పాల్వాయి రంగయ్య నాయుడు
పాల్వాయి రంగయ్య నాయుడు (1828–1902) భారతీయ న్యాయవాది, రాజకీయనాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. భారత జాతీయ కాంగ్రేసు తొలిదశల్లో ప్రముఖ నాయకుడు.
ప్రారంభ జీవితం
[మార్చు]రంగయ్య నాయుడు 1828లో[1] మద్రాసు ప్రెసిడెన్సీలో ఒక తెలుగు కమ్మ నాయుడు కుటుంబంలో జన్మించాడు. న్యాయవిద్యలో పట్టభద్రుడై, విజయవంతమైన న్యాయవాద ప్రాక్టీసును కొనసాగించాడు. త్వరలోనే మద్రాసు హైకోర్టుకు నియమితుడయ్యాడు.
రాజకీయాలు
[మార్చు]ప్రభుత్వంలో భారతీయులకు మరింత ప్రాతినిధ్యాన్ని, స్వయంపాలనను కోరిన అనేక భారతీయ నాయకుల్లో రంగయ్య నాయుడు ఒకడు. 1884లో మద్రాసు ప్రెసిడెన్సీలో తొలి భారతీయ రాజకీయసంస్థ ఐన మద్రాసు మహాజనసభ ఏర్పడినప్పుడు, రంగయ్యనాయుడు దానికి తొలి అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాడు.[2]
రంగయ్య నాయుడు 1885 డిసెంబరులో బొంబాయిలో జరిగిన తొలి భారత జాతీయ కాంగ్రేసు సమావేశానికి మద్రాసు నగరం తరఫున పాల్గొన్నాడు. ఈయన 1883 నుండి 1902 వరకు పచ్చయప్ప కళాశాల ట్రస్టీల్లో ఒకడిగా ఉన్నాడు[3]
రంగయ్య నాయుడు 1893లో మద్రాసు శాసనమండలికి ఎన్నికై, 1893 నుండి 1899 వరకు సభ్యుడిగా ఉన్నాడు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలోని తమిళ జిల్లాల్లో రంగయ్యనాయుడు కీలకపాత్ర వహించాడు.
మరణం
[మార్చు]రంగయ్య నాయుడు 1902లో ఎగ్మోరులో మరణించాడు. ఎగ్మోరులో ఒక వీధికి ఈయన పేరు, మరో వీధికి ఈయన తండ్రి వీరాస్వామి నాయుడు పేరు పెట్టారు.
మూలాలు
[మార్చు]- ↑ S. R. Mehrotra (1971). The emergence of the Indian National Congress. Vikas Publications. pp. 386.
- ↑ Bhavan's Journal, Volume 32. Bharatiya Vidya Bhavan. 1985. p. 220.
- ↑ "Trustees of Pachaiyappa's College". Pachaiyappa College. Archived from the original on 2010-01-10. Retrieved 2017-11-07.