పి.ఎమ్.ఎస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రీ మెన్స్‌ట్రువల్ సిండ్రోమ్
వర్గీకరణ & బయటి వనరులు
m:en:ICD-10 {{{m:en:ICD10}}}
m:en:ICD-9 {{{m:en:ICD9}}}

పి.ఎమ్.ఎస్.[మార్చు]

ప్రీ మెన్స్‌ట్రువల్ సిండ్రోమ్ - (Pre-menstrual Syndrome) : పి.ఎమ్.ఎస్. అనేది ఒక వ్యాధి కాదు నెల నెలా జరిగే రుతుస్రావానికి ముందు ఎదురయ్యే లక్షణాల సముదాయాకి ఈ పేరిచ్చారు. ఈ పరిస్థితిలో చాలా రకాల లక్షణాలు ఏర్పడవచ్చును. మనిషి మనిషికీ ఈ లక్షణాలు మారవచ్చు. అయితే లక్షణాలేవైనా, నెలసరి వచ్చే ముందు మాత్రమే ఏర్పడి, స్రావము మొదలయ్యేక తగ్గి పోతాయి. సాధారణముగా ఈ పి.ఎమ్.ఎస్.లో ఎదురయ్యే కొన్ని లక్షణాలు ఈ క్రిందివిదముగా ఉంటాయి.

 • బరువు పెరగడము, రొమ్ములలో వాపు, నొప్పి, మొటిమలు, తల నొప్పి,
 • జీర్ణకోసానికి సంబంధించి .. మలబద్దకము, విరేచనాలు, వాంతులు, వగైరా,
 • పొత్తికడుపులో నొప్పి, నడుము నొప్పి,
 • వంట్లో ఆవిర్లు వచ్చినట్లనిపించడము,
 • కోపము, చిరాకు లాంటి మానసిక లక్షణాలు,
 • తీపి తినాలనిపించడము.

ఈవిదంగా రకరకాల లక్షణాలు ఈ పి.ఎమ్.ఎస్.లో ఏర్పడవచ్చు. పైన చెప్పిన వాటిలో అన్నీ ఒక్కరిలోనే ఉండక పోవచ్చు. ఒకరిలో వాటిలో ఏవక్కటిగాని, ఒకదానికంటే ఎక్కువగాని ఉండవచ్చు. మరి ఇంర వైవిధ్యముగల లక్షణాలున్న ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది అన్న సందేహము సహజముగా కలుగుతుంది. ఈ లక్షణాలేర్పడడానికి కారణమేమిటో ఇంకా నిర్దుష్టముగా చెప్పలేము గాని, అన్ని లక్షణాలు రుతుస్రావము మొదలయ్యేముందు వస్తాయి కాబట్టి శరీరములోని హార్మోనుల హెచ్చు-తగ్గులతో తప్పనిసరిగా సంబంధముంటుందని, ఉందని తేలింది. అంతేకాకుండా లక్షణాల్ని బట్టి మూల కారలు కూడా మారవచ్చు.అయితే లక్షణాలు, కారణాలు ఏమైనా పి.ఎమ్.ఎస్.తో బాధపడే స్త్రీలందరికీ ఉపకరించే సూత్రము జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడమే.బహిష్టు కాలంలో నొప్పి ఎర్రబట్ట మరియు తెల్ల బట్ట తగ్గటానికి సోమి ( సోమిద ) చెక్కతో తయారుచేసిన కషాయాన్ని తీసుకుంటారు. ట్రీట్మెంటు :

 • మానసిక వత్తిడులు లేకుండా చూసుకోవాలి.
 • క్రొవ్వుపదార్దములు, తీపిపదార్దములు తక్కువగా తినాలి.
 • క్రమబద్ధమైన వ్యాయామము చేయాలి.
 • కడుపు నొప్పికి - tab. Dysmen ఒక మాత్ర రెండు పూటలు 3 రోజులు వాడాలి.
 • నడుము నొప్పికి - tab.Aceclofenac 100 mg ఒక మాత్ర రెండు పూటలా 2 రోజులు వాడాలి.
"https://te.wikipedia.org/w/index.php?title=పి.ఎమ్.ఎస్&oldid=2204769" నుండి వెలికితీశారు