పి.నాసరయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పి.నాసరయ్య తెలుగు రచయిత. [1]

జీవిత విశేషాలు[మార్చు]

పి.నాసరయ్య 1929లో జన్మించాడు. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన అతను తెలుగు సాహిత్యంలో కొన్ని రచనలు చేశాడు. 1996లో ‘పోరుబాట’ అనే నవలను, 1985లో కూలి విజయం (నాటిక), శ్రామికగేయాలు ( 1985), బాలవీరులు (1994) గేయకథలను రాసాడు. ఇన్ని రచనలు రాసినా ‘మాదిగపల్లె’ (1998) నవలే వీరికి బాగా గుర్తింపుతీసుకొచ్చింది. మార్క్సిస్టు ఉద్యమాల్ని స్త్రీ, దళిత ఉద్యమాలు బలహీనం చేశాయనేది అతని అభిప్రాయం. అతను రాసిన "ఈ పోరాటం ఆగదు" లోని కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనాయి.

రచనలు[మార్చు]

  • కూలి విజయం (నాటిక) -1985
  • బాలవీరులు - 1994
  • పోరుబాట - 1996
  • మాదిగపల్లె - 1998
  • ఈ పోరాటం ఆగదు (కథా సంపుటం) -1992
  • ఉతికేసిన బతుకులు - 2001

"ఈ పోరాటం ఆగదు" కథా సంపుటంలో ఆడది ఆటబొమ్మ కాదు, ఈ పోరాటం ఆగదు, ఉన్నదంతా ఊడగొడదాం, ఏది కులం, కులమతాలను కూల్చండి, బతుకు పోరు, బుడ్డపాలేరు, మాంసంకూర, మాన్యులం, సబల , సేవ్‌మి అనే కథలు వివిధ మాస, త్రైమాసిక పత్రికలలోనే కాకుండా "పుస్తకం" ప్రత్యేక సంచికలో కూడా ప్రచురితమయ్యాయి.

2001లో అతను చాకలి వాళ్ల మీద రాసిన నవల 'ఉతకేసిన బతుకులు'. చాకలి వాళ్ల బతుకు ఇతివృత్తంగా వచ్చిన నవల ఇది. ఈ పుస్తకంలో 1937లో ముసలయ్య గారు పాలకొల్లు నుండి నడిపిన 'ఆంధ్ర రజక పత్రిక' నుండి 1982లో వచ్చిన 'రజకదీపిక' వరకు ప్రస్తావించారు. ఒక చాకలి కుటుంబంలోని మూడు తరాల ముచ్చట్లు ఈ పుస్తకంలో ఉన్నాయి. [2]

"మాదిగపల్లె" నవలలో దళిత జీవిత వాస్తవాల్ని, వాళ్ళు అనేక రకాలుగా ఎదుర్కొంటున్న సమస్యల్ని వివరించాడు. దళితులను చైతన్యపరిచి, వారిని సంఘటిత పరుస్తుంటే, వాళ్ళను విడదీసి బలహీనుల్ని చేయడానికి పెద్దలు ఎలా ప్రయత్నిస్తారో చెప్పాడు.[3]

మూలాలు[మార్చు]

  1. "కథానిలయం - View Writer". kathanilayam.com. Retrieved 2020-07-12.
  2. "'ఉతికేసిన బతుకులు'.. | నిజామాబాద్ | www.NavaTelangana.com". NavaTelangana. Archived from the original on 2020-07-13. Retrieved 2020-07-12.
  3. "1991 – 2005 తెలుగు నవల – విస్తరించిన వివిధ కోణాలు – Page 3 – ఈమాట" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-07-12.