పిల్లి చేప
పిల్లి చేప Temporal range: Late Cretaceous - Present
| |
---|---|
Eel-tail catfish | |
Scientific classification | |
Kingdom: | |
Phylum: | |
Class: | |
Superorder: | |
Order: | సిలురిఫార్మిస్
|
కుటుంబాలు | |
అకిసిడె |
పిల్లి చేప మంచి ఆహారపు చేప. ఇవి అస్థి చేపలలో సిలురిఫార్మిస్ (Siluriformes) క్రమానికి చెందినవి. వీటికి పిల్లికి ఉన్నట్లు పొడవైన మీసాలు ఉండడం వలన ఈ పేరు వచ్చింది. ఇవి వివిధ పరిమాణాల్లోను ప్రవర్తన కలిగివుంటాయి. కొన్ని మృతపదార్ధాలపై జీవిస్తే మరికొన్ని పరాన్న జీవులు. చాలా వాటికి పొలుసులు ఉండవు. వీటికి వాణిజ్య ప్రాముఖ్యత ఎక్కువ. మార్పు, వాలుగ మొదలైన చాలా రకాలు ఆహార చేపలుగా పెంచుతారు. చిన్నవాటిని అక్వారియమ్ లో పెంచుకుంటారు.
నిషేధం
[మార్చు]ఈ చేప అత్యంత ప్రమాదకారి. 'క్యాట్‌ఫిష్' చేప జాతిలో ఒకటే అయినా మిగతా చేపలకు ఇది పూర్తిగా భిన్నం. సాధారణంగా చేపలు నీటిలోని నాచు, గడ్డిని తిని బతుకుతాయి. కానీ క్యాట్‌ఫిష్ పూర్తిగా మాంసాహారి. ఆఫ్రికన్ క్యాట్‌ఫిష్‌గా పిలుచుకునే దీనికి కోళ్ల వ్యర్థాలే ఆహారం. కోడి కాళ్లు, చర్మం, తల.. తదితర వ్యర్థాలను తింటుంది. ఇది ఎక్కడి నీళ్లలో ఉంటే అక్కడి మిగతా చేపల్ని పూర్తిగా తినేస్తుంది. ఒక ప్రాంతంలో పది క్యాట్‌ఫిష్‌లను వేస్తే ఏడాది తిరిగేసరికల్లా లక్ష క్యాట్‌ఫిష్‌లుగా రూపాంతరం చెందుతాయి. మిగిలిన చేపజాతి మనుగడకు ముప్పుగా పరిణమించినందువల్లే భారత ప్రభుత్వం దేశంలో వీటి పెంపకాన్ని నిషేధించింది. మరోవైపు వీటి పెంపకం కోసం చేపట్టే చెరువుల్లో కోళ్ల వ్యర్థాలను వేస్తున్న కారణంగా భూగర్భజలాలు కలుషితమై పర్యావరణానికి ముప్పు కలుగుతోంది. దీనికితోడు కొన్ని క్యాట్‌ఫిష్‌లు 20 కిలోల వరకు పెరుగుతాయి. ఇలాంటివి ఉన్న నీటిలో పొరపాటున మనుషులు పడినా సులభంగా చంపి తినేస్తాయి. అంతటి భయంకరమైనవి కావడం వల్లే వీటి పెంపకంపై నిషేధం అమల్లో ఉంది.