పార్థ్ సాలుంకె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భారత యువ ఆర్చర్ పార్థ్ సాలుంకె ప్రపంచ యూత్ ఆర్చరీ ఛాంపియన్షిప్ లో చరిత్ర సృష్టించాడు[1]. ఈ టోర్నమెంట్లో అతను పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో విజేతగా నిలిచాడు[2]. 2023 జూలై 10వ తేదీన ఐర్లాండ్ లోని లిమోరిక్ లో నిర్వహించిన అండర్ - 21 పురుషుల వ్యక్తిగత రికర్వ్ క్యాటగిరి ఫైనల్లో మహారాష్ట్రకు చెందిన పార్థ్ సాలుంకె .... ఇంజున్ ( కొరియా ) ను ఓడించాడు. దీని ద్వారా ప్రపంచ యూత్ ఆర్చరీ ఛాంపియన్షిప్స్ రికర్వ్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణం సాధించిన తొలి భారత పురుష ఆర్చర్ గా రికార్డు నమోదు చేశాడు[3]. ప్రపంచ యూత్ ఆర్చరీ ఛాంపియన్షిప్ పోటీల్లో భారత బృందం ఆరు స్వర్ణాలు, ఒక రజతం, నాలుగు కాంస్యం పథకాలు మొత్తం 11 పథకాలతో ఈ ఛాంపియన్షిప్ చరిత్రలో భారత్ అత్యుత్తమ ప్రదర్శన చేసింది. ఈ పోటీల్లో పథకాల సంఖ్య పరంగా భారతదే అగ్రస్థానం. ఓవరాల్ గా భరత్ నుంచి యూత్ ఆర్చరీ ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన 6వ ఆర్చర్ పార్థ్ సాలుంకె.

మూలాలు :

  1. "Archery Medals: విలువిద్యలో వెల్లువలా... పతకాల పంట పండిస్తున్న ఆర్చర్లు". EENADU. Retrieved 2023-09-12.
  2. "పార్థ్‌ సాలుంకే 'స్వర్ణ' చరిత్ర". Sakshi. 2023-07-11. Retrieved 2023-09-12.
  3. Velugu, V6 (2023-07-11). "సాలుంకే గోల్డెన్‌‌‌‌‌‌‌‌ హిస్టరీ". V6 Velugu. Retrieved 2023-09-12.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)