Jump to content

పుల్లయ్య వేమారం(వేమవరం) వెళ్ళొచ్చినట్లు

వికీపీడియా నుండి

'పుల్లాయావారం చేసావ్.' ఇది మాట వాడుక. సరిగా జరగని లేదా ప్రయోజనము లేక జరిగిన పనిని గురించి వాడబడు పదం. ఆచంట షావుకారు తన పనివాడు పుల్లయ్యకు చెప్పాడు ఇలా "ఒరే పుల్లయ్యా రేప్పొద్దున్నే ఓసారి వేమారం వెళ్ళిరావాల్రా పెందలకడనే లేచి". అప్పుడు పుల్లయ్య "సరేనండయ్యా" అని పుల్లయ్య ఇంటికెళ్ళి పడుకొని మరునాటి ఉదయమే లేచి వేమవరం వెళ్ళి వచ్చేసాడు .తాపీగా మధ్యాహ్నానానికి వచ్చిన పుల్లయ్యను చూసి "ఏరా పుల్లయ్యా ఎక్కడికి పోయావ్ పొద్దున్నే వేమవరం వెళ్ళాలన్నానుగా " అన్నాడు షావుకారు. అప్పుడు పుల్లయ్య "అయ్య నేను పొద్దున్నే లేచి ఎల్లొచ్చేసేనయ్యా ఏమారం" అన్నాడు మన పిచ్చి పుల్లయ్య . "నేను పనేంటో చెప్పకుండా ఎలా వెళ్ళావు. ఎందుకెళ్ళావు ?ఎందుకొచ్చావు? నీకు చెప్పడం నా తప్పు " అని వాపోయాడు షావుకారు.

పై కథనం మీదుగా ఈ సామెత పుట్టిందని ఒక వాదన.

మరొక కథనం ఈ సామెత మీదుగా.

సింగడు అద్దంకి వెళ్లినట్టు (సిద్దడు అద్దంకి వెళ్ళొచ్చినట్టు) - యజమానుల దగ్గర సిద్దడు పనివాడు, ఏంచెప్పినా సరిగా చేయడని అనుకొంటుంటారు. ఒక రోజు రాత్రి యజమానులు తనను ప్రొద్దున్నే అద్దంకి పంపించాలనుకోవటం విని, ఎలాగైనా మెప్పు పొందవచ్చని, అక్కడ పనేంటో తెలుసుకోకుండానే వాళ్ళు లేచే సరికి అద్దంకి వెళ్ళి వచ్చాడు. వివరం /ఉపయోగం లేకుండా ఎవరైనా వ్యక్తి పనిని చేసే సందర్భంలో ఈ సామెతను వాడతారు.

అసలు సామెత " సింగడు అద్దంకి పోనూ పోయాడు రానూ వచ్చాడు " అని. దీని వివరం ఒక భార్యా భర్త పొద్దు పోయిన తరువాత రేపు సింగడిని (తమ పాలేరు) అద్దంకి పంపాలి అని అనుకోవడం విని. అద్దంకి వెళ్ళవలసిన అవసరం ఏమిటో తెలుసుకోకుండా, తెల్లవారకముందే సింగడు అద్దంకి వెళ్ళి వస్తాడు. తొందరపాటుతో అసలు విషయం తెలుసుకోకుండా నిష్ప్రయోజకరమైన పనులుచేసే వారికి ఈ సామెత వాడుతారు.