పార్క్ హయత్ హైదరాబాద్
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
పార్క్ హయత్ హైదరాబాద్ | |
---|---|
హోటల్ చైన్ | Hyatt |
సాధారణ సమాచారం | |
ప్రదేశం | India |
చిరునామా | Road no 2 , Banjara Hills, Hyderabad, Andhra Pradesh, 500034, India |
ప్రారంభం | 29 April 2012 |
యాజమాన్యం | Global Hyatt Corporation |
సాంకేతిక విషయములు | |
అంతస్థుల సంఖ్య | 8 |
రూపకల్పన, నిర్మాణం | |
వాస్తు శిల్పి | John Portman & Associates |
ఇతర విషయములు | |
గదుల సంఖ్య | 185 |
సూట్ల సంఖ్య | 24 |
జాలగూడు | |
hyderabad.park.hyatt.com |
భారతదేశంలోని తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ నగరంలోని పార్క్ హయత్ హైదరాబాద్ అనేది ఓ విలాసవంతమైన ఫైవ్ స్టార్ హోటల్. ఇది నగరానికి గుండెకాయలాంటి బంజరాహిల్స్ ఏరియాలో హైటెక్ సిటీకి, అంతర్జాతీయ విమానాశ్రయానికి మధ్యలో ఉంది. ఇది ఏప్రిల్ 29, 2012లో ఈ హోటల్ ప్రారంభమైంది. 32,256 చదరపు మీటర్ల (347,200 చదరపు అడుగులు) వైశాల్యంలో దీనిని నిర్మించారు. ఈ హోటల్ భారత దేశంలోని మొదటి అర్బన్ పార్క్ హయత్ కాగా, పార్క్ హయత్ పోర్ట్ పోలియోలో 29వ హోటల్ కావడం విశేషం.[1][2]
చరిత్ర
[మార్చు]పార్క్ హయత్ హైదరాబాద్ హోటల్ నిర్మాణం 32,256 చదరపు మీటర్ల (347,200 చదరపు అడుగుల) వైశాల్యంలో నిర్మించారు. ఈ హోటల్ నిర్మాణాన్ని 2006లో ప్రారంభించారు. హయత్ నిర్వహణలో గాయత్రి హై-టెక్ హోటల్స్ యాజమాన్యంలో దీనిని నిర్మించారు. నిర్మాణం పూర్తి చేసుకున్న తర్వాత... 29 ఏప్రిల్, 2012లో ప్రారంభించారు. మొత్తం సుమారు వ్యయం రూ.7 బిలియన్లు ఖర్చు చేశారు.
హోటల్ గురించి
[మార్చు]పార్క్ హయత్ హైదరాబాద్ హోటల్లో మొత్తం 185 గదులు 24 సూట్లు మొదటి ఆరు అంతస్తుల్లో ఉన్నాయి. పై రెండు అంతస్తుల్లో ఫర్నిచర్ తో కూడిన 42 సేవా అపార్టుమెంట్లు కూడా ఉన్నాయి. హోటల్లోని ప్రతి అతిథి గృహం కూడా హైదరాబాద్ మొత్తంలో కెల్లా అతి పెద్దవిగా చెప్పుకోవచ్చు. ఇవి ఒక్కోటి 463 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటాయి. హోటల్ లాబీ మొత్తం కూడా అందమైన నీటి ఫీచర్ తో మెరిసిపోతూ ఉంటుంది. అదేవిధంగా 35 అడుగుల ఎత్తైన తెల్లని కట్టడం చుట్టూ అందమైన మొక్కలు ప్రత్యేక ఆకర్షణనిస్తాయి. నివాస సముదాయం మాదిరిగా భారత దేశంలో నిర్మించిన మొదటి హోటల్ పార్క్ హయత్ హైదరాబాద్ అని చెప్పుకోవచ్చు. ఈ హోటల్లో మొత్తం సమావేశాలకు, కార్యక్రమాల నిర్వహణకు కలిపి 1600 చదరపు మీటర్లు (17,000 చదరపు అడుగులు) వైశాల్యంలో ఏర్పాట్లు చేశారు. ఇక హోటల్లో సదుపాయల విషయానికి వస్తే హోటల్ లాబీ లాంజ్ లో విశాలమైన డైనింగ్ హాల్, లీవింగ్ రూం, రోజు మొత్తం నడిచే డైనింగ్ రెస్టారెంట్ లో డైనింగ్ రూం, బార్ & రెస్టారెంట్- నార్తెర్న్ ఇటాలియన్ క్యూషన్, ఓరియంటల్ బార్ & కిచెన్ – సౌత్ ఈస్ట్ ఆసియన్ క్యూషన్ వంటివి ఉన్నాయి. హోటల్లో స్పా & ఫిట్ నెస్ కోసం ప్రత్యేక సౌకర్యాలు కూడా ఉన్నాయి. అతిథులకు కావాల్సిన అన్ని సదుపాయాలను అందిస్తూ ఇక్కడ విడిది చేసిన వారికి సరికొత్త అనుభూతి కల్గిస్తుంది.[3]
