Jump to content

పుడోవ్ కిన్

వికీపీడియా నుండి

పుడోవ్ కిన్ సోవియట్ ఫిల్మ్ దర్శకుడు(1893-1953)

పుడోవ్ కిన్ సోవియట్ ఫిల్మ్ దర్శకుడు, సినిమాకళ సిద్ధాంతవేత్త, తన సినిమాలలో పాత్రల అంతరంగాన్ని దృశ్యాలలో అద్భుతంగా వ్యాఖ్యానించగలడని పేరుపడ్డాడు. మొదటి ప్రపంచయుద్ధంలో గాయపడి, మూడేళ్లు జర్మనీదేశంలో ఖయిదీగా ఉన్నాడు. రసాయనశాస్త్రం చదివినా, నాటకరంగం అతణ్ణి ఆకర్షించింది. సోవియట్ మూకీచిత్ర యుగంలో ఐజెన్ స్టయిన్ తర్వాత ఇతనే సోవియట్ సినిమాలో గొప్పపేరు పొందాడు. ఇతని సినిమాలు ఒక గీతంలా సాగుతాయని సుప్రసిద్ధ సోవియట్ సినిమా విమర్శకుడు Leon Moussinac అభిప్రాయం. D.W.గ్రిఫిత్ చూపిన మార్గాన్ని అనుసరిస్తూ, ఇతను సినిమకళలో చాలాకాలం నిలిచిపోయే విధానాలను ప్రవేశపెట్టాడు. పుడోవ్ కిన్ రచించిన సినిమా సిద్దాంత గ్రంథాలు Filmtechnic, Film Actimg లలో సినిమకళను, ఆశాస్త్రాన్ని విశ్లేషించి, ప్రతిపాదించిన సిద్ధాంతాలు మూగ సినిమాలగురించే ఐనా, ఈనాటికీ అన్నిదేశాల్లోనూ సినిమాకళను అధ్యయనం చేసే విద్యార్థులు వాటిని నిశితంగా పరిశీలిస్తారు. పుడోవ్ కిన్.లో నటుడు, దర్శకుడు, రచయిత, బోధకుడు-అనేక పార్శ్వాలున్నాయి. LeV Kuleshov ఫిల్మ్ ప్రయోగశాలలో సభ్యుడుగచేరి, మాంతాజ్(Montage)ప్రక్రియలను గురించి పరిశోధించాడు. సోవియట్ సినిమా చరిత్రలోనే పుడోవ్ కిన్ End of Saint Peters' Burg(1927) అమ్మ (1928 Mother), strom over Asia(1928) సినిమాలు శాశ్వత స్థానం సంపాదించుకొన్నవి. ఐజెన్ స్టేయిన్ కనిపెట్టిన 'మాంతాజ్' కూర్పు శిల్పాన్ని వాడుకొని విప్లవప్రజానీకం యొక్క శక్తిని ప్రదర్శించాడు. అతను మనుషుల వ్యక్తిగత శౌర్యపరాక్రమాలను ఆదర్శీకరించడానికి ఈ సిద్ధాంతలనే వాడుకొన్నాడు. 1935లో పుడోవ్ కిన్ కారుప్రమాదంలో గాయపడి, మళ్లీ 1938లో సినిమారంగంలోకి వచ్చాడు.అసయం 1932 లోనే ఆయన పార్టీ సభ్యత్వం తీసుకొన్నాడు. Order of lenin, stalin prize పురస్కారాలతో సోవియట్ దేశం అభినందించింది.

Motherను "personal Epic of Pudovkin" అని విమర్శకులు అంటారు. మనిషిని, మనిషి అనుభవాలనూ విడవకుండానే, విస్మరించకుండానే ఒక చారిత్రిక సందర్భాన్ని ఈ సినిమా వివరిస్తుంది. 1905 లో విఫలమయిన విప్లవాన్ని గోర్కీ మదర్ నవల ఆధారంగా ఈ సినిమాలో చిత్రీకరించాడు. అమ్మ పాత్రలో Vera Bara Nov Kaskaya నటించింది. కొడుకు పాత్రను NIKOL AI BATALOV పోషించాడు. కొడుకు చనిపోయిన తరవాత జార్ నియంతృత్వానికి వ్యతిరేకంగా అమ్మ రాజకీయ పోరాటం జరుపుతూ, కార్మికుల ప్రదర్శనలో చనిపోతుంది.'అమ్మ' సినిమాలో ప్రజాప్రదర్శనలు, జార్ మనుషులు జరిపిన హింస, ఉద్యమంలో మనుషులు- ఆ దృశ్యాలు మరపురావు. అమ్మ కుమారుడు తనను కారాగారం నుంచి విడుదల చేస్తారని భావించిన సందర్భంలో ఒక కలకంటాడు. ఆ సన్నివేశంలో అమ్మ ముఖంమీద రష్యాదేశపు వసంతకాలం దృశ్యాలు సూపర్ ఇంపోస్ చేస్తాడు. పుడోవ్ కిన్ రష్యా విప్లవం మీద తీసిన మూడు సినిమాలలో అమ్మ మొదటిది. End of Saint Peters' Burg, Storm over Asia మిగతా రెండు భాగాలు.

మూలాలు:1, Sergei Eisenstein'Notes of a Film Director', Foreign Languages Publishing House, Moscow. 1980 లో నేను Pune Film and T.V.Institute లో విన్న పాఠాలు, అక్కడి గ్రంథాలయంలో తీసుకొన్న నోట్స్.