస పాపాలను హరింపచేసే ఏకాదశి కాబట్టి యిది పాపవిమోచన ఏకాదశి అయింది.స్త్రీలు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే వైధవ్యం రాదని చెప్పబడింది.

ఈరోజునే శ్రీకృష్ణునిని ఆందోళికోత్సవము జరుపుతారు. ఉయ్యాలలోని కృష్ణుని దర్శించినంత మాత్రమున కలికాలపు దోషాలు పాతాయి. కృష్ణ ప్రతిమగల ఉయ్యాలను ఊచితే, వేయి అపరాధాలైనా క్షమింపబడతాయి, కోటి జన్మల పాపాలు తొలగడమే కాక అంతమునందు విష్ణు సాయుజ్యము లభించగలదు.

మూలాలు

[మార్చు]
  • ధర్మ సింధు - శ్రీ కాశీనాధోపాధ్యాయ విరచితము, శ్రీ భాగవతుల సుబ్రహ్మణ్యం, నవరత్న బుక్ హౌస్, విజయవాడ, 2009, పేజీలు: 86-7..