పాలగిరి సూరపరాజు
స్వరూపం
పాలగిరి సూరపరాజు | |
---|---|
జననం | 1923 |
మరణం | రెడ్డిపల్లి ,1986 జనవరి 23 |
మతం | హిందూ |
తండ్రి | బాలంరాజు |
తల్లి | సుబ్బమ్మ |
జననం
[మార్చు]ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా కమలాపురం తాలుక రాదిరెడ్డిపల్లె లో 1923 లో జన్మించారు. తల్లిదండ్రులు బాలంరాజు, సుబ్బమ్మ.[1]
బాల్యం
[మార్చు]చిన్ననాటి నుండి సంగీతం పై మక్కువ ఉండేది. కీ. శే రత్నాకరం వెంకటరామ రాజు వద్ద ప్రధమ సంగీత సాధన ప్రారంబించాడు. ఆనాటి గొప్ప నటులతో కలిసి అనేక నాటకాలు, పాత్రలు పోషించారు. సంగీత సారధ్యం వహించి అందరు మన్ననలు పొందెను.
సంగీతం అందించిన చిత్రాలు
[మార్చు]ప్రముఖ దర్శకుడు కె. వి రెడ్డి వీరి సామర్థ్యాన్ని గుర్తించి వాహినీ సంస్థలో మ్యూజికల్ డిపార్టుమెంటుకు పరిచయం చేశారు. ఘంటసాల, వేణు గార్ల వద్ద అసిస్టెంట్ ఉంటూ గుణసుందరికధ, పెద్ద మనుషులు షావుకారు చిత్రాలకు పనిచేసారు. చివరిగా కడప పిక్చర్స్ వారి భావిపౌరులు సినిమాకు సంగీత దర్శకుడిగా పనిచేసి సరికొత్త బాణిలతో మధురమైన సంగీతాన్ని అందించారు.
మరణం
[మార్చు]1986 జనవరి 23 న సూరపరాజు మరణించారు.
మూలాలు
[మార్చు]- ↑ భల్లం, ఎస్. ఆర్ (2019). 80. ఎస్. ఆర్. భల్లం (సూర్యనారాయణ రాజు).