పుల్లంశెట్టి సోనీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పుల్లంశెట్టి సోనీ ఆరోగ్య సంరక్షణ రంగంలో పరిశోధకురాలు. ఊపిరితిత్తులో, హైపర్ టన్షన్ ఏర్పడటం వంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీసే "అణువ్యవస్థ పనితీరు" ను కనుగొని, దానిని సవివరంగా తెలియజేయడానికి పరిశోధన చేస్తున్న పరిశోధకురాలు.[1]

జీవిత విశేషాలు[మార్చు]

ఆమె హైదరాబాదులో విద్యాభ్యాసం చేసారు. విధార్థి దశలో ఉన్నప్పటి నుంచీ ఆమెకు సైన్స్ మరియు ఈవశాస్త్రం పై ఆమెకు అభిరుచి ఎక్కువ. కొత్తగా ప్రవేశించి త్వరితగతిన ఎదుగుతున్న బయోటెక్నాలజీ రంగంవైపు ఆకర్షితులయ్యారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మైక్రో బయాలజిలో డిగ్రీ చేసారు. జంతుశాస్త్రంలో, రసాయన శాస్త్రంలో స్వర్ణపతకాలను సాధించారు. బయోటెక్నాలజీ పై ఆసక్తి, అభిరుచి పెంచుకొని ఛత్తీస్‌ఘఢ్ రాష్ట్రంలోని గురుఘాసీదాస్ విశ్వవిద్యాలయంలో బయోటెక్నాలజీ లో పి.జి. చేసారు. అక్కడ మరో స్వర్ణం అందుకున్నారు.

తిరిగి హైదరాబాదు చేరుకొని, శాంతా బయోటెక్ సంస్థలో చేరి, ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన కొన్ని ప్రాజెక్టులలో పరిశోధకురాలిగా పనిచేసారు. ఫార్మాస్యుటికల్ రంగంలో ఖ్యాతి గడించిన శాంత బయోటెక్ లో చేరిన ఆమెకు ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన అమ్శాఅలమీద ప్రాథమిక పరిజ్ఞానం ఏర్పడింది. సమగ్ర అవగాహన కలిగింది. పోస్టు గ్రాడ్యుయేట్ విద్యార్థినిగా సిలబస్ ల సరిహద్దులకు పరిమితం కాకుండా, శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పెంచుకోవడాఅనికి, ఆ రంగంలో అంతర్జాతీయ ప్రమానాలను అందుకునే దిశగా పురోగమించడాఅనికి కృషి పరిశోధకురాలిగా మారిన తరువాత ఎంతగానో ఉపయోగపడింది.

ఆమె బయోటెక్ లో పరిశోధనారంగంలో కృషి చేస్తున్నప్పుడే జర్మనీలో పరిశోధన చేసే అవకాశం ఈమెను వెతుక్కుంటూ వచ్చింది. యూనివర్శిటీ ఆఫ్ గిసెన్‌లంగ్ సెంటర్ లో పరిశోధనలు చేసారు. ఊపిరితిత్తుల వ్యాధుల కారకాల మిద చేసిన పరిశోధనలు ఇంకా జరుగుతున్నాయి. జర్మనీలోని గిసెన్ నగరంలోని జుస్టుస్-సిబిగ్ విశ్వవిద్యాలయంలో పి.హెచ్.డి కూడా చేసారు.[2]

పురస్కారాలు[మార్చు]

ఆమెకు జర్మనీలోని "రెన్ బామార్ట్ ఫౌండేషన్" పరిశోధక అవార్డును 2005 లో లభించింది. ఈ పురస్కారం పొందిన తొలి యువ విదేశీ పరిశోధకురాలు అమె కావడం విశేషం.

మూలాలు[మార్చు]

  1. Molecular Mechanisms of Pulmonary Vascular Diseases
  2. ఆంధ్ర శాస్త్రవేత్తలు. విజయవాడ: శ్రీవాసవ్య. 1 July 2011. p. 150. |access-date= requires |url= (help)

ఇతర లింకులు[మార్చు]