పావురాల గుట్ట

వికీపీడియా నుండి
(పావురాలగుట్ట నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

కర్నూలు జిల్లా ఆత్మకూరునుంచి 8 కిలోమీటర్ల దూరంలోని నల్లకాలువ గ్రామం మీదుగా 16 కిలోమీటర్ల దూరంలోని రుద్రకోడూరు గ్రామానికి దట్టమైన అటవీ మార్గంలో రుద్రకొండ పై పావురాలగుట్ట ఉంది. సెప్టెంబర్ 2, 2009న ఉదయం గం. 9.35 ని.లకు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ నల్లమల అటవీ ప్రాంతంపై నుంచి ప్రయాణిస్తున్న సమయంలో కూలిపోవడంతో రాజశేఖరరెడ్డితో సహా మొత్తం ఐదుగురు మరణించారు. హెలికాప్టర్ కూలిపోయిన దాదాపు 25 గంటల వరకు ఎలాంటి ఆచూకీ తెలియకపోవడంతో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి సెప్టెంబరు 3న ఈ ప్రాంతంలోనే హెలికాప్టర్ ప్రమాదానికి గురై కూలిపోయినట్లు గుర్తించి మృతదేహాలను తరలించారు. దీనితో ముఖ్యమంత్రి మృతిచెందిన పావురాలగుట్ట (చింతగుండం) ప్రాంతం వార్తల్లోకి వచ్చింది. ఇక్కడ ఒక భారీ స్మారక స్తూపాన్ని నిర్మించాలని ప్రభుత్వం తీర్మానించింది. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పేర స్మృతివనం నిర్మించేందుకు ప్రమాదం జరిగిన వెలుగోడు అభయారణ్యంలో 1412 హెక్టార్లను స్మృతివనం కోసం కేటాయించింది.

ప్రమాద స్థలంలో కూలిపోయిన హెలికాప్టర్ శకలాలు

స్మృతివనం పై అభ్యంతరాలు[మార్చు]

  • నల్లమల అభయారణ్యంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి స్మృతివనం ఏర్పాటు చేయటం చట్టవిరుద్ధమని పర్యావరణవేత్త పతంజలి శాస్త్రి అభ్యంతరం వ్యక్తం చేశారు. శ్రీశైలం-ఆత్మకూరు పులుల అభయారణ్యం లోని మూడు వేల ఎకరాల్లో వైఎస్‌ స్మృతివనం కోసం ప్రభుత్వం జీవో విడుదల చేయటం దురదృష్టకరమన్నారు. కేంద్ర ప్రభుత్వం, వన్య ప్రాణి విభాగాల అనుమతిలేకుండా జీవోలు విడుదల చేయడం పొరపాటు నిర్ణయమన్నారు. చట్ట ప్రకారంపులుల అభయారణ్యంలో ఎటువంటి కార్యక్రమాలు చేపట్టకూడదన్నారు. అభయారణ్యానికి నష్టం కలిగిస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు.(ఆంధ్రజ్యోతి 28.10.2009)