పాయల్ రోహట్గీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పాయల్ రోహట్గీ (జననం 9 నవంబరు 1984), భారతీయ నటి. ఆమె పలు టీవీ రియాలిటీ షోల్లో నటించింది. పాయల్ కొన్ని బాలీవుడ్ సినిమాల్లో కూడా నటించింది.[1] 2008లో బిగ్ బాస్ 2 షోలో పాల్గొంది ఆమె.

తొలినాళ్ళ జీవితం[మార్చు]

హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో జన్మించింది పాయల్. ఆమె తల్లిదండ్రులు వీనా రోహట్గీ, శశాంక్ రోహట్గీల కుమార్తె. పాయల్ సోదరుడి పేరు గౌరవ్ రోహట్గీ. హైదరాబాద్ లో పుట్టినా, గుజరాత్ లోని అహ్మదాబాద్ లో పెరిగింది ఆమె. అహ్మదాబాద్ లోని ఉద్గాం పాఠశాలలో ప్రాధమిక విద్యనభ్యసించింది పాయల్. ఆమె 12వ తరగతిలో గుజరాత్ రాష్ట్రంలోనే 7వ ర్యాంకు సాధించడం విశేషం. అహ్మదాబాద్ లోని లాల్ భాయ్ దళపత్ భాయ్ కళాశాలలో కంప్యూటర్ ఇంజినీరింగ్ చదివింది పాయల్.[2] ఆమె తండ్రి కెమికల్ ఇంజినీర్ గా పని చేశాడు.

మూలాలు[మార్చు]