Jump to content

పి.వి.రాఘవరావు

వికీపీడియా నుండి

పి.వి.రాఘవరావు మాజీ అకౌంటెంట్ జనరల్.

జీవిత విశేషాలు

[మార్చు]

అతను అకౌంటెంట్ జనరల్ గా వృత్తి జీవితాన్ని ప్రారంభించాడు. తరువాత డెప్యుటేషన్ మీద ఆకాశవాణి డిప్యూటీ డైరక్టర్ జనరల్ (అడ్మినిస్ట్రేషన్) గా పనిచేసాడు. అతను కొత్త ఢిల్లీలోని పార్లమెంటు వీధిలోని ఆకాశవాణి భవనంలో ఉన్న ఆకాశవాణి డైరక్టరేట్ జనరల్ కార్యాలయంలో పనిచేసాడు. ఆకాశవాణి మాన్యువల్ రూపొందించిన ఘనత ఆంధ్రులకే దక్కింది. అతను 1956 లో మనుస్మృతి వంటి మాన్యువల్ తయారుచేశాడు. 1989 వరకు దానినే అనుసరించారు. 1989 లో మాన్యువల్ కు కొత్తరూపం యిచ్చారు. రాఘవరావుగారు పదవీ విరమణానంతరం హైదరాబాదులో 1992 లో పరమపదించారు. వీరి కుమారులు రాష్ట్రప్రభుత్వ కార్యదర్శిగా పనిచేస్తున్న పి.వి. రావు.[1]

మూలాలు

[మార్చు]
  1. "పుట:Prasarapramukulu022372mbp.pdf/13 - వికీసోర్స్". te.wikisource.org. Retrieved 2020-07-12.