Jump to content

పాయల్ కపాడియా

వికీపీడియా నుండి
పాయల్‌ కపాడియా
2021 డైరెక్టర్స్ ఫోర్ట్‌నైట్ లో పాయల్‌ కపాడియా
జననం
ముంబై, భారతదేశం
విద్యాసంస్థఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా
వృత్తిఫిల్మ్ మేకర్

పాయల్ కపాడియా ఒక భారతీయ చిత్రనిర్మాత. ఆమె ఎ నైట్ ఆఫ్ నోయింగ్ నథింగ్ చిత్రానికి గాను 2021 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రంగా గోల్డెన్ ఐ అవార్డు (L'Œil d'or)ను గెలుచుకున్నందుకు ఆమె బాగా ప్రసిద్ది చెందింది.[1][2][3][4] 2017లో, ఆమె చిత్రం ఆఫ్టర్‌నూన్ క్లౌడ్స్ 70వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైన ఏకైక భారతీయ చిత్రం.[5]

మే 2024లో పాయల్ కపాడియా రూపొందించిన చిత్రం ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్, 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పోటీ పడనుంది.[6] అలాగే, బ్రిటిష్-భారతీయ దర్శకురాలు సంధ్య సూరి చిత్రం సంతోష్ కూడా ప్రదర్శించడానికి ఎంపిక చేసారు.[7]

బాల్యం, విద్యాభ్యాసం

[మార్చు]

ముంబైలో జన్మించిన ఆమె ఆంధ్రప్రదేశ్‌లోని రిషి వ్యాలీ స్కూల్‌లో చదివింది. ఆమె ముంబైలోని సెయింట్ జేవియర్స్ కాలేజీ నుండి ఆర్థికశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని పొందింది.[8] ఆమె సోఫియా కాలేజీలో ఒక సంవత్సరం మాస్టర్స్ డిగ్రీ చేసింది. ఆ తర్వాత, ఆమె ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో ఫిల్మ్ డైరెక్షన్‌ కోర్సుని అభ్యసించింది.[9][10]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
సంవత్సరం షార్ట్ ఫిల్మ్ / డాక్యుమెంటరీ క్రెడిట్ మూలాలు
డైరక్టర్ రైటర్ ఎడిటర్
2014 వాటర్మిలన్, ఫిష్‌ అండ్ హాఫ్ ఘోస్ట్ అవును - - [11]
2015 ఆఫ్టర్నూన్ క్లౌడ్స్ అవును అవును -
2017 ది లాస్ట్ మ్యాంగో బిఫోర్ ది మాన్సూన్ అవును - అవును
2018 అండ్ వాట్ ఈజ్ ది సమ్మర్ సేయింగ్ అవును - -
2021 ఎ నైట్ ఆఫ్ నోయింగ్ నథింగ్ అవును అవును -
2024 ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్ అవును అవును - [12]

మూలాలు

[మార్చు]
  1. "Payal Kapadia wins best documentary award in Cannes". India Today (in ఇంగ్లీష్). 18 July 2021. Retrieved 2021-07-20.
  2. "Mumbai-based film-maker Payal Kapadia wins Best Documentary Award at Cannes". The Economic Times. IANS. 19 July 2021. Retrieved 2022-09-13.
  3. "Cannes 2021: India's Payal Kapadia wins best documentary award". Hindustan Times (in ఇంగ్లీష్). 2021-07-18. Retrieved 2021-07-20.
  4. Entertainment, Quint (2021-07-18). "Cannes 2021: Payal Kapadia's A Night of Knowing Nothing Wins Best Documentary". TheQuint (in ఇంగ్లీష్). Retrieved 2021-07-20.
  5. "Meet FTII student Payal Kapadia, whose film Afternoon Clouds, was selected for Cannes 2017". Firstpost. 2017-06-10. Retrieved 2021-07-20.
  6. "30 ఏళ్ల తరవాత... కేన్స్‌లో ఆమె |". web.archive.org. 2024-04-14. Archived from the original on 2024-04-14. Retrieved 2024-04-14.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  7. "Cannes Film Festival to screen Indian directors Payal Kapadia and Sandhya Suri at this year's ceremony - The Hindu". web.archive.org. 2024-05-20. Archived from the original on 2024-05-20. Retrieved 2024-05-20.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  8. Dore, Bhavya (7 June 2017). "Payal Kapadia: Over the Clouds". Open: The Magazine.
  9. "Who Is Payal Kapadia? The Director Wins Best Documentary Award In Cannes" (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2021-07-20. Retrieved 2021-07-20.
  10. Dore, Bhavya (7 June 2017). "Payal Kapadia: Over the Clouds". Open: The Magazine.
  11. "Watermelon, Fish and Half Ghost (Student Film) – Urban Lens" (in బ్రిటిష్ ఇంగ్లీష్). Archived from the original on 2021-07-20. Retrieved 2021-07-20.
  12. Eenadu (21 November 2024). "రానా మాటల్లోనే మా విజయం కనిపించింది". Archived from the original on 21 November 2024. Retrieved 21 November 2024.