పాపికొండ జాతీయ ఉద్యానవనం
పాపికొండ జాతీయ ఉద్యానవనం | |
---|---|
Location | ఆంధ్రప్రదేశ్, భారతదేశం |
Coordinates | 17°28′58.8″N 81°29′8.2″E / 17.483000°N 81.485611°E |
Area | 1,012.86 కి.మీ2 (391.07 చ. మై.) |
పాపికొండ జాతీయ ఉద్యానవనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల నడుమ ఉన్న పాపికొండలలో ఉంది.
చరిత్ర
[మార్చు]ఈ ఉద్యానవనాన్ని 1978 లో వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంగా ఏర్పరిచారు. ఆ తరువాత 2008 లో ఈ ఉద్యానవనాన్ని జాతీయ ఉద్యానవనంగా ప్రకటించారు.[1]
జంతు, వృక్ష సంపద
[మార్చు]ఈ ఉద్యానవనంలో తేమ ఆకురాల్చే, పొడి ఆకురాల్చే అడవులు ఉన్నాయి. చెట్ల జాతులలో స్టెరోకార్పస్ మార్సుపియం, టెర్మినాలియా ఎలిప్టికా, టెర్మినాలియా అర్జున, అడినా కార్డిఫోలియా, స్టెర్క్యులియా యురెన్స్, మంగిఫెరా ఇండికా, అనోజిసస్ లాటిఫోలియా లాంటి అనేక రకాల జాతులకు చెందిన మొక్కలు ఉన్నాయి. ఈ ఉద్యానవనంలో బెంగాల్ పులులు, చిరుతపులులు, మచ్చ పిల్లులు, ఎలుగుబంట్లు, జింకలు లాంటి అనేక రకాల జంతువులు ఉన్నాయి.[2]
మరిన్ని విశేషాలు
[మార్చు]ఈ ఉద్యానవనం ఎత్తు 20మీ నుండి 850 మీ వరకు ఉంటుంది. ఈ ఉద్యానవనం గుండా గోదావరి నది ప్రవహిస్తుంది. పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు పూర్తి అయిన తరువాత ఈ ఉద్యానవనం కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నాయి.[3]
మూలాలు
[మార్చు]- ↑ Gujja, B.; Ramakrishna, S.; Goud, V.; Sivaramakrishna (2006). Perspectives on Polavaram, a Major Irrigation Project on Godavari (in ఇంగ్లీష్). Academic Foundation. ISBN 9788171885787.
- ↑ Aditya, V.; Ganesh, T. (2017). "Mammals of Papikonda Hills, northern Eastern Ghats, India". Journal of Threatened Taxa. 9 (10): 10823–10830. doi:10.11609/jott.3021.9.10.10823-10830. Archived from the original on 2019-10-27. Retrieved 2019-10-27.
- ↑ Ganesh, Thyagarajan; Aditya, Vikram (2018-11-08). "Deciphering forest change: Linking satellite-based forest cover change and community perceptions in a threatened landscape in India". Ambio (in ఇంగ్లీష్). 48 (7): 790–800. doi:10.1007/s13280-018-1108-x. ISSN 1654-7209. PMC 6509315. PMID 30406924.