పురూరవుడు

వికీపీడియా నుండి
(పురూరవ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఊర్వశి, పురూరవుడు, రాజా రవివర్మ చిత్రపటం.

పురూరవుడు చంద్రవంశానికి చెందిన ఒక రాజు. ఆయన తల్లిదండ్రులు చంద్రవంశ సంజాతుడైన బుధుడు, మనువు కూతురైన ఇళ.

మంచి అందగాడు, పరాక్రమవంతుడు కావడంతో ఆయన కీర్తి దేవలోకానికి కూడా పాకింది. ఇంద్రుడు అవరసమైతే అప్పుడప్పుడు పురూరవుని సహాయం కోరేవాడు. ఒకసారి ఇంద్రుడు ఆయనను అమరావతికి ఆహ్వానించాడు. పురూరవుడు తిరిగి తన రాజ్యానికి వెళుతుండగా కొంతమంది అప్సరసలు వచ్చి ఊర్వశిని కేశి అనే రాక్షసుడు అపహరించారని చెబుతారు. అప్పుడు పురూరవుడు ఆ రాక్షసుని వెంబడించి ఊర్వశి ఆ చెర నుండి విడిపిస్తాడు. ఆ సమయంలో వారిరువురూ ఒకరికొకరు ఆకర్షితులవుతారు.

రాజ్యానికి వచ్చిన పురూరవునికి ఆమె తలపులలో మునిగిపోయి కర్తవ్యాన్ని కూడా సరిగా నిర్వర్తించలేకుంటాడు. మరో వైపు ఊర్వశి కూడా అతన్ని విడిచి ఉండలేకుండా ఉంటుంది. చివరికి ఇంద్రుని అనుమతితో అతన్ని వివాహం చేసుకుంటుంది. ఆ వివాహానికి ఇంద్రుడు కూడా వెళ్ళి వారిని ఆశీర్వదించి, మరలా ఎప్పుడైనా సహాయం అవసరం అయితే చేయాలని పురూరవుని దగ్గర మాట తీసుకుని వస్తాడు. ఆ తరువాత తన రాజ్యాన్ని బాగా విస్తరిస్తాడు.

పురూరవుడికి ఊర్వశి ద్వారా ఆరు మంది సంతానం కలుగుతుంది. వారు ఆయు, అమావసు, ధిమన, విశ్వాయు, ధృధాయు, శృతాయు.

మరణం ఒకసారి పురూరవుడు నైమిశారణ్యానికి వేటకి వెళతాడు. అక్కడ కొంత మంది యోగులు యజ్ఞం చేస్తూ ఉంటారు. వారు చేతిలో బంగారు పాత్రలు ఉంటాయి. పురూరవుడు ఆ బంగారు పాత్రల్ని చూసి అవి క్షత్రియుల, వైశ్యుల చేతిలోనే ఉండాలనీ సాధువుల చేతిలో అలాంటివి అంతగా బాగుండవని అంటాడు. ఆ మాటలకు సాధువులు నొచ్చుకుంటారు. అంతే కాకుండా సాధువులకు బంగారంపై ఆశ ఎందుకనీ ఆ పాత్రల్ని లాక్కోవడానికి ప్రయత్నిస్తాడు. దాంతో ఆ సాధవులకు కోపం వచ్చి మండుతున్న కట్టెలను వారిపై విసిరేస్తారు. ఊహించని ఈ పరిణామం నుండి తేరుకునే లోపే పురూరవుడు అతని సేవకులు మరణిస్తారు. [1]

మూలాలు

[మార్చు]
  1. History of Ancient India, Chapter 18 by J.P.Mittal