Jump to content

పీ ఎం విశ్వకర్మ పథకం

వికీపీడియా నుండి

దేశంలోని కులవృత్తుల వారికి తక్కువ వడ్డీకి పూచీకత్తులేని రుణ సాయం అందించే ' పీ ఎం విశ్వకర్మ ' పథకాన్ని 2023 సంవత్సరం సెప్టెంబరు 17వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు[1]. ఢిల్లీలోని అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ ' యశోభూమి ' లో ఈ కార్యక్రమం నిర్వహించారు[2]. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన 73వ పుట్టినరోజుతో పాటు విశ్వకర్మ జయంతి సందర్భంగా ' పీ ఎం విశ్వకర్మ ' పథకానికి శ్రీకారం చుట్టారు[3]. పీ ఎం విశ్వకర్మ పథకం ద్వారా ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన 18 వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరనుంది. దీని ద్వారా ఐదు సంవత్సరాలలో ( 2023-24 నుంచి 2027-28 ) వరకు 30 లక్షల మంది చేతివృత్తుల వారికి రూ. 13,000 కోట్ల రుణం సాయం అందనుంది. రానున్న ఐదు సంవత్సరాల కాలంలో అమలు చేయనున్న పీ ఎం విశ్వకర్మ పథకం కింద లబ్ధిదారులకు ఎటువంటి పూచీకత్తు లేకుండా రూ. మూడు లక్షల వరకు వ్యవస్థాపక/ వ్యాపార అభివృద్ధి రుణం అందిస్తారు. మొదటి విడతలో రూ. 1 లక్ష రుణం అందిస్తారు. దీన్ని 18 నెలల్లో తిరిగి చెల్లించాలి. తర్వాత రెండో విడతలో రూ. 2 లక్షలు అందిస్తారు. ఈ రుణాన్ని 30 నెలలలో లబ్ధిదారులు తిరిగి చెల్లించాలి. వడ్డీ రేటు విషయానికి వస్తే లబ్ధిదారుల నుంచి కేవలం 5 శాతం వడ్డీ వసూలు చేస్తారు. మిగిలిన 8 శాతం వడ్డీని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ ద్వారా ప్రభుత్వం చెల్లిస్తుంది. పీ ఎం విశ్వకర్మ పథకం కింద తక్కువ వడ్డీ రుణంతో పాటు లబ్ధిదారులకు మొదట 5 - 7 రోజులు (. 40 గంటలు ) ప్రాథమిక శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత వారి నైపుణ్యని ధ్రువీకరిస్తూ సర్టిఫికెట్, గుర్తింపు కార్డు ఇస్తారు. మరింత ఆసక్తి కలిగిన అభ్యర్థులు 15 రోజులు అది నాతో శిక్షణ కోసం కూడా నమోదు చేసుకోవచ్చు.

మూలాలు

[మార్చు]
  1. "PM Vishwakarma Yojana: 5 శాతం వడ్డీతో రూ.3 లక్షల లోన్.. ఏ వృత్తుల వారు అర్హులంటే?". Samayam Telugu. Retrieved 2023-12-03.
  2. Desk, HT Telugu. "PM Vishwakarma Scheme : రూ.3 లక్షల లోన్... పీఎం విశ్వకర్మ పథకానికి ఇలా దరఖాస్తు చేసుకోండి". Hindustantimes Telugu. Retrieved 2023-12-03.
  3. "PM Vishwakarma Scheme: పీఎం విశ్వకర్మ స్కీమ్ ద్వారా రూ.3 లక్షల లోన్... ఇలా అప్లై చేయండి". News18 తెలుగు. 2023-09-18. Retrieved 2023-12-03.

4. pm vishwakarma login