పి.చెందూర్ పాండియన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పి.చెందూర్ పాండియన్

పి.చెందూర్ పాండియన్ (1949 or 1950 – 11 జూలై 2015) భారతీయ రాజకీయనాయకుడు, తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీలో శాసనసభ్యులు.

జివిత విశేషాలు

[మార్చు]

దేవాదాయ శాఖ మాజీ మంత్రి.తిరునల్వేలి జిల్లా కడయనల్లూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారిగా శాశన సభకు చెందూర్ పాండియన్ ఎన్నికయ్యారు[1] ఆయన తమిళనాడు ప్రభుత్వంలో దేవాదాయ శాఖ మాజీ మంత్రిగా యున్నారు. ఆయన అన్నా డి.ఎం.కె పార్టీ సభ్యులు.[2][3][4]

2013 మార్చి 1 న ఆయన తమిళనాడు టూరిజం మంత్రిగా పదవి స్వీకరించారు.[5] పార్టీకి ఆయన అందిస్తూ వచ్చిన సేవలకు గుర్తింపుగా తొలిసారి శాసన సభ్యులు కాగానే, మంత్రి చాన్స్ సైతం దక్కింది. రాష్ట్ర మంత్రి వర్గంలో పలు సార్లు మార్పులు జరిగినా, పలువురికి ఉద్వాసనలు లభిం చినా, చెందూర్ పదవి మాత్రం పదిలంగా ఉంటూ వచ్చింది. శాఖల్లో మాత్రం మార్పులు జరుగతూ వచ్చి చివరకు రాష్ర్ట దేవాదాయ శాఖ మంత్రిగా చెందూర్ కొనసాగుతూ వచ్చారు.[6]

మరణం

[మార్చు]

2015 సంక్రాంతి ముందు రోజు సచివాలయంలో విధులకు హాజరైన ఆయన అస్వస్థతకు లోనయ్యారు. గుండె నొప్పి రావడంతో నగరంలోని గ్రీమ్స్ రోడ్డులో ఉన్న ఓ ఆసుపత్రిలో చేర్పించారు. ఆ రోజు నుంచి ఆయన ఆసుపత్రికే పరిమితం అయ్యారు. గుండెకు శస్త్ర చికిత్సలు జరిగాయి. అయినా, ఆయన కోలుకోలేదు.చివరకు మృత్యువుతో పోరాడి 11 జూలై 2015 న మరణించారు.

మూలాలు

[మార్చు]
  1. "AIADMK MLA Chendur Pandian passes away". The Hindu. 11 July 2015. Retrieved 11 July 2015.
  2. "List of MLAs from Tamil Nadu" (PDF). Chief Electoral Officer, Tamil Nadu. Archived from the original (PDF) on 2014-01-14. Retrieved 2015-07-17.
  3. "Council of Ministers, Govt. of Tamil Nadu". Govt. of Tamil Nadu. Archived from the original on 2011-08-25. Retrieved 2015-07-17.
  4. "AIADMK legislator Chendur Pandian dead". CanIndia NEWS. Archived from the original on 2015-07-11. Retrieved 2015-07-17.
  5. Special Correspondent. "Jayalalithaa drops three Ministers, new faces inducted". The Hindu.
  6. చెందూర్ ఇక లేరు[permanent dead link]

ఇతర లింకులు

[మార్చు]