పురాణపండ రాధాకృష్ణమూర్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పురాణపండ రాధాకృష్ణమూర్తి తెలుగు రచయిత, ఆధ్యాత్మిక వేత్త. అతను భారతీయ సనాతన ధర్మం ప్రసాదించిన ఆధ్యాత్మిక భావజాల ప్రచారం కోసం కృషి చేసాడు. అతను శ్రీ రామ రక్షా స్తోత్రం కోటి ప్రతులను ప్రచురించి ఉచిత వితరణ చేసి తెలుగు వారందరికీ సుపరిచితులైనాడు. అతను ఋషులు ప్రసాదించిన పురాణేతిహాస కావ్యాల ఆధారంగా తెలుగు ఆధ్యాత్మిక ప్రపంచానికి సుమారు 500 పైచిలుకు రకాల గ్రంథాలను రచించి, సంకలనం చేసి ప్రచురించి వీలైనంతవరకు ఉచితంగా అందజేసాడు. శ్రీ లలితా పరాభట్టారికా దేవి ఉపాసకులుగా, సీతారామ హనుమంతుల ప్రార్థన చైతన్యంతో ఆత్మ సమర్పణ భావంతో కూడిన యజ్ఞమయ్య జీవితాన్ని గడిపిన అతను అనేక గ్రంథాలను రచించాడు.

ఈనాటికి తెలుగు లోకి ఇళ్లలో తెలుగు లోగిళ్ళలో లక్షల మంది హృదయాలలో శ్రీ రామ రక్షా స్తోత్ర మంత్ర ధ్వనులు నృత్యం చేస్తున్నాయంటే ... అది నూటికి నూరు శాతం బుధ కౌశిక మహర్షి సాక్షిగా రాధాకృష్ణమూర్తి గారి పుణ్య చైతన్యమే అని ఈనాటి ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు సైతం అనేక సందర్భాల్లో పేర్కొనడం గమనార్హం.[ఆధారం చూపాలి]

రచనలు[మార్చు]

 1. హనుమచ్చరిత్ర
 2. శ్రీ గాయత్రీ దివ్యశక్తి
 3. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం
 4. శ్రీ లలితా స్తోత్రమంజరి[1]
 5. శ్రీ లలితా దివ్యస్తోత్ర మంజరి
 6. శ్రీలలితోపాసనా సర్వస్వము
 7. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రరత్నము
 8. శ్రీ దుర్గాదేవీ మహాత్మ్యము
 9. దివ్యవాణి
 10. శ్రీ దుర్గాదేవీ వైభవము
 11. నవదుర్గలు
 12. దేవీనవరాత్రగాథ
 13. దుర్గానందలహరి
 14. శ్రీ దుర్గాదేవీ మాహాత్మ్యము
 15. సకల కార్యసిద్ధికి సుందరకాండ
 16. సుందరకాండ సారాంశము
 17. సుందరకాండ వైభవము
 18. రామాయణములో కొన్ని ఆదర్శపాత్రలు
 19. అధ్యాత్మ రామాయణము
 20. అధ్యాత్మ రామాయణ విజ్ఞానము
 21. ఆంజనేయ వైభవము
 22. శ్రీ హనుమత్ప్రభ[2]
 23. శ్రీ ఆంజనేయ పూజావిధానము
 24. భాగవతామృతము
 25. శ్రీమద్భాగవతమాహత్మ్యము(పద్మపురాణం)
 26. శ్రీమద్భాగవత రహస్యము
 27. భాగవత జ్యోతి
 28. శ్రీమద్బాగవత మహాపురాణం
 29. భాగవత ప్రభ
 30. భాగవత వాణి
 31. రుక్మిణీ కల్యాణము
 32. శ్రీరామ వాణి
 33. శ్రీకృష్ణ వాణి
 34. శ్రీరామనామ మహిమ
 35. కళ్యాణ వాణి
 36. శ్రీరామరక్షా స్తోత్రము
 37. శివానంద సౌందర్యలహరులు
 38. అష్టవినాయకులు
 39. శ్రీదేవి ప్రార్థనలు
 40. శివ స్తోత్ర రత్నాలు
 41. శ్రీవిష్ణు సహస్ర నామస్తోత్రం
 42. పార్వతీ కళ్యాణము
 43. శివ స్తోత్రమంజరి
 44. శివ స్తోత్రాలు
 45. దివ్య స్తోత్ర రత్నావళి
 46. శ్రీకృష్ణలీలామృతము
 47. మణిద్వీపవర్ణన
 48. ఉపనిషద్వాణి
 49. భీష్మ పితామహుడు
 50. శ్రీ దత్తాత్రేయ స్తోత్రరత్నాలు
 51. మహాదాత కర్ణ
 52. శోకశాంతికి ఉపాయాలు
 53. శ్రీ సువాసినీ పూజా విధానము
 54. మహాలక్ష్మీ పూజా విధానము
 55. భక్త ఉద్ధవ
 56. మహాదాత కర్ణ
 57. సత్క ధామంజరి 25 సంచికలు
 58. పరమార్థవాణి 51 సంచికలు
 59. శ్రీ గణేశ లీలలు
 60. శ్రీ గాయత్రీ దివ్య శక్తి

ఇలా ఎన్నో ఎన్నెన్నో అత్యద్భుతమైన గ్రంథాలను ఈ జాతికి అందించాడు.

మూలాలు[మార్చు]