Coordinates: 18°32′02″N 73°47′09″E / 18.533752°N 73.785717°E / 18.533752; 73.785717

పాషన్ సరస్సు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పాషన్ సరస్సు
పాషన్ సరస్సు దృశ్యం
పాషన్ సరస్సు
Location of Pashan lake within Maharashtra
Location of Pashan lake within Maharashtra
పాషన్ సరస్సు
ప్రదేశంపాషన్, పుణె, మహారాష్ట్ర
అక్షాంశ,రేఖాంశాలు18°32′02″N 73°47′09″E / 18.533752°N 73.785717°E / 18.533752; 73.785717
రకంకృత్రిమ సరస్సు
సరస్సులోకి ప్రవాహంరామ్ నది
వెలుపలికి ప్రవాహంరామ్ నది
పరీవాహక విస్తీర్ణం40 square kilometres (15 sq mi)
ప్రవహించే దేశాలుభారతదేశం
గరిష్ట పొడవు1.2 km (0.75 mi)
గరిష్ట వెడల్పు0.7 km (0.43 mi)
ఉపరితల ఎత్తు589 m (1,932 ft)
ప్రాంతాలుపుణె

పాషన్ సరస్సు అనేది మహారాష్ట్రలోని పూణే నగర కేంద్రానికి 12 కి.మీ దూరంలో ఉన్న పాషన్ అనే నగర శివారులో గల ఒక కృత్రిమ సరస్సు. ఈ సరస్సును బ్రిటిష్ వారు వారి కాలంలో నీటి అవసరాలకు అనుగుణంగా నిర్మించారు. ఈ సరస్సు లోకి రామనది ద్వారా నీరు వచ్చి చేరుతుంది, ఇది సరస్సుకి ఉత్తరాన ఉన్న బ్యారేజీ ద్వారా నియంత్రించబడుతుంది. ఈ నది బావ్‌ధాన్ నుండి ఉద్భవించి పాషన్, సుతర్‌వాడి, బేనర్ మీదుగా సోమేశ్వర్‌వాడీకి ప్రవహిస్తుంది. పాషన్ సరస్సు మొత్తం 40 చదరపు కిలోమీటర్ల (15 చదరపు మైళ్ళు) పరీవాహక ప్రాంతాన్ని కలిగి ఉంది. ఈ సరస్సు పాత పాషన్ గ్రామానికి, గవర్నర్ నివాసానికి నీటి వనరుగా పనిచేస్తుంది. సరస్సు చుట్టూ ఇటీవల పట్టణీకరణ జరగటం నీటి నాణ్యత పతనానికి దారితీసింది.[1][2]

చరిత్ర, భౌగోళికం[మార్చు]

పాషన్ సరస్సు ఒక మానవ నిర్మిత సరస్సు, ఇది పాషన్, సుతర్‌వాడి వంటి శివారు ప్రాంతాల నీటి అవసరాలకు అనుగుణంగా నిర్మించబడింది. ఈ సరస్సు ఒకప్పుడు తాగునీటి వనరుగా ఉండేది, కానీ ఇటీవల పట్టణీకరణ విజృంభించడంతో నీరు క్షీణించి, తాగడానికి పనికిరాకుండా పోయింది. ఈ సరస్సు పాత పాషన్ గ్రామానికి సాగు నీరుగా, పంటలు పండించడానికి, సమీపంలోని గవర్నర్ నివాసానికి నీటి వనరుగా ఉపయోగపడుతుంది. సరస్సు, దాని పరిసర ప్రాంతాలు వలస పక్షులను ఆకర్షిస్తాయి. పక్షి వీక్షకులకు ఇదొక ప్రసిద్ధ ప్రదేశం. పూణే మునిసిపల్ కార్పొరేషన్ (PMC) సరస్సు పశ్చిమ తీరం వెంబడి నేచర్ ట్రైల్ అనే 300 మీటర్ల ఫుట్‌పాత్‌ను నిర్మించింది. అలాగే, పక్షులను ఆకర్షించడానికి ఒక వెదురు తోటను కూడా నిర్మించింది.[3][4]

క్షీణత[మార్చు]

ఇటీవల, సమీపంలోని కొండలపై అటవీ నిర్మూలన వలన సరస్సు లోతు తగ్గుతుంది. ఐపోమియా వంటి ఇతర మొక్కల పెరుగుదలను నిషేధించిటం సరస్సు క్షీణతకు ప్రధాన కారణం. అలాగే ఈ ప్రాంతంలో వాహనాలను కడగడం వల్ల నీటిలో నూనె, పెట్రోల్ వంటివి కలిసి కాలుష్యం పెరుగుతుంది.[5][6]

అభివృద్ధి[మార్చు]

1998 లో, పూణే మునిసిపల్ కార్పొరేషన్ సరస్సు నుండి తాగునీటిని నిలిపివేసింది. అయితే, ఇప్పుడు సరస్సు నుండి మళ్లీ త్రాగునీటిని అందించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. 2004-2005 ఆర్థిక సంవత్సరంలో పామ్, కాట్రాజ్ సరస్సులను డి-సిల్టింగ్ చేయడానికి PMC ₹ 10 మిలియన్లు (US $ 140,000) ఖర్చు చేసింది. పాషన్ శుద్ధి కర్మాగారాన్ని తిరిగి అమలు చేయడం కూడా PMC పరిశీలనలో ఉంది.[7][8]

మూలాలు[మార్చు]

  1. "Ramnadi shrunk by 8-20 m: survey - Times of India". The Times of India. Retrieved 2018-02-05.
  2. "Pashan station repairs begin". Indian Express. 19 September 1998. Retrieved 6 December 2008.
  3. W. M. Fletcher; P. C. H. Snow. "Gazeetters of Bombay Presidency Poona HAVELI taluka water section". Gazeetters of Bombay Presidency. Retrieved 9 December 2008.
  4. "Coming soon? Drinking water from Pashan lake". Indian Express (Mumbai). India Environmental Portal. 7 మార్చి 2008. Archived from the original on 18 జూలై 2011. Retrieved 6 డిసెంబరు 2008.
  5. "18 months on, Rs 14-lakh nature trail along Pashan lake waits for visitors". Indian Express. 2 January 2011. Retrieved 17 January 2011.
  6. "Pashan lake grabs attention at last". The Times of India. 14 March 2004. Archived from the original on 22 October 2012. Retrieved 6 December 2008.
  7. "ENVIRONMENTAL DEGRADATION OF AN URBAN LACUSTRINE WATER BODY IN PUNE , INDIA". Runwa. Archived from the original on 9 May 2008. Retrieved 9 November 2008.
  8. "Pashan lake crying for help". Indian Express. 5 August 1999. Retrieved 6 December 2008.