పాలపర్తి ప్రసాద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రముఖ జర్నలిస్టు, చారిత్రక నవలా రచయిత పాలపర్తి ప్రసాద్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం గుంటూరు జిల్లా బాపట్లలో కృష్ణమూర్తి, తామ్రపర్ణి  అనే దంపతులకు 1933 వ సంవత్సరం లో జన్మిచాడు.ఆయన విద్యాభ్యాసం అంతా అప్పటి మద్రాసులో జరిగింది.[1]


రచనలు

[మార్చు]

పాలపర్తి ప్రసాద్‌ కలం నుంచి అనేక చారిత్రక నవలలు వెలువడ్డాయి.సాహిత్య రంగంలో ప్రసాద్‌గా మంచి పేరుగడించిన ఆయన కలం నుంచి

  • రోషనారా
  • అక్బర్‌
  • ఆర్యచాణక్య
  • పృథ్వీరాజ్‌
  • షాజహాన్‌ వంటి నవలలు వెలువడ్డాయి.[2]

ప్రశంస

[మార్చు]

నడుస్తున్న నిఘంటువు, రాజకీయ విశ్లేషకులు, మితభాషి, మంచి రచయిత, మంచి పాత్రికేయుడు అని ఆయనను పలువురు కొనియాడారు.

మరణం

[మార్చు]

ఆంధ్రపత్రిక ఎడిటర్‌గా పదవీవిరమణ చేసిన అనంతరం హైదరాబాద్‌లో స్థిరపడి నవంబర్ 10, 2021 న తుది శ్వాస విడిచారు.

మూలాలు

[మార్చు]
  1. "సీనియర్‌ పాత్రికేయుడు ప్రసాద్‌ కన్నుమూత". Sakshi. 2021-11-10. Retrieved 2021-11-10.
  2. "ప్రముఖ జర్నలిస్టు, రచయిత పాలపర్తి ప్రసాద్‌ కన్నుమూత". andhrajyothy. Retrieved 2021-11-10.