పాలమూరు జిల్లా యక్షగాన సాహిత్యం
తెలుగు సాహిత్యంలో యక్షగానం అనేది గాన , నృత్య ప్రధానమైన జానపద కళారూపం. మధుర కవితాశాఖకు చెందిన ఈ యక్షగానం గేయ ప్రధానమైనది. పాలమూరు జిల్లాలో మొట్టమొదటి యాక్షగానం అప్పకవి రాసిన అంబికాసంవాదం. ఆ తర్వాత ఎందరో కవి పండితులు వందలకొద్ది యక్షగానాలను రచించారు. దేశీ కవితాశాఖలో యక్షగానం ప్రక్రియ బహుళ ప్రజాదరణ పొందింది.[1]
గోవర్ధనం వెంకట నర్సింహాచార్యులు
[మార్చు]జడ్చర్లకు చెందిన గోవర్ధనం వెంకటనర్సింహాచార్యులు 'అజామిళోపాఖ్యానం' , 'గొల్లకలాపం' అనే యక్షగానాలను రచించాడు.
కొండపల్లి పాపయ్య
[మార్చు]దేవరకద్ర మండలం గద్దెగూడెం గ్రామానికి చెందిన కొండపల్లి పాపయ్య 'మార్కండేయ విలాసం' అనే యక్షగానాన్ని రాశాడు.
ప్రబంధం హనుమద్దాసు
[మార్చు]ఇతడు ప్రసిద్ధ సంకీర్తనాచార్యుడు మన్నెంకొండ హనుమద్దాసు మేనత్త కొడుకు. 'విజయవిలాసం' అనే యక్షగానాన్ని రచించాడు. ఇది దాదాపు రెండువందల సార్లకు పైగా ప్రదర్శించబడింది. ఈయన సంకీర్తనలు కూడా రాశాడు.
బెల్లం నాగప్ప
[మార్చు]నర్వ మండలం లంకాల గ్రామానికి చెందిన బెల్లం నాగప్ప దాదాపు 32 యక్షగానాలను రచించాడు. కిరాతార్జునీయం, రంభావిలాసం, రామాంజనేయ యుద్ధం, యయాతి చరిత్ర, ఉషాపరిణయం, బాణాసుర యుద్ధం, తారాశశాంకం వంటి యక్షగానాలను రచించాడు.
మూలాలు
[మార్చు]- ↑ మహబూబ్ నగర్ జిల్లా సాహిత్య చరిత్ర, డా. భీం పల్లి శ్రీకాంత్. తెలంగాణ సాహిత్య అకాడమీ.