వేడుకలు
[మార్చు]హైదరాబాద్ లో జరిగిన అనేక కార్యక్రమాలకు, వేడుకలకు పార్క్ హయత్ హోటల్ పలుమార్లు వేదికైంది. అనేక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన అతిథులెందరో ఈ హోటల్లో బస చేసారు. యు.ఎన్.డబ్ల్యు.టి.ఓ., టాటా, వుయ్ కనెనక్ట్, మలేషియన్ ట్రేడ్ హై కమిషన్, హెచ్.ఎ.ఎల్. పార్లమెంటరీ వంటి సంస్థల సమావేశాలకు ఈ హోటల్ వేదికగా నిలిచింది. ముఖ్యంగా వ్యాపార లావాదేవీల కోసం దేశ, విదేశాల నుంచి వచ్చే అతిథులతో పాటు విలాసవంతమైన సౌకర్యాలు కోరుకునే స్థానిక గెస్టులు కూడా ఈ హోటల్ కు వస్తుంటారు.[4]
అవార్డులు - రివార్డులు
[మార్చు]హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ అందిస్తోన్న సేవలకు గాను రాష్ట్ర స్థాయి అవార్డులతో పాటు జాతీయ, అంతర్జాతీయ ఆవార్డులు దక్కాయి. వాటిలో ముఖ్యమైనవి పరిశీలిస్తే... 2011-12, 2012-13 సంవత్సరాల్లో వరుసగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఉత్తమ పర్యాటక 5 స్టార్ హోటల్ అవార్డు ఈ హోటల్ కు దక్కాయి. అదేవిధంగా కొత్తగా ఏర్పాటు చేసిన విలాసవంతమైన 5 స్టార్ హోటళ్లకు ఇచ్చే ఉత్తమ అవార్డుల్లో 2013 సంవత్సరానికి గానూ ప్రపంచ ఉత్తమ విలాసవంతమైన హోటల్ గా పార్క హయత్ అవార్డు దక్కించుకుంది. 2014లో బిజినెస్ హోటల్ ఫర్ ఉమెన్ ట్రావెలర్ రన్నరప్ అవార్డుతో పాటు ఇదే ఏడాది ట్రిప్ అడ్వయిజర్- సర్టిఫికెట్ ఆప్ ఎక్సిల్లెన్సీ, ఐరోపాకు చెందిన లీడింగ్ హోటల్ రివ్యూ ఫ్లాట్ ఫామ్ అందించే ఉత్తమ ప్రమాణాలు గల హోటల్ గా హాలిడే చెక్ అవార్డు, 2013లోనే బెస్ట్ ఆసియన్ & ఓరియంటల్ రెస్టారెంట్ అవార్డు (జొమాటో యూజర్ ఛాయిస్ అవార్డు) తోపాటు బెస్ట్ బార్ విత్ ఆంబియన్స్ (టైమ్స్ ఫుడ్ & నైట్ లైఫ్ అవార్డ్స్) అందుకుంది. ఇక 2015లో బుకింగ్.కామ్ గెస్ట్ రివ్యూ అవార్డు సంస్థచే ఆవార్డు ఆఫ్ ఎక్సిల్లెన్సీ వంటి అవార్డులు పార్క్ హయత్ కు దక్కాయి.[5]
బయటి లింకులు
[మార్చు]- పార్క్ హయత్ హైదరాబాద్ హోటల్ యొక్క అధికారిక వెబ్ సైట్
- బిజినెస్ ట్రావెలర్
విభాగాలు
[మార్చు]హైదరాబాద్ లోని హోటళ్లు
మూలాలు
[మార్చు]- ↑ "Park Hyatt restaurants opened". The Hindu. April 24, 2012.
- ↑ "Luxury has a new address". The Hindu. April 8, 2012.
- ↑ "Park Hyatt Hyderabad". Cleartrip.
- ↑ "Park Hyatt debuts in Hyderabad". Business Traveller. April 3, 2012.
- ↑ "AP govt awards". Hospitality Biz India. October 6, 2013. Archived from the original on 2013-12-24.