Jump to content

పాషాణ భేది

వికీపీడియా నుండి

పాషాణ భేది
Scientific classification
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Genus:
Species:
P. barbatus
Binomial name
Plectranthus barbatus
Synonyms

Coleus barbatus
Coleus forskohlii[reference required]
Plectranthus forskalaei Willd. Plectranthus forskohlii

పాషాణ భేది లేదా కోలియస్ (Indian Coleus) ఒక రకమైన ఔషధ మొక్క. దీని శాస్త్రీయనామం కోలియస్ ఫోర్స్ కోలి (Coleus forskohlii). ఇది లామియేసి కుటుంబానికి చెందినది.

లక్షణాలు

[మార్చు]
  • ఇది నిటారుగా పెరిగే నూగు కలిగిన మొక్క.
  • దీని మెత్తని కాండం శాఖాయుతంగా ఉంటుంది.
  • పత్రాలు అభిముఖంగా, పొడవుగా కేశయుతంగా ఉంటాయి.
  • పుష్పాలు నీలిరంగులో ఉంటాయి.
  • దుంపవేర్లు సుమారు 20 సెం.మీ. పొడవు, 1-3 సెం.మీ. మందం కలిగివుంటాయి. ఇవి పసుపు-నారింజ రంగును కలిగి అల్లం వంటి సువాసనను ఇస్తాయి.

ఉపయోగాలు

[మార్చు]
  • ఈ మొక్క దుంపలలో ఫోర్స్ కోలిన్ (Forskolin) అనే ఆల్కలాయిడ్ ఉంటుంది. దీనిని అధిక రక్తపోటు, ఊబకాయం, గ్లాకోమా, ఉబ్బసం, గుండె జబ్బులు మొదలయిన వ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తున్నారు. ఆయుర్వేదంలో దీనిని తీవ్రమైన నొప్పి నుండి, మూత్ర సంబంధ వ్యాధులలో ఉపయోగిస్తున్నారు.[1]

మూలాలు

[మార్చు]
  1. Dubey MP, Srimal RC, Nityanand S et al. (1981). "Pharmacological studies on coleonol, a hypotensive diterpene from Coleus forskohlii." J Ethnopharmacol. 3:1-13.

బయటి లింకులు

[మార్చు]