పీటర్ క్లిఫోర్డ్
పీటర్ క్లిఫోర్డ్ | |
---|---|
జననం | పీటర్ స్టాన్లీ క్లిఫోర్డ్ 1959 నవంబరు 4 బెల్లింగెన్, న్యూ సౌత్ వేల్స్, ఆస్ట్రేలియా |
పీటర్ స్టాన్లీ క్లిఫోర్డ్ (జననం 1959, నవంబరు 4) ఆస్ట్రేలియన్ ఫస్ట్-క్లాస్ క్రికెటర్. తన కెరీర్‌లో తర్వాత న్యూ సౌత్ వేల్స్ బ్లూస్, క్వీన్స్‌లాండ్ బుల్స్ కోసం ఆడాడు. కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ గా రాణించాడు. 1983 - 1991 మధ్య క్రికెట్ ఆడాడు. అత్యుత్తమ సీజన్ 1984/85లో 12 మ్యాచ్‌లలో 51 సగటుతో 919 పరుగులు చేశాడు.
జననం
[మార్చు]పీటర్ స్టాన్లీ క్లిఫోర్డ్ 1959, నవంబరు 4న న్యూ సౌత్ వేల్స్‌లోని బెల్లింగెన్ లో జన్మించాడు.
కెరీర్
[మార్చు]క్లిఫోర్డ్ రాండ్‌విక్ కోసం గ్రేడ్ క్రికెట్ ఆడాడు. ఆస్ట్రేలియా అండర్-19 జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు.[1] 1982-83లో న్యూ సౌత్ వేల్స్ కి 12వ వ్యక్తిగా ఎంపికయ్యాడు.[2]
1983-84లో ట్రయల్ మ్యాచ్ లలో మంచి ప్రదర్శన కనబరిచిన తర్వాత క్లిఫోర్డ్ తన ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు.[3] తన మొదటి మ్యాచ్ లో 74 పరుగులు చేశాడు.[4] రెండవ మ్యాచ్ లో విక్టోరియాపై 152 పరుగులు చేశాడు.[5] తన తొలి సీజన్‌లో 88.60 సగటుతో 443 ఫస్ట్ క్లాస్ పరుగులు చేశాడు. గ్రేడ్ ప్రీమియర్‌షిప్‌ను గెలుచుకున్న రాండ్‌విక్ జట్టులో కూడా భాగంగా ఉన్నాడు.[6]
క్లిఫోర్డ్ అద్భుతమైన 1984-85 సీజన్‌ను కలిగి ఉన్నాడు, షెఫీల్డ్ షీల్డ్ ఫైనల్‌లో కీలకమైన 83 పరుగులతో సహా 919 పరుగులు చేశాడు, న్యూ సౌత్ వేల్స్ మ్యాచ్ ను డ్రా చేయడంలో, పోటీలో విజయం సాధించడంలో సహాయపడడ్డాడు.1985లో ఇంగ్లాండ్‌లో ఆడేందుకు అతనికి స్కాలర్‌షిప్ ఆఫర్ చేయబడింది.
1985-86 సీజన్‌లో మరింత కష్టపడ్డాడు, 30.46 సగటుతో 396 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియన్ అండర్ 25 జింబాబ్వే పర్యటనలో ఎంపికయ్యాడు.
1986-87 సీజన్లో పేలవంగా ఉన్నాడు, 24 వద్ద 120 పరుగులు చేశాడు.
1988-89లో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కి తిరిగి వచ్చాడు, 30.11 సగటుతో 271 పరుగులు చేశాడు. తదుపరి సీజన్‌లో మెరుగ్గా ఉన్నాడు, 36 వద్ద 432 పరుగులు చేశాడు.
ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఈ చివరి సీజన్, 1990-91లో, 22 వద్ద 183 పరుగులు చేశాడు.
మూలాలు
[మార్చు]- ↑ "CRICKET Short list for grant". The Canberra Times. Vol. 55, no. 16, 563. Australian Capital Territory, Australia. 31 January 1981. p. 44. Retrieved 14 June 2017 – via National Library of Australia.
- ↑ "Victoria faces tough task at the MCG". The Canberra Times. Vol. 57, no. 17, 288. Australian Capital Territory, Australia. 28 January 1983. p. 18. Retrieved 14 June 2017 – via National Library of Australia.
- ↑ "All-rounder Spring recalled by NSW for Cup final". The Canberra Times. Vol. 58, no. 17, 530. Australian Capital Territory, Australia. 27 September 1983. p. 20. Retrieved 14 June 2017 – via National Library of Australia.
- ↑ "CRICKET Newcomer, discard save NSW". The Canberra Times. Vol. 58, no. 17, 639. Australian Capital Territory, Australia. 14 January 1984. p. 42. Retrieved 14 June 2017 – via National Library of Australia.
- ↑ "VICTORIA v N.S.W. Youngsters are stars". The Canberra Times. Vol. 58, no. 17, 654. Australian Capital Territory, Australia. 29 January 1984. p. 32 (SUNDAY EDITION). Retrieved 14 June 2017 – via National Library of Australia.
- ↑ "CRICKET Randwick win a dream realised". The Canberra Times. Vol. 58, no. 17, 731. Australian Capital Territory, Australia. 15 April 1984. p. 31. Retrieved 14 June 2017 – via National Library of Australia.
బాహ్య లింకులు
[మార్చు]- పీటర్ క్లిఫోర్డ్ at ESPNcricinfo
- Peter Clifford at Cricket Archive