పారాలింపిక్ క్రీడలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పారాలింపిక్ క్రీడలు (Paralympic Games - పారాలింపిక్ గేమ్స్) అనగా ఒక ప్రధాన అంతర్జాతీయ క్రీడా ఈవెంట్. శారీరక వైకల్యాలు గల క్రీడాకారులు ఈ గేమ్స్ లో పాల్గొంటారు, వీరిని పారాలింపియన్స్ అంటారు. ఇందు చలనశీల వైకల్యాలు, అంగచ్ఛేదం, అంధత్వం, పక్షవాతం గల అథ్లెట్లూ ఉంటారు. వీటిలో శీతాకాలం, వేసవి పారాలింపిక్ గేమ్స్ అని ఉన్నాయి. ఇవి ఒలింపిక్ గేమ్స్ తర్వాతనే జరుగుతాయి. అన్ని పారాలింపిక్ గేమ్స్ ఇంటర్నేషనల్ పారాలిమ్పిక్ కమిటీ (IPC) ద్వారా నిర్వహించబడుతున్నాయి